విజయవంతంగా ఆరో సీజన్ లోకి అడుగుపెట్టిన మిసెస్ మామ్

Related image

* గ్రాండ్ ఫినాలె కార్యక్రమం 2022 నవంబర్ 27న హైదరాబాద్ హైటెక్స్ లో
 
హైదరాబాద్, అక్టోబర్ 29, 2022: గర్భిణుల కోసం భారతదేశంలో నిర్వహిస్తున్న ఏకైక ఈవెంట్ మిసెస్ మామ్.. విజయవంతంగా ఆరో సీజన్ లోకి ప్రవేశించింది! కాబోయే తల్లులకు ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కోవడం, తద్వారా మాతృత్వాన్ని ఆస్వాదించడం ఎలాగో తెలుసుకునే అవకాశాన్ని ఈ విభిన్నమైన ఈవెంట్ కల్పిస్తుంది. మాతృత్వంలో ఎదురయ్యే సవాళ్ల గురించి, ఈ కార్యక్రమంలో వారికి అందించే మద్దతు గురించి మిసెస్ మామ్ డైరెక్టర్ డాక్టర్ కె.శిల్పిరెడ్డి చర్చిస్తారు. గర్భధారణలో ఉండే ఆనందాలు, ప్రతిఫలాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఆసక్తి ఉన్న గర్భిణులు, వారి భాగస్వాములకు ఈ కార్యక్రమం కచ్చితంగా సమాచారాత్మకం, ఆలోచనాత్మకం అవుతుంది.

మిసెస్ మామ్ ఆరో సీజన్ కోసం 1306 మంది గర్భిణీ స్త్రీలు ఇప్పటికే దేశవ్యాప్తంగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కాబోయే తల్లుల కోసం దేశంలో నిర్వహించే ఈ ఏకైక ఈవెంట్ ఇలా ప్రారంభమైంది. మిసెస్ మామ్ కథ ఎలా మొదలైందంటే.. సాధారణ, ఒత్తిడి లేని ప్రసవాన్ని ప్రోత్సహించడం. అప్పటి నుంచి, ఇది సంపూర్ణ ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన తల్లుల పెద్ద కుటుంబంగా విస్తరించింది.

ఈ కార్యక్రమం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడానికి, దీనికోసం గర్భిణీ జంటలకు స్థిరమైన, ఆరోగ్యకరమైన జీవనశైలి, వాటర్ యోగా, లామేజ్, ప్రసవ అవగాహన, 1000 రోజుల ఆహారపుటలవాట్లు, అలంకరణ, చర్మ సంరక్షణ, దంత సంరక్షణ, ఒత్తిడి నివారణ, ఆత్మవిశ్వాసం పెంపుదల, వ్యక్తిత్వ అభివృద్ధి, ఆధ్యాత్మిక స్వస్థత, గర్భధారణలో ఆనందం, నిపుణులతో స్టైల్ కోచింగ్ గురించి అవగాహన కల్పించడానికి 7 రోజుల ప్రీ-ఈవెంట్ నిర్వహిస్తారు; తర్వాత గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్టులుగా వచ్చే 40 మంది గర్భిణులు ర్యాంప్ వాక్ చేస్తారు.

గర్భధారణకు ముందు, గర్భధారణ, ప్రసవం, పిల్లలకు పాలివ్వడం, పిల్లల సంరక్షణ, టీకాల వరకు సాగే తల్లి ప్రయాణం గురించి కూడా డాక్టర్ కె.శిల్పిరెడ్డి వివ‌రించారు. ప్రతి సీజన్ లో మేము గర్భిణీ జంటలకు సంపూర్ణ సంరక్షణను అందిస్తాము. గర్భధారణ అనే ఈ ప్రయాణానికి ఎలా మద్దతు ఇవ్వాలో, ఆస్వాదించాలో అనే విషయమై వారికి, వారి కుటుంబాలకు అవగాహన కల్పిస్తాము.
గర్భధారణ, శిశు సంరక్షణ గురించి సరైన అవగాహన కల్పించడానికి, ఈ ఈవెంట్ సస్టెయినబులిటీతో పాటు గర్భధారణ ఆరోగ్యం, స్వస్థత భావనను విజయవంతంగా పొందుపరుస్తుంది. పర్యావరణాన్ని సంరక్షించడానికి, స్థానిక, సంప్రదాయ, సేంద్రియ ఆహారాలను తినేలా గర్భిణీ జంటలను ప్రోత్సహిస్తాము. అంతిమంగా పర్యావరణ అనుకూల జీవనాన్ని ఎంచుకుంటారు. తద్వారా మన భవిష్యత్తు తరం మనలాగే ఈ ప్రపంచాన్ని అనుభవించగలదు.

