*హైదరాబాద్ నగరాన్ని హరితమయం చేస్తున్న హెచ్.ఎం డి. ఎ.
*తెలంగాణకు హరితహారం కింద HMDA అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో 2022-23 లో 4.50 కోట్ల మొక్కలు నాటారు.
పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం వలన అందరికి అనువైన ఆవాసప్రాంతంగా మారిన హైదరాబాద్
హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న 158 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్మొ త్తాన్ని HMDA అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో పచ్చలహారంగా అభివృద్ధి
చేశారు.నగరంలో ఎటుచేసినా పచ్చని చెట్లు, పార్కులతో హైదరాబాద్ నగరం ఆహ్లాదకరంగా కనిపిస్తున్నది.ఓ ఆర్ ఆర్ పైనుంచి వెళ్లే వాహనదారులకి ఒక మంచి అనుబూతిని జ్ఞాపకంగా మిగుల్చుతున్నది. ముఖ్యమంత్రి కె, చంద్రశేఖర్ రావు మానసపుత్రికగా చేపట్టిన తెలంగాణకు హరితహారం అమలులో HMDA ముందున్నది.రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఆదేశాలు మేరకు నగరాన్ని అత్యంత నివాసయోగ్య ప్రాంతంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నది. అందులో భాగంగా HMDA ప్రతియేటా వివిధ ప్రాజెక్ట్స్ కింద కోట్లాది మొక్కలను నాటించి, సంరక్షిస్తున్నది. స్వంత నర్సరీలు ద్వారా నగరంలోని పలు ప్రాంతాలను లంగ్ స్పేస్ లుగా ఆహ్లాదకరంగా అభివృద్ధి చేస్తున్నది. HMDA (UF) ఆధ్వర్యంలో 2022-23 సీజన్‌లో రూ.298.09 కోట్లతో తెలంగాణకు హరితహారం కింద 4 కోట్ల 50 లక్షల మొక్కలను నాటారు. పచ్చదనం (TKHH)
అభివృద్ధిలో HMDA ముందున్నది. 71.15 లక్షల మొక్కలను నాటి ఔటర్ రింగ్ రోడ్ (158 కి.మీ.), ఇంటర్‌ఛేంజీలు (457.23 ఎకరాలు), సర్వీస్ రోడ్, రైల్వే కారిడార్లు మొదలైన వాటితో పాటు ఇంటెన్సివ్ ప్లాంటేషన్ ద్వారా గ్రీన్ కారిడార్ అభివృద్ధి చేసింది.
మొక్కలకు నీరందించేందుకు ORRలో బిందు సేద్యం పరికరాలు అమర్చారు. బిందు సేద్యం పరికరాలు Scada సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆటోమేషన్‌పై పని చేస్తున్నాయి ఈ పద్దతిని పాటించుట వలన ORRలో డ్రిప్ ఇరిగేషన్ కు రూ.5.09 కోట్లు ఆదా అవుతున్నది .11,6 కోట్ల 62 లక్షల వ్యయంతో HMDA పరిధిలో ఉన్న 14708.24 ఎకరాల విస్తీర్ణంలో (16) ఫారెస్ట్ బ్లాక్‌లలో "అర్బన్ లంగ్ స్పేసెస్"గా గ్రీనరిని,అభివృద్ధి చేస్తున్నది . (16) రిజర్వ్ ఫారెస్ట్ పార్కులలో, ఆరు పార్కులు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తేబడినాయి.HMDA పరిధిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, R & B రోడ్లు & HMDA రోడ్ల వెంట సెంట్రల్
మీడియన్ - మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్లు 672.5 కిమీలు, అవెన్యూ ప్లాంటేషన్లు 269.8 కిమీలు లను అభివృద్ధి చేయడం జరిగింది.. 2022-23 సీజన్‌లో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 5 కోట్ల మొక్కలను 42 నర్సరీలలో పెంచడం జరిగింది. హెచ్‌ఎండీఏకు చెందిన తెల్లాపూర్ నర్సరీ రాష్ట్రంలోని ఉత్తమ నర్సరీలలో ఒకటిగా గుర్తింపు పొందింది . HMDA పరిధిలోని (14) సరస్సులలో గ్రీనరీని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం వలన సేదతీర్చే ఆహ్లాదకర ప్రాంతాలుగా రూపోందాయి.
హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, నెక్లెస్రో డ్‌తో సహా (39) అర్బన్ పార్కులు అర్బన్ లంగ్ స్పేస్‌లుగా అభివృద్ధి చేయబడినాయి. తద్వారా యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ఆ ర్గనైజేషన్ (FAO) మరియు అర్బోర్ డే ఫౌండేషన్ వారు ట్రీ సిటీ అవార్డు అందించారు. హైదరాబాద్‌కు "ట్రీ సిటీ అవార్డు" రావడం ఇది రెండోసారి. 2020 సంవత్సరానికి 1వ అవార్డ్, 2021 సంవత్సరానికి 2వ అవార్డు లభించింది. పచ్చదనం పెంపుదలకు ప్రభుత్వం చేస్తున్న కృషికి లభించిన పురష్కారమిది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 నివేదిక ప్రకారం దేశంలో ఒక దశాబ్దంలో 48.66 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అత్యధిక గ్రీన్ కవర్‌ను పొందిన మెగా నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది.