నవంబర్ 5న 2022 బీవీఎస్ బ్లాక్ పార్టీలో బ్రీజర్ వివిడ్ షఫల్ బ్లాక్ పార్టీ లోచేరనున్నవిజయ్ దేవరకొండ

Related image

#BeatsOfTheStreets ను వేడుక చేసుకునేందుకు నవంబర్ 5న బీవీఎస్ బ్లాక్ పార్టీలో బ్రీజర్ వివిడ్ షఫల్ బ్లాక్ పార్టీ లో చేరనున్న విజయ్ దేవరకొండ

భారతదేశపు అత్యుత్తమ హిప్ హాప్ సంగీత ప్రతిభకు సాక్ష్యంగా నిలువనున్న నగరం
 
హైదరాబాద్, అక్టోబర్ 2022: భారతదేశ అతిపెద్ద హిప్ హాప్ ఫెస్టివల్, వరుసగా 6వ సిరీస్ అయిన బ్రీజర్ వివిడ్ షఫల్ ప్రారంభాన్ని నాడ్విన్ గేమింగ్, బ్రీజర్ ప్రకటించాయి. 2022 నవంబర్ 5న హై-ఎనర్జీ బ్లాక్ పార్టీతో #BeatsOfTheStreets  హైదరాబాద్ ను ఉర్రూతలూగించనుంది. దక్షిణ భారతదేశానికి చెందిన యూత్ ఐకాన్, బీవీఎస్ తో దీర్ఘకాలిక అనుబంధం కలిగిన విజయ్ దేవరకొండ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ప్రేక్షకులకు జోష్ పెంచనున్నారు.

భారతదేశ హిప్ హాప్ మూవ్ మెంట్ ను హైదరాబాద్ కు తీసుకువస్తున్న ఈ బ్లాక్ పార్టీ దేశంలోని అత్యంత సంచ లనాత్మక హిప్ హాప్ గాయకుల్లో కొందరి ఉద్వేగభరిత ప్రదర్శనలను చూడనుంది. ర్యాప్ మ్యూజిక్ ను భారతీయ శాస్త్రీయ, జానపద శైలిలతో మిళితం చేసే విశిష్ట శైలితో కూడిన భారతదేశ అతిపెద్ద రాపర్స్ లో ఒకరైన బ్రోద వి; హిందీ రాప్ ను ముందుకు తీసుకెళ్లేందుకు తమ గీతాల సందడిని ఉపయోగించిన దిల్లీ ద్వయం సీదే మౌత్; 2019లో ఎన్ హెచ్7 వీకెండర్ లో తన ప్రస్థానం ప్రారంభించిన లిరికల్ రాపర్ హనుమాన్ కైండ్; వీడియో టర్న్ టాబ్లిజమ్ కు భారతదేశాన్ని పరిచయం చేసిన ప్రముఖ హిప్ హాప్ డీజేలలో ఒకరైన డీజే కాన్ ఐ లాంటి వారు వీరిలో ఉన్నారు.

ఈ సందర్భంగా బీఏసీఏఆర్డీఐ రీజనల్ బ్రాండ్ & కేటగిరీ హెడ్ – ఆర్టీడీ (రెడీ టు డ్రింక్), ఏఎంఈఏ (ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా) ఆర్తి హజేలా మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో హిప్ హాప్ మూవ్ మెంట్ రోజురోజుకూ బలోపేతం అ వుతుండడంతో మేం ఈ వేదికను సంగీతంతో స్ఫూర్తిపొందిన ప్రదర్శనగా సీజన్ 6ను మీ ముందుకు తీసుకువ స్తున్నాం. ఇది ముందెన్నడూ లేనంత బిగ్గరగా #BeatsOfTheStreets  ను వేడుక చేయనుంది. దేశానికి చెందిన అతిపెద్ద హిప్ హాప్ వాయిస్ లలో ఒకటిగా పేరొందిన బ్లాక్ పార్టీ అనేది ట్యూన్ల సంగమంగా, ప్రదర్శనలను ఎల క్ట్రిఫై చేసేదిగా ఉండనుంది. స్ట్రీట్ వేర్ బ్రాండ్లచే దేశీయంగా ఎదిగిన పాప్ – అప్స్ సందడి చేయనున్నాయి. మాకు హైదరాబాద్ ఎంతో ముఖ్యమైన మార్కెట్. ఎట్టకేలకు ఈ అనుభూతిని అందించగలుగుతున్నందుకు మేమెంతగా నో ఆనందిస్తున్నాం. భారతదేశంలో కల్చర్ ఆఫ్ ది స్ట్రీట్స్ ను వేడుక చేసుకునేందుకు, వర్ధమాన ప్రతిభకు ఒక వేదిక ను అందించేందుకు మేమెంతగానో కట్టుబడి ఉన్నాం.  హిప్ హాప్ రారాజులను, రాణులనూ హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.

