వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగే ‘ఫార్ములా-ఈ’ రేసింగ్ ఈవెంట్ కోసం 100 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం ఢిల్లీ నగరంలో లాంఛనంగా ప్రారంభం
Press Note
New Delhi, 4th November.
ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ‘ఫార్ములా-ఈ’ రేసింగ్మొ దటిసారిగా మన దేశంలో ట్రాక్ ఎక్కనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇందుకోసం 100 రోజుల కౌంట్ డౌన్దే శ రాజధాని ఢిల్లీ నగరంలో లాంఛనంగా అభిమానుల కోలాహలం మధ్య శుక్రవారం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి, నీతి ఆయోగ్ సీఈఓ అమితాభ్ కాంత్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫార్ములా-ఈ ప్రిక్స్ ఈవెంట్‌ను ప్రపంచంలోని పన్నెండు దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయని, అందులో భారత్ కూడా ఒకటని గుర్తుచేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరగనున్నది ఈ ఈవెంట్‌కు సంబంధించిన తొమ్మిదవ సీజన్ అని వివరించారు.
గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు లండన్, బెర్లిన్, రోమ్, సౌ పాలో, మెక్సికో, జకార్తా, కేప్ టౌన్, మొనాకో, దిరియా (సౌదీఅరేబియా) సరసన నిలివనుంది. రానున్న నాలుగు సంవత్సరాల వరకు ఈ ఈవెంట్‌ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. 2014లో ప్రారంభమైన ఫార్ములా-ఈ రేసింగ్ ఇప్పటివరకు 100 రేసులను పూర్తి చేసుకున్నది. హైదరాబాద్‌లో జరిగే ఈ ఈవెంట్‌ను హెచ్ఎండీఏ(హైదరాబాద్
మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) బాధ్యులైన రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆర్గనైజ్ చేస్తున్నారు.
సంప్రదాయేతర ఇంధన వనరుల కంపెనీల్లో ఒకటైన గ్రీన్ కో ఈ ఈవెంట్‌ను ప్రమోట్ చేస్తున్నది. ’ఫార్ములా ఈ-ప్రిక్స్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌తో అనేక గ్లోబల్ సిటీల స్థాయికి హైదరాబాద్ చేరుకున్నట్లయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు తన సందేశంలో పేర్కొన్నారు. విశ్వనగరంలో హైదరాబాద్‌కు గుర్తింపు రావడానికి అనేక అంశాల్లో ఇప్పుడు ఇది కూడా చేరిందన్నారు. ఈ ఈవెంట్‌ను హైదరాబాద్లో సమర్ధవంతంగా నిర్వహిస్తామని, 'ఈ-మొబిలిటీ సమ్మిట్’ పేరుతో ఆ రంగానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులు, ఇన్వెస్టర్లు వస్తారని, ఆ సందర్భంగా హైదరాబాద్ నగరానికి 'ఈ-వెహికల్' రంగంలో ఉన్న ప్రత్యేకతలను, ప్రాధాన్యతను వివరిస్తామని మంత్రి అన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న ’ఫార్ములా-ఈ ప్రిక్స్’ ఈవెంట్ ఒక్కసారితో అయిపోదని , ఇకపైన ప్రతీ ఏటా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని, ’ఇ-మొబిలిటీ’లో హైదరాబాద్న గరం గ్లోబల్ లీడర్‌గా ఆవిష్కృతమవుతుందని పేర్కొన్నారు. ఫార్ములా వన్ తరహాలోనే ఇప్పుడు జరగనున్న ఫార్ములా-ఈ కూడా ఉంటుందని, అయితే ఈ రేస్‌లో పాల్గొనే వాహనాలు పూర్తిగా బ్యాటరీ సాయంతో నడిచే ఈ-వెహికల్స్ అని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తు ఆటోమొబైల్ రంగం మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుందని, గంటకు 300 కి.మీ. వేగంతో నడిచే జెనరేషన్-3 కార్లు మొదటిసారిగా ఈ ఈవెంట్ సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో తయారైన బ్యాటరీ, వేగంగా రీచార్జ్ అయ్యే టెక్నాలజీ వీటి ప్రత్యేకత అని అన్నారు.
ఫార్ములా వన్ రేసింగ్ ప్రత్యేకంగా తయారుచేసిన ట్రాక్ రోడ్లపై జరుగుతాయని, కానీ ఫార్ములా-ఈ ఈవెంట్ మాత్రం నగరంలోని సాధారణ రోడ్ల జరగనున్నట్లు తెలిపారు. స్ట్రీట్ సర్క్యూట్ తరహాలో వీధులపైనే జరుగుతుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగానే చాలా ఆసక్తిగా, ఉత్కంఠగా వీక్షించే క్రీడ కార్ రేసింగ్ అని, 1990వ దశకం నుంచే ఎఫ్-3 రేసులు జరుగుతున్నట్లు గుర్తుచేశారు. ఫార్ములా వన్ రేసింగ్ మాత్రం 2011లో మొదలైందని, ఇప్పుడు ఫార్ములా-ఈ పేరుతో తొలిసారి హైదరాబాద్‌లో జరుగుతుంన్నదన్నారు. రానున్న మూడు నెలల్లో అనేక ఈవెంట్లు జరుగుతాయని, సుమారు 40 వేల మందికి పైగా దీన్ని ప్రత్యక్షంగా వీక్షించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. త్వరలోనే టికెట్ల విక్రయంపై నిర్ణయం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
పౌర సంబందాల అధికారి , తెలంగాణ రాష్ట్ర సమాచార కేంద్రం, తెలంగాణ భవన్, న్యూఢిల్లీ చే జారీ చేయబడినది.