ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్స్ ద్వారా ఐఎస్‌సీసీఎం సౌజ‌న్యంతో వైద్యుల కోసం రోగుల పున‌రుజ్జీవ‌నంపై వ‌ర్క్ షాప్

Related image

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 12, 2022 ః   వైద్యారోగ్య సేవ‌ల రంగంలో న‌గ‌రంలో ప్ర‌ముఖ వైద్య సేవ‌ల సంస్థ ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్స్ , ఇండియ‌న్ సొసైటీ ఆఫ్ క్రిటిక‌ల్ కేర్ మెడిసిన్ (ISCCM)తో క‌లిసి నేడు మ‌రియు రేపు (న‌వంబ‌ర్ 12 & 13 తేదీల‌లో) రోగుల పున‌రుజ్జీవ‌నంపై  వైద్యుల కోసం వ‌ర్క్ షాప్ నిర్వ‌హిస్తోంది. ఎమ‌ర్జెన్సీ రూంలో అడ్మిట్ అయిన స‌మ‌యంలోనే కాకుండా ఇత‌ర సంద‌ర్భాల్లో రోగి పున‌రుజ్జీవ‌నం కోసం చేయ‌వ‌ల‌సిన చ‌ర్య‌లపై ఈ వ‌ర్క్‌షాప్ ప్ర‌ధానంగా దృష్టి కేంద్రీక‌రించింది. శ‌రీరంలోని  వివిధ భాగాలకు ప్రాణాపాయ ముప్పు క‌లిగిన సంద‌ర్భాలు మ‌రియు నిపుణుల అనుభ‌వాల‌ ఆధారంగా పున‌రుజ్జీవ‌న‌ నైపుణ్యాలు నేర్చుకోవడం, రోగిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించ‌డం మ‌రియు అత్యుత్త‌మ వైద్యారోగ్య ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌డంపై ఈ వ‌ర్క్ షాప్ ఉద్దేశించ‌బ‌డింది.

 
ఈ వ‌ర్క్‌షాప్‌ను డాక్టర్ వినోద్ డోగ్రా  మాజీ - మెడికల్ సుపీరిటెండెంట్ సాఫ్ దర్ జంఘ్ హాస్పిటల్ న్యూ ఢిల్లీ గారు ప్రారంభించారు. ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్స్ చైర్మ‌న్ & మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ దండు శివ‌రామరాజు, ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ డీవీఎస్ సోమ‌రాజు, ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్స్ సీఈఓ శ్రీ గౌర‌వ్ ఖురానా విశిష్ట అతిథులుగా విచ్చేశారు. ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్స్ ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ & మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ గౌరి శంక‌ర్ బాప‌న‌ప‌ల్లి, ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్స్ ఎమ‌ర్జెన్సీ మెడిసిన్ సీనియ‌ర్ కన్స‌ల్టెంట్ & హెచ్ఓడీ డాక్ట‌ర్ అప్పిరెడ్డి త‌మ్మ‌, మ‌రియు ఫ్యాక‌ల్టీ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

     తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న రోగి యొక్క శారీర‌క సంబంధ‌మైన ప్ర‌క్రియ‌ల‌ను స‌క్ర‌మంగా చేయ‌డ‌మే `పున‌రుజ్జీవ‌నం`గా పేర్కొన‌వ‌చ్చు. ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్‌లో `పున‌రుజ్జీవ‌నం` ఒక ముఖ్య ప్ర‌క్రియ‌. గుండె పున‌రుజ్జీవ‌నం (cardiopulmonary), తీవ్ర గాయాల‌పాలైన రోగికి శారీర‌క భాగాల పున‌రుజ్జీవ‌నం (trauma resuscitation) వంటివి ఈ ప్ర‌క్రియ‌లోని సుప్ర‌సిద్ద అంశాలుగా పేర్కొన‌వ‌చ్చు. ఈ అంశాలతో పాటుగా మెద‌డులోని వివిధ భాగాల పున‌రుజ్జీవ‌నం, ఊపిరితిత్తులు, గుండె, మూత్ర‌పిండాలు, కాలేయం, తీవ్ర గాయాలు, షాక్‌కు లోన‌యిన సంద‌ర్భం మ‌రియు ఇత‌ర శ‌రీర భాగాలు దెబ్బ‌తిన్న సంద‌ర్భాల గురించి వివ‌రించ‌డంతో పాటుగా ప్ర‌త్య‌క్ష శిక్ష‌ణ‌ను ఈ సంద‌ర్భంగా అంద‌జేయ‌డం జ‌రిగింది. త‌క్కువ మొత్తంలో ఆక్సిజ‌న్ స్వీక‌ర‌ణ‌, త‌క్కువ ర‌క్త‌పోటు, పొట్ట మ‌రియు ఊపిరితిత్తుల నుంచి ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌డం, మెద‌డుకు తీవ్ర గాయాల‌వ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర స‌మ‌స్య‌లు, తీవ్ర‌మైన గుండె నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్ యొక్క ప‌లు ఉదంతాల‌ను విశ్లేషించ‌డం, ఆయా అంశాల‌ను ప్ర‌త్యకంగా  వివ‌రించ‌డం ఈ శిక్ష‌ణ‌లో భాగంగా చేప‌ట్టారు. క్రిటిక‌ల్ కేర్ రంగం, అన‌స్తీషియాల‌జీ, ఇంట‌ర్న‌ల్ మెడిసిన్‌, ఎమ‌ర్జెన్సీ మెడిసిన్‌, ఊపిరితిత్తుల వైద్య సేవ‌లు మ‌రియు హృద‌య సంబంధ‌మైన అంశాల‌లో వైద్య సేవ‌లు అందిస్తున్న  పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, యువ వైద్యులు మ‌రియు సీనియ‌ర్ వైద్యుల‌కు నూత‌న అంశాలు నేర్చుకునేందుకు ఈ శిక్ష‌ణ ఎంతో ఉప‌యుక్తంగా నిలిచింది.

 
ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్స్ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ మ‌రియు క్రిటిక‌ల్ కేర్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్ట‌ర్ శ్రీ‌నివాస్ జ‌క్కిన‌బోయిన ఈ వ‌ర్క్ షాప్ గురించి స్పందిస్తూ, ``తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క మ‌రియు మ‌హ‌రాష్ట్రకు చెందిన దాదాపు 100 మందికి పైగా వైద్యులు మ‌రియు భార‌త‌దేశ‌వ్యాప్తంగా ఉన్న  ఫ్యాక‌ల్టీ త‌మ అనుభ‌వాల‌ను పంచుకునేందుకు ఈ వ‌ర్క్‌షాప్‌లో

More Press Releases