లైవ్ మ్యూజిక్ యాక్ట్స్ తో బ్లాక్ పార్టీ, అభిమానులకు వారు హిప్ హాప్ ఫేవరైట్స్ కు ఊగిపోయేందుకు మరింత పెద్దదైన సందర్భాన్ని అందిస్తోంది. ఓపెన్ డాన్స్ సైఫర్స్ వద్ద అడుగులు వేసేందుకు, స్ట్రీట్ స్టైల్ సోక్ వద్ద దాహార్తిని తీర్చుకునేందుకు, రుచికరమైన ఆహారాన్ని ఆనందించేందుకు వీలు కల్పిస్తోంది, ఇవన్నీ ఒక్క చోటనే. ఈ ఏడాది బ్రీజర్ వివిడ్ షఫల్ దేశవ్యాప్తంగా అత్యుత్తమ హిప్ హాప్ టాలెంట్ తో ప్రాంతీయ ప్రాతినిథ్యం నిర్మిస్తోంది.

నాడ్విన్ గేమింగ్ సహ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ అక్షత్ రాథీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఈ ఏడాది హైదరాబాద్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం మాకెంతో ఆనందదాయకం. మా ప్రయాణంలో ఇది మరో మైలురాయి. నలుదిశలా పండుగ సందడితో సీజన్ 6 మరింత వైబ్రంట్ గా ఉంటుందని మేం వాగ్దానం చేస్తున్నాం. బ్రీజర్ వివిడ్ షఫల్ ఇప్పుడు ఒక సాంస్కృతిక భావనగా రూపుదిద్దుకుంది. దేశంలో హిప్ హాప్ వేవ్ ను వేడుక చేసుకునేదిగా, మరింత వృద్ధిలోకి తీసుకెళ్లేదిగా మారింది. భారతీయ హిప్ హాప్ మ్యూజిక్ లో అత్యుత్తమ, అత్యంత బ్రిలియంట్ కళాకారుల ప్రదర్శనలకు #BeatsOfTheStreets సీజన్ 6 సర్వం సిద్ధం చేసింది. సంగీతం, నృత్యం, వివిధ కళా రూపాల గుండా పయనిస్తున్నప్పుడు ఈ ఫెస్ట్ నెమ్మదిగా హిప్ హాప్ ను ఒక కల్ట్ గా వేడుక చేసుకునే సంస్కృతి, ప్రతిభ, గొంతుల కలయికగా మారుతుంది. ఏటా సంగీత పరిణామానికి కొత్త జోడింపు అవుతుంది’’ అని అన్నా రు.

బ్రీజర్ వివిడ్ షఫల్ సీజన్ 6 పై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ‘‘హిప్ హాప్ అనేది ఎప్పుడూ నా జీవితంలో పెరుగుతూనే ఉంటుంది. భారతదేశ అతిపెద్ద హిప్ హాప్ ఫెస్ట్ అయిన బ్రీజర్ వివిడ్ షఫల్ లో భాగం కావడం ని జంగా ఓ అద్భుతం. ఒక సాంస్కృతిక వేదికగా బీవీఎస్ #BeatsOfTheStreets ను మరింత ముందుకు తీసుకెళ్ల నుంది. ప్రతిభావంతులైన డ్యాన్సర్లు, సంగీత కళాకారులు, ఆర్టిస్టులు, డిజైనర్లకు అవకాశాలను అందించనుంది. హైదరాబాద్ లో హిప్ హాప్ కల్చర్ కొత్త మార్గం పట్టనుంది. ఈ కమ్యూనిటీ అంతా ఒక్క చోటకు చేరి  ఈ కల్చరల్ మూమెంట్ పట్ల మన ప్రేమను BVS Season 6 తో వేడుక చేసుకోవడాన్ని చూసేందుకు ఇక నేను వేచిఉండలేను’’ అని అన్నారు.

