మెట్రోరైల్ ఫేస్ -2 కారిడార్ DPR ఆమోదం,2023-24 బడ్జెట్ లో పెట్టాలని కేంద్ర మంత్రి పూరి కి లేఖ రాసిన మంత్రి కేటీఆర్
ప్రెస్ నోట్
హైదరాబాద్:14, నవంబర్ 2022.
*మెట్రోరైల్ ఫేస్ -2 కారిడార్ DPR ఆమోదం,2023-24 బడ్జెట్ లో పెట్టాలని కేంద్రమంత్రి హారదీప్ సింగ్ పూరి కి లేఖ రాసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
*31 km విస్తరణకు రూ.8,453 కోట్లతో DPR *
*బి.హెచ్.ఈ. ఎల్. నుండి లక్డికపూల్ వరకు 26 km & నాగోలు నుండి ఎల్. బి. నగర్ వరకు 5 km
దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటైన హైద్రాబాద్ నగరంలోని మెట్రో రైల్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ కారిడార్చే పట్టుటకు ఆమోదంతో పాటు బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని కోరుతూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి కి రాసిన లేఖలో రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్శాఖ మంత్రి కె. తారక రామారావు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో మెట్రోరైల్ కారిడార్ -2 ఆవశ్యకత గురించి వివరించారు.. చాలా వేగంగా పెరుగుతున్న నగర ప్రజల అవసరాలకనుగుణంగా కారిడార్ -2 కింద మెట్రో రైల్వి స్తరణ జరగాలని తెలిపారు.ఇప్పటికే మొదటి దశ కింద నడుస్తున్న మెట్రో రైల్ప్రా జెక్టు నగరానికే కలికితురాయిగా నిలిచిందని మంత్రి కె. టి. ఆర్. పేర్కొన్నారు. మెట్రో రైల్ ఫస్ట్ ఫేస్ లో 69 కిలోమీటర్ల నిడివిలో అందుబాటులోకి వచ్చి నగర రవాణా వ్యవస్థకు అండగా నిలుస్తున్నదని కేటీఆర్ ఆ
లేఖలో వివరించారు. వీజీఎఫ్ స్కీమ్ (వయబుల్ గ్యాప్ ఫండింగ్ ) పీపీపీ మోడ్ లో అమలు చేసిన హైదరాబాద్ రైల్ లైన్ ఫేస్-1 ప్రాజెక్ట్ ప్రపంచంలో పెద్ద మెట్రో ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందింధని తెలిపారు.ఈ నేపథ్యంలో రెండవ విడత 31 కిలోమీటర్ల నిడివిలో మెట్రోరైల్ ప్రాజెక్టు – 2 కారిడార్ పనులకై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి కె. టి.ఆర్. వెల్లడించారు.
1) బీ హెచ్ ఇ ఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కిలో మీటర్ల నిడివిలో 23 స్టేషన్లతో కనెక్ట్చే సే ప్రతిపాదన,
2) నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల నిడివిలో 4 స్టేషన్లను కనెక్ట్ చేసే ప్రతిపాదన తో కూడిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ను తయారు చేసినట్లు మంత్రి తనలేఖలో పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టుటకు గాను రూ.8453 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు లేఖలో వివరించారు. ఈ DPR తో పాటు అందుకు సంబందించిన అన్ని డాకుమెంట్స్ ను రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా అక్టోబర్ 22 న కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.అదేవిధంగా సెకండ్ ఫేస్ కు సంబందించిన ప్రతిపాదనల వివరాలు చర్చించడానికి కేంద్రమంత్రి అపాయింట్ మెంట్ ను మంత్రి కె. టి ఆర్ కోరారు. ముందస్తు సమాచారం కొరకు లేఖ ద్వారా వివరాలు తెలియ జేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎక్స్ టర్నల్ ఫైనాన్షియల్అ సిస్టెన్స్ తో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు పాలనాపరమైన సూత్రప్రాయ అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు – 2 కారిడార్ ప్రతిపాదనలను 2022-23 బడ్జెట్ లో పేర్కొనాలని మంత్రి కె.టి.ఆర్. కోరారు.