నెల్లూరుకు చెందిన రెండు సంవత్సరాల పాప ప్రియ శ్రీ ముంగరను కాపాడేందుకు దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విరాళాలు

Related image

ఆంధ్రప్రదేశ్‌, నవంబర్‌ 04 2022 :  భారతదేశపు మొట్టమొదటి జీరో ఫీ వేదిక మిలాప్‌పై  అపరిచితులు  అందించిన విరాళాలతో  రెండు సంవత్సరాల బాలిక విజయవంతంగా మూత్రపిండాల విఫలంకు సంబంధించి తన తొలి దశ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకుంది.  ఆంధ్రప్రదేశ్‌లో  ప్రాచుర్యం పొందిన తీర ప్రాంత నగరం నెల్లూరు చెందిన రెండు సంవత్సరాల బాలిక ప్రియశ్రీ ఐశ్వర్య ముంగర. గత వేసవిలో తొలిసారిగా ఆమెకు ఉన్న సమస్యను గుర్తించారు. ఆ సమయంలో ఆమె శరీరమంతా కూడా వాపు కనిపించింది.  వృత్తి పరంగా ఇంజినీర్‌ అయిన సాయికిరణ్‌తో పాటుగా అతని భార్య అశ్రితలు తమ పాప ప్రియశ్రీకి ఉన్న వ్యాధి స్థితి తెలిసి కుప్పకూలిపోయారు. తమ బిడ్డ కు వచ్చిన కష్టానికి తల్లడిల్లిపోయారు. ఈ కష్టాలు చాలదన్నట్లు, తమ పాపకు చికిత్స ప్రారంభించేందుకు సైతం తమ పొదుపు డబ్బులు చాలవని తెలిసి కృంగిపోయారు.

ఆ సమయంలోనే వారికి మిలాప్‌ గురించి తెలిసింది.  అత్యంత విశ్వసనీయమైన వేదిక అది. వైద్య అత్యవసర స్ధితి ఎదురైన పరిస్ధితులలో  క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా కుటుంబాలకు   అది సహాయపడుతుంది. ఓ ఫండ్‌ రైజింగ్‌ పేజీని ఆ పాప యొక్క వైద్య చరిత్ర,  ఇప్పుడు ఆమె ఉన్న స్థితి తెలుపుతూ పూర్తిగా అంకితం చేసిన ఖాతాతో ప్రారంభించారు. ఆ పాప తల్లిదండ్రులే ఆశ్చర్యపోయేలా  వారికి ఉపశమనం కలిగిస్తూ ప్రపంచవ్యాప్తంగా  విరాళాలు ఆ పాప  చికిత్స కోసం వెల్లువెత్తాయి. ఆ పాప తండ్రి ప్రయత్నాలకు  తమ వంతు మద్దతు అందిస్తూ దాదాపు 1400మంది దాతలు ముందుకు రావడమే కాదు, కేవలం  మూడు నెలల్లోనే 17.5 లక్షల రూపాయలను సమీకరించేందుకు తోడ్పడ్డారు. ఈ నిఽధులతో ప్రియశ్రీ కి ఎలాంటి అవాంతరాలు లేకుండా వైద్య సహాయం చెన్నైలోని అపోలో హాస్పిటల్‌ వద్ద లభిస్తుందనే భరోసా కలిగింది. ఇప్పుడు ఆ కుటుంబం ఓ ఇంటిని చెన్నైలో అద్దెకు తీసుకోవడంతో పాటుగా తమ పాపకు ప్రతి రోజూ డయాలసిస్‌ చేయిస్తున్నారు.

ప్రియశ్రీ తండ్రి సాయి నాగ కిరణ్‌ ముంగర  మాట్లాడుతూ ‘‘ మిలాప్‌ యొక్క క్రౌడ్‌ఫండింగ్‌ మాకు ఎంతగానో తోడ్పడింది.  మిలాప్‌ బృందం , మా పాప చికిత్స కోసం నిధులను ఏ విధంగా సమీకరించాలో  తెలుపుతూ సహాయపడ్డారు. ఆమె హాస్పిటల్‌లో చేరిన వెంటనే మా దగ్గర ఉన్న నిధులన్నీ అయిపోయాయి. అప్పుడు మేము క్రౌడ్‌ ఫండింగ్‌కు వెళ్లాలనుకున్నాము. ఇప్పటి వరకూ మాకు సహాయమందించిన ప్రతి ఒక్కరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుతున్నాము. ఆమెకు మూత్రపిండాల మార్పిడి చేసేందుకు అవసరమైన ఆరోగ్య స్థితి వచ్చే వరకూ ఆమెకు డయాలసిస్‌ మరియు మందుల కోసం మాకు మరిన్ని నిధులు కావాల్సి ఉంది’’ అని అన్నారు.

