ధమనులు పూర్తిగా బ్లాక్ అయిన వృద్ధుడికి సంక్లిష్ట శస్త్రచికిత్సతో అమోర్ ఆస్పత్రి వైద్యుల ప్రాణదానం

Related image

* రోగికి కొవిడ్ కూడా సోకడంతో.. అదనపు జాగ్రత్తలతో విజయవంతంగా శస్త్రచికిత్స
 
హైదరాబాద్, అక్టోబర్ 28, 2022: నగరంలోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులలో ఒకటైన అమోర్ ఆస్పత్రి వైద్యులు 'ట్రిపుల్ వెసల్ డిసీజ్'తో బాధపడుతున్న వృద్ధుడి ప్రాణాలను కాపాడటానికి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. బాధితుడి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు రక్త నాళాలు పూర్తిగా బ్లాక్ అయ్యాయి. దాంతోపాటు ఆయనకు కొవిడ్ కూడా సోకింది. దాంతో అదనపు జాగ్రత్తలు కూడా అవసరమయ్యాయి.
 
హైదరాబాద్ నగరానికి చెందిన 62 ఏళ్ల మూర్తయ్య స్థూలకాయుడు. ఆయనకు బాగా జ్వరం, దగ్గు, తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో అమోర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే తగిన పరీక్షలు చేయగా, ఆయన గుండెపోటుకు గురయ్యారని, ట్రిపుల్ వెసల్ వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడైంది. సాధారణంగా అయితే ఆయనకు స్టెంట్ వేయాలి. కానీ పలురకాల సమస్యలు ఉండటంతో రోగికి అత్యంత జాగ్రత్తగా చికిత్స చేయాల్సి వచ్చింది. గుండె పరిస్థితిని సరిచేసేటప్పుడు, ముందుగా ఆయనకు కొవిడ్-19 లక్షణాలను తగ్గించారు.
 
రోగి పరిస్థితి, ఆయన సంక్లిష్టతను ఎలా తగ్గించారో అమోర్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఇమ్రాన్ ఉల్ హక్ వివరించారు. “రోగికి ధమనులలో కాల్షియం నిల్వలు ఉన్నాయని పరీక్షల్లో వెల్లడైంది. సాధారణంగా ఇలా ఉంటే స్టెంట్ వేయడం కుదరదు. దాంతో మేము ఇంట్రావాస్క్యులర్ లిథోట్రిప్సీ (ఐవీఎల్) విధానాన్ని తీసుకున్నాము. ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కోసం రూపొందించిన వ్యూహం ఆధారంగా ఉండే ఒక వినూత్నమైన టెక్నిక్. ఐవీఎల్ ద్వారా, మల్టిపుల్ లిథోట్రిప్సీ ఎమిటర్లు సంప్రదాయ కాథెటర్ ఫ్లాట్ ఫారంపై మౌంట్ అయ్యి, లోకలైజ్డ్ పల్సటైల్ సోనిక్ ప్రెజర్ తరంగాలను విడుదల చేస్తాయి. ఇవి ధమనుల్లో ఉండే కాల్షియంను కరిగిస్తాయి. ఇలా కరిగించిన తర్వాత మేం విజయవంతంగా స్టెంట్ పెట్టగలిగాము. దాంతో రోగి రెండు రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకున్నారు.”

ఈ సంక్లిష్టమైన శస్త్రచికిత్స తరువాత, రోగిని పరిశీలనలో ఉంచి, రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు రోగి నెమ్మదిగా, నిలకడగా కోలుకుంటున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే తన రోజువారీ పనులు చేసుకోగలరు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అమోర్ ఆస్పత్రి.. అత్యంత క్లిష్టమైన, సంక్లిష్టమైన సమస్యలకు సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ చికిత్స కోసం అత్యుత్తమ గమ్యస్థానం.

More Press Releases