    ఈ మిసెస్ మామ్ 2022 సీజన్ 6 పర్యావరణ అనుకూలంగా ఉండేలా నారాయణపేటకు చెందిన చేనేతలకు మద్దతు ఇవ్వడం ద్వారా అదనపు ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణపేట చీరలను దేశీ కాలర్ సంస్థకు చెందిన శ్రీమతి మానసీ అగర్వాల్ గర్భధారణకు అనుకూలంగా ఉండే దుస్తులుగా డిజైన్ చేశారు. ఐఏఎస్ అధికారిణి శ్రీమతి హరిచందన సహాయంతో చేనేత, నారాయణపేట సమాజాన్ని ప్రోత్సహించడానికి సామాజిక చొరవగా ఈ కార్యక్రమం చేపట్టారు.

ముందస్తు కార్యక్రమాల షెడ్యూలు

మిసెస్ మామ్ 2022 ఆడిషన్, సుస్థిర జీవనానికి పరిచయం

6-నవంబర్-22 | ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు | హోటల్ షెరటాన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గర్భ సంస్కార యోగ, జుంబా, లామాజ్, ప్రసవ విద్య
12-నవంబర్-22 | ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు | శాంతి సరోవరం, గచ్చిబౌలి.డిజైనర్ బేబీని ఎలా పొందాలి, ఆధ్యాత్మిక స్వస్థత ప్రాధాన్యం
13-నవంబర్-22 | ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు | శాంతి సరోవరం, గచ్చిబౌలి.చర్మ సంరక్షణ, ఒత్తిడి నిర్వహణ, నవజాత శిశువుల సంరక్షణ
19-నవంబర్-22 | ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు | హోటల్ షెరటాన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ఆ హారం, గర్భధారణ, భవిష్యత్తు జీవితంపై దాని ప్రభావం గురించి సమగ్ర సెషన్
20-నవంబర్-22 | ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు | హోటల్ షెరటాన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్వా టర్ యోగా (WOGA)
24-నవంబర్-22 | మధ్యాహ్నం 3 గంటలకు | సీజన్స్ స్విమ్మింగ్ పూల్, కొండాపూర్. ఉచిత డెంటల్ చెకప్
24-నవంబర్-22 | ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు | కిమ్స్ హాస్పిటల్, కొండాపూర్వ్య క్తిత్వ వికాస స్టైలింగ్, గ్రూమింగ్, తల్లుల మేక్ఓవర్
26-నవంబర్-22 | ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు | హోటల్ షెరటాన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ఈ  కార్య‌క్ర‌మానికి  ప్రాయోజితులగా  లైఫ్ సెల్, కిమ్స్ డెంటల్, నుస్కా, క్లిక్2 క్లినిక్, దేశీ కాలర్, హైటెక్స్ హెయిర్ క్రష్,  మిర్రర్స్,  ఓమ్నిక్యూటిక్స్,  షెరటాన్,  లక్ష్య డిజిటల్స్,  లుసన్ లైఫ్ కేర్,  లిలాక్ ఇన్,  సైట్స్, సెంట్రో, మినిటో,  హైబిజ్,  బ్రహ్మకుమారి,  సాషా క్లినిక్ మ‌రియు ఫీవర్ ఎఫ్ఎం.

More Press Releases