మిలాప్‌ ఇటీవలనే నూతన ఫీచర్‌ షాప్‌ టు గివ్‌ను  పరిచయం చేసింది. ప్రియశ్రీ లాంటి లబ్ధిదారులకు సహాయం చేసే రీతిలో ఇది ఉంటుంది. దీనిలో భాగంగా  వినియోగదారులు తమ అభిమాన ఈ–కామర్స్‌ బ్రాండ్స్‌ వద్ద షాపింగ్‌ చేస్తూనే  తమ మనసుకు నచ్చిన కారణం/ఫండ్‌ రైజర్‌కు మద్దతు అందించవచ్చు. దీనికోసం వారు అదనంగా నిధులను వెచ్చించనవసరం లేదు. ప్రతి కొనుగొలుపై ఈ బ్రాండ్లు ఆర్డర్‌ విలువలో కొంతమొత్తాన్ని  కొనుగోలుదారుడు ఎంచుకున్న కారణం కోసం కేటాయిస్తాయి. మిలాప్‌ పై ఉన్న ఫండ్‌ రైజర్లు సైతం పెద్ద మొత్తంలో ప్రయోజనాన్ని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు తమ పండుగ అవసరాలను ఈ ఫ్లాట్‌ఫామ్‌ పై ఉన్న ఈ–కామర్స్‌ బ్రాండ్స్‌ ద్వారా కొనుగోళ్లు చేసేలా చేసిన ఎడల పొందగలరు. షాప్‌ టు గివ్‌ ఫీచర్‌ ద్వారా ప్రియశ్రీకి విరాళం అందించడానికి  https://milaap.org/fundraisers/support-priyasree-aishwarya-mungara#shop-to-give  చూడవచ్చు.

ప్రజలు తరచుగా ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ను తమ చివరి అవకాశంగా, మరీ ముఖ్యంగా తమ  వనరులు, ఆర్ధిక అవకాశాలు  అయిపోతే తమ వైద్య అవసరాల కోసం వీటిని వినియోగించుకుంటున్నారు. మిలాప్‌ ఆ తరహా ఓ వేదిక. ఇది కేవలం ఫండ్‌ రైజింగ్‌ సేవలను అందించడం మాత్రమే కాదు, దాతలకు విశ్వసనీయ వేదికగా నిలుస్తూనే క్రౌడ్‌ ఫండింగ్‌ ప్రచారాలు చేసేందుకు తగిన మార్గనిర్ధేశనమూ అవసరార్థులకు చేస్తుంది.  మిలాప్‌ ప్లాట్‌ఫామ్‌పై 72 లక్షల ఖాతాలున్నాయి. వీరు టియర్‌ 2,  టియర్‌ 3  నగరాలకు చెందిన వారు. అలాగే క్రౌడ్‌ ఫండింగ్‌ పట్ల ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నప్రాంతాలకు చెందిన వారు సైతం ఉన్నారు. దేశీయంగా ఈ ప్లాట్‌ఫామ్‌పై 46 లక్షల మంది దాతలు ఉండగా, విదేశాలలో 4 లక్షల మంది దాతలు ఉన్నారు.

టెరిషియరీ కేర్‌ లేదా క్యాన్సర్‌, అవయవ మార్పిడి, ప్రీమెచ్యూర్‌ బేబీస్‌, ఐసీయు, పీడియాట్రిక్‌ ఐసీయు, ట్రౌమా కేసులు మరియు రోడ్డు ప్రమాద అత్యవసరాలు సహా క్రిటికల్‌  కేర్‌ వైద్య  అవసరాలకు అవసరమైన నిధుల సేకరణ కోసం క్రౌడ్‌ఫండింగ్‌ వేదికలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వేల  ద్వారా అందుకున్న నగదును సురక్షితంగా అవసరార్థులకు బదిలీ చేయడంతో పాటుగా వారు వెల్లడించిన కారణాల కోసం మాత్రమే సద్వినియోగం చేస్తున్నారనే భరోసా అందిస్తుంది.
 

More Press Releases