జాతీయం, నవంబర్ 19 నవంబర్, 2022: భారతదేశంలో అతిపెద్ద షార్ట్ వీడియో యాప్ అనగానే అందరికి గుర్తుకువచ్చేది మోజ్ యాప్. ఇప్పటికే అద్భుతమైన కంటెంట్ ద్వారా అందరికి దగ్గరైన మోజ్ … ఇప్పుడు తమ కంటెంట్ క్రియేటర్స్‌కు సినిమా అవకాశాలు కూడా తెచ్చిపెడుతోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో తిరుకుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హైనా అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమా నిర్మాత సీవీ కుమార్.. హైనా సినిమాలో ప్రధాన పాత్రలో నటించే వారికోసం మోజ్ యాప్‌తో కలిసి ఆడిషన్స్ నిర్వహించారు. #HyenaAuditionsOnMoj పేరుతో 40 రోజుల పాటు ఈ క్యాంపెయిన్‌ని నిర్వహించారు. ఈ క్యాంపెయిన్ ఆగస్ట్ 29న ప్రారంభమైంది. ఈ క్యాంపెయిన్‌లో 15K మోజ్ క్రియేటర్స్ నుంచి 175K వీడియోలను మరియు 1.9 బిలియన్ల వీడియోలను వీక్షించారు. ఈ వీడియోల్లో చెన్నైకి చెందిన 24 ఏళ్ల మోజ్ క్రియేటర్ రియా నేహాల్ ప్రధాన నటిగా ఎంపికైంది. అలాగే బెంగళూరుకి చెందిన 23 ఏళ్ల ఐశ్వర్య కన్నన్ సపోర్టింగ్ కాస్ట్ మెంబర్‌గా ఎంపికయ్యారు. 175K కంటే మంది ఇందులో పాల్గొన్నారు.
హైనా సినిమాను ప్రముఖ నిర్మాత C.V కుమార్ నిర్మిస్తున్నారు. ప్రతిభ గల వారికి అవకాశాలు ఇస్తూ… మంచి మంచి సినిమాలు రూపొందించే బ్యానర్‌గా తిరుకుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు పేరుంది. గతంలో ఈ బ్యానర్ నుంచి అతను అట్టకత్తి, పిజ్జా మరియు సూదు కవ్వం వంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ హైనా సినిమాతో ప్రశాంత్ చందర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
రియా మరియు ఐశ్వర్య ఇద్దరూ తమిళంలో అనర్గళంగా మాట్లాడగలరు. వారికున్న టాలెంట్‌తో పాటు… భాషాపరమైన సమస్య కూడా లేకపోవడంతో… వారిని విజేతలుగా ఎంపికచేశారు. వారు కూడా తమకు సినిమా అవకాశం రావడంతో చాలా ఆనందంగా ఉన్నారు. మరోవైపు మోజ్ లాంటి ఒక షార్ట్ వీడియో యాప్ ద్వారా భారతదేశంలో సినిమా ఆడిషన్ జరగడం ఇదే మొదటిసారి. దీనిద్వారా కంటెంట్ క్రియేటర్స్‌కు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం, అలాగే సినిమాలో ఛాన్స్ లభించింది. మోజ్ యాప్ వీడియోల్లో క్రియేటర్‌ల స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ ఎబిలిటీ, ఎక్స్‌ప్రెషన్స్, కెమెరా రెడీనెస్ ఆధారంగా తుది విజేతలను నిర్మాత మరియు దర్శకుడు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా హైనా సినిమా నిర్మాత C.V కుమార్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “భారతదేశంలో టాలెంట్ ఉన్నవాళ్లకు ఏమాత్రం కొదవలేదు. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ మోజ్‌లో మేం నిర్వహించిన ఆడిషన్ వల్ల టాలెంట్ ఉన్న వాళ్లని వెతికి పట్టుకునే అద్భుతమైన అవకాశం మాకు లభించింది. ఇలా ఎంపికైన వారు భవిష్యత్తులో సూపర్‌స్టార్‌లుగా మారే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మోజ్ ద్వారా మేం వేలాది ఎంట్రీలు అందుకున్నాం. మేము నిజంగా గొప్ప ప్రతిభను చూశాము. అయితే రియా మరియు ఐశ్వర్య అసాధారణమైన నటనా సామర్ధ్యాలు మరియు నృత్య నైపుణ్యాలతో స్పష్టమైన విజేతలుగా నిలిచారు.