భారతదేశంలోని ప్రతిభను గుర్తించడంలో భాగంగా బీవీఎస్ ఒక డిజిటల్ డ్యాన్స్ బ్యాటిల్ ను నిర్వహిస్తోంది. అది ఇప్పుడు లైవ్ లో ఉంది. ఆరు లక్షల రూపాయాలను బహుమతిగా ఇవ్వనున్నారు. ఎంట్రీలను అంతర్జాతీయ ప్రముఖులు పరిశీలిస్తారు. విజయ్ దేవరకొండతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని అభిమానులు ఆనందించవ చ్చు. 


హిప్ హాప్ మూవ్ మెంట్ ను దేశవ్యాప్తం చేసేందుకు బీవీఎస్ అంతా సిద్ధం చేసుకుంది. గువాహటిలో బ్లాక్ పార్టీ 2022 నవంబర్ 19న జరుగనుంది. ముంబైలో 2022 నవంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల ఫెస్టివల్ జరుగ నుంది.

గెట్ గ్రూవిన్. టిక్కెట్లు Insider.in - BREEZER Vivid Shuffle Hyderabad పై అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్ బ్లాక్ పార్టీ గురించి:
·       5 నవంబర్ 2022
·       హాల్ నెం.2, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్
·       4 కళాకారులు
·       జెనర్ – హిప్ హాప్
కార్యక్రమానికి సంబంధించిన ఇతర ప్రకటనలతో అప్ డేట్ గా ఉండేందుకు BREEZER Vivid Shuffle , NODWIN Gaming లను ఫాలో అవండి. #BREEZERVividShuffle #BeatsOfTheStreets.
 
నాడ్విన్ గేమింగ్ గురించి:

నాడ్విన్ గేమింగ్ అనేది ప్రొఫెషనల్ గేమర్స్, కంటెంట్ క్రియేటర్స్, ఆర్గనైజేషన్స్, ఆడియెన్సెస్ కోసం సుస్థిరదాయక ఫ్రేమ్ వర్క్ ను రూపొందిస్తున్న ప్రపంచ అగ్రగామి గేమింగ్, ఇస్పోర్టింగ్ కంపెనీలలో ఒకటి. ఇది గేమింగ్, ఇస్పోర్ట్స్ ఎంటర్ టెయిన్ మెంట్ ను వివిధ ఐపీల ద్వారా అభిమానులు, పబ్లిషర్లు, బ్రాండ్లకు అందిస్తోంది. మీడియా, ఇన్ ఫ్లుయెన్సర్లు, టోర్నమెంట్ ఐపీలు, బ్రాండ్ సొల్యూషన్స్, డైరెక్ట్ టు కస్టమర్ వర్టికల్స్ ద్వారా ఇది తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. నాడ్విన్ గేమింగ్ అనేది భారత్ కు చెందిన అగ్రగామి గేమింగ్, స్పోర్ట్స్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన నజారా టెక్నాలజీస్ (BSE: NAZARA) లో భాగం.
బ్రీజర్ వివిడ్ షఫల్ గురించి:

2017లో ప్రారంభమైన బ్రీజర్ వివిడ్ షఫల్ అనేది భారతదేశ అతిపెద్ద హిప్ హాప్ లీగ్. స్ట్రీట్ ఆర్ట్, కల్చర్, పర్ ఫార్మన్స్ కు ఒక జాతీయ వేదిక. భారతదేశ హిప్ హాప్ ఉద్యమానికి ఒక వేదిక. వెలుగులోకి రాని వారి ప్రతిభకు ప్రతిభకు ప్రాతినిథ్యం వహించడం, ఈ కమ్యూనిటీకి అథెంటిక్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఇది రూపుదిద్దుకుంది. ఐదు విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకున్న బ్రీజర్ వివిడ్ షఫల్ ఇప్పుడు అతిపెద్ద బ్రాండ్ సారథ్య హిప్ హాప్ కమ్యూనిటీని నిర్మించే సంకల్పంతో ఆరో ఏడాదిలోకి ప్రవేశించింది. గత ఐదేళ్లుగా బ్రీజర్ వివిడ్ షఫల్ దేశంలోని ఎన్నో నగరాల్లో తన కార్యకలాపాలు నిర్వహిం చింది. 2019లో బ్యాంకాక్ లో అంతర్జాతీయ రౌండ్ ను కూడా నిర్వహించింది. గత రెండేళ్లుగా బీవీఎస్ వర్చువల్ గా తన కార్యకలాపాలు నిర్వహించింది. ఈ ఏడాది తిరిగి కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టింది, మునుపటి కన్నా మరింత సందడిని అందిస్తామన్న వాగ్దానంతో.

More Press Releases