వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుండి 470 కోట్ల భారతదేశపు అతిపెద్ద సిరీస్ A SaaS నిధులను పొంది చరిత్ర సృష్టించిన కేక HR

Related image

హైదరాబాద్, నవంబర్ 2022: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్ కేక, వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుండి $57M అంటే మన రూపాయి కరెన్సీలో సుమారు 470 కోట్లకు పైనే భారతదేశపు అతిపెద్ద సిరీస్ A SaaS నిధులను పొందింది.

ఎటువంటి ఫండింగ్ తీసుకోకుండా సొంత నిధులతో ప్రవేశించి, పెద్ద కంపెనీలతో కేవలం పోటీ పడటమే కాకుండా, SME విభాగంలో అగ్రగామిగా స్థిరపడింది.

ఒక కంపెనీలో HR టీమ్ కు కావాల్సిన ఆటోమేషన్ అవసరాలను రూపొందిస్తూ, ఎప్పటికప్పుడు, కొత్త ట్రెండ్స్ అందిపుచ్చుకుంటు మార్కెట్ కు అవసరమైన ఒక వినూత్న ప్రోడక్టును కేక అందించింది, ’’2021 చివరి నాటికి సుమారు 5500 కంటే ఎక్కువ కంపెనీలు కేకను ఉపయోగిస్తున్నారు.
కేక అభివృద్ధి ప్రయాణం

2016లో మొదలుపెట్టి, 2017లో 100-కస్టమర్ల మైలురాయిని చేరుకున్న సంస్థ, కేక కేవలం రెండు సంవత్సరాలలో అద్భుతమైన వృద్ధిని సాధించింది, 2017లో $750,000 ఆదాయాన్ని దాటి, 2020లో అమ్మకాలలో 7రెట్ల వృద్ధిని సాధించింది. 2021 నాటికి, ఇది 5500-కస్టమర్ మైలురాయిని దాటింది.

“ఒకప్పుడు వ్యాపారం అంటే కస్టమర్లు మాత్రమే, ఇప్పుడు కస్టమర్లతో పాటు, ఉద్యోగులకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇవ్వకపోతే సంస్థలు అభివృద్దిని సాధించలేవు, నేడు ఉద్యోగులే వ్యాపారానికి మూలస్థంభాలు, మేము వ్యాపార సంస్థల లక్ష్యాలను ఉద్యోగులు తమ లక్ష్యంగా భావించి పని చేసే విధంగా, వారికి కావాల్సిన ప్లాట్‌ఫామ్‌ అందించడమే ముఖ్యోద్దేశంగా పనిచేస్తున్నాము.’’అతి తక్కువ వనరులతో మేము ఇంత అభివృద్ధి చెందడానికి తోడ్పడిన మా ఉద్యోగులకు మరియు కస్టమర్లకు ధన్యవాదాలు.’’ అని విజయ్ యలమంచిలి, CEO, కేక, అన్నారు.
“నిధుల సేకరణకు తొందరపడకుండా, ఒక ప్రణాళికతో దీర్ఘకాలం వేచి చూసి సరైన సమయంలో పెద్ద మొత్తంలో వెంచర్ క్యాపిటల్ ఆకర్షించగలిగాము. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్‌తో మేము సరైన పెట్టుబడి భాగస్వామిని పొందినందుకు నేను సంతోషంగా ఉన్నాను." అని విజయ్ తెలిపారు.

కంపెనీపై తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తూ, రిషిత్ దేశాయ్, ప్రిన్సిపాల్, వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, ఇలా అన్నారు, “స్వల్ప కాలంలో, కేక భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన మరియు వినూత్నమైన HR టెక్ ప్లాట్‌ఫామ్‌గా ఉద్భవించింది. కేక తన ప్రపంచ-స్థాయి ఉత్పత్తి మరియు అత్యంత విశ్వసనీయమైన కస్టమర్ మద్దతు ద్వారా పరిశ్రమకు కొత్త వెలుగును ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు తమ HR ప్రక్రియలను ఆధునీకరించడానికి అనుమతించే అత్యుత్తమ మిడ్-మార్కెట్-ఫోకస్డ్ గ్లోబల్ HR టెక్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి మేము వారి దృష్టికి అనుగుణంగా ఉన్నాము. మేము కేక పొటెన్షియల్ గురించి చాలా సంతోషిస్తున్నాము మరియు కంపెనీతో సుదీర్ఘ భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాము"

    మాతృభాష మీద అభిమానంతో తమ సంస్థకు telugu పేరు మాత్రమే ఉండాలి అలాగే, ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు దాన్ని పలకగలగాలి అనే భావనతో విజయ్ తమ సంస్థకు ‘కేక’ అని నామకరణం చేశారు. "మేము గ్లోబల్ మార్కెట్‌కు అనుగుణంగా భారతదేశంలో ప్రపంచ స్థాయి ఉత్పత్తిని ఇక్కడే రూపొందించాలనుకుంటున్నాము. మేము ముందుకు సాగుతున్నప్పుడు, మా ఇంజనీరింగ్, ఉత్పత్తి మరియు కస్టమర్ సక్సెస్ టీమ్‌లను విస్తరింపజేసేటప్పుడు R&D అనేది మా ప్రధాన దృష్టి కేంద్రంగా ఉంటుంది" అని విజయ్ పేర్కొన్నారు.
కేక గురించి:

2015లో విజయ్ యలమంచిలి ద్వారా 5గురితో ప్రారంభం అయిన సంస్థ, ఈరోజు 550 కంటే ఎక్కువ ఉద్యోగులతో కూడిన అత్యుత్తమ సంస్థగా ఎదిగింది. కేక, పేరోల్, రిక్రూటింగ్, లీవ్ మరియు అటెండెన్స్, పనితీరు నిర్వహణ మరియు మరిన్నింటిని సులభంగా క్రమబద్ధీకరిస్తుంది మరియు ఆటోమేట్ చేస్తుంది. IT సేవలు, ఫార్మాస్యూటికల్స్, తయారీ, వృత్తిపరమైన సేవా సంస్థలు, అకౌంటింగ్, టాక్సేషన్, ఫిన్-టెక్ మరియు వివిధ రంగాలలో 6500కు పైగా కస్టమర్లను చేరుకోవడంతో ఇది చెరగని ముద్ర వేసింది. కేక ప్రస్తుతం నెలకు 15లక్షల కంటే ఎక్కువమంది ఉద్యోగులకు పేరోల్‌ను అమలు చేస్తుంది.

More Press Releases