ఇక రియా మరియు ఐశ్వర్యల విషయానికి వస్తే… ఈ అవకాశంల వారి చిరకాల కోరిక నిజమైంది.
"సాధనమున పనులు సమకూరు ధరలోన" అనే సామెతను ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని నేను ఇప్పుడు ఓ తమిళ్ సినిమా చేస్తున్నాను. నన్ను నేను నిరూపించుకునేందుకు ఇదోక అద్భుతమైన అవకాశం. మోజ్ యాప్‌లో నాకు 626 కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. నా ప్రతిభను ఇంత త్వరగా ప్రపంచం గుర్తిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ అవకాశాన్ని అందించినందుకు మోజ్‌కి నేను రుణపడి ఉన్నాను. ఇన్ని ఎంట్రీల మధ్య నా టాలెంట్‌ని గుర్తించినందుకు నాకు చాలా థ్రిల్‌గా ఉంది అని చెప్పింది రియా.
ఇక బెంగుళూరుకు చెందిన ఐశ్వర్య మేకప్/ఫ్యాషన్/ జీవనశైలికి సంబంధించిన కంటెంట్‌ను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. ఈమెకు 845K ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా అవకాశంపై ఐశ్వర్య మాట్లాడుతూ, "నా నటన మరియు డ్యాన్స్ సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం నాకు ఒక పెద్ద సినిమాలో రావాలని నేను ఎప్పటినుంచో కలలు కన్నాను, అందుకోసం శ్రమించాను. ఈ అవకాశం నాకు అందించినందుకు నేను మోజ్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, మోజ్ ద్వారానే నాకు తొలి అవకాశం దక్కింది అని చెప్పింది ఐశ్వర్య.
ఈ సందర్భంగా మోజ్ కంటెంట్ స్ట్రాటజీ & ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ శ్రీ శశాంక్ శేఖర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… "భారతదేశంలో షార్ట్ వీడియో ఫ్లాట్‌ఫామ్ అయినటువంటి మోజ్‌లో ఒక సినిమా ఆడిషన్ విజయాన్ని మేము తొలిసారి చూసి చాలా థ్రిల్ అయ్యాము. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి మా క్రియేటర్‌లు ఈ ఆడిషన్‌లలో పాల్గొన్నారు. ఆకర్షణీయమైన మరియు సృజనాత్మక వీడియోలను పంచుకున్నారు. మోజ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఎల్లప్పుడూ యువ భారతీయులకు వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడం. అంతేకాకుండా వారికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో కీర్తి మరియు విజయాన్ని పొందేందుకు ఒక వేదికను అందించడం. మా క్రియేటర్‌లకు #HyenaAuditionsOnMojతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే అవకాశాన్ని అందించినందుకు మేము సంతోషిస్తున్నాము. మా మోజ్ స్టార్స్ రియా మరియు ఐశ్వర్య.. వెండితెరపై ఎప్పుడు కన్పిస్తారా అని మేం వెయిట్ చేస్తున్నాం. వారు సినిమాల్లో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం.
“ఈ ఆడిషన్‌కు క్రియేటర్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఇద్దరు సెలెక్ట్ అవ్వడంతో… మిగిలిన క్రియేటర్స్ కూడా రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి అవకాశాలను అందించడానికి మరిన్ని వినూత్న ఫార్మాట్‌లను తీసుకురావడానికి మాకు స్ఫూర్తినిస్తాయి. భారతదేశంలో ప్రతిభావంతులైన క్రియేటర్స్‌ను కనుగొనే అద్భుతమైన కార్యానికి ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు.
మోజ్ ఉన్న ప్రతీ ఒక్కరూ పాపులర్ ఎంటర్‌టైనర్‌లుగా గుర్తింపు పొందాలని, అలాగే వెండితెరపై కూడా అద్భుతంగా రాణించాలని కోరుకుంటోంది. ఇంకా చెప్పాలంటే అలాంటి అవకాశాలు కల్పించేందుకు మోజ్ సదా సిద్ధంగా ఉంటుంది. మోజ్ తన క్రియేటర్స్ కోసం క్రియేటివ్ సెల్ఫ్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లను అందించడం, సిఫార్సులు చేయడం మరియు కనెక్షన్‌లను నిర్మించడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఆడిషన్‌లను యాక్సెస్ చేయడంలో వారికి సహాయం చేస్తుంది. తద్వారా మ్యూజిక్ వీడియోలు, టెలివిజన్ మరియు చలనచిత్రాలలో పెద్ద బ్రేక్‌లను పొందడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.