త్రాగునీటిలో విషపూరిత పదార్థాల పట్ల పెరుగుతున్న ఆందోళనను పరిష్కరించడానికి కొత్త శ్రేణి వాటర్ ప్యూరిఫైయర్లను ప్రారంభించిన HUL’s Pureit

Related image

ముంబై, 27 అక్టోబర్, 2022: HUL’s Pureit, తన కొత్త శ్రేణిని ప్రారంభించినట్లు ప్రకటించింది – Pureit Vital Series, FiltraPower Technology తో కూడిన కొత్త శ్రేణి RO UV మినరల్స్ ఆధారిత వాటర్ ప్యూరిఫైయర్‌లు, పారిశ్రామిక రసాయనాలు, పురుగుమందులు వంటి విషపదార్థాలను వ్యాధికారకాలను తొలగిస్తాయని, మరియు సురక్షితమైన త్రాగునీటిని అందిస్తాయని నిరూపితమైంది. ఇది కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది మరియు అంతర్జాతీయ ప్రయోగశాలలచే పరీక్షించబడుతుంది. ఈ శ్రేణి, నీటి రికవరీ మరియు శుద్దీకరణ వేగంలో అత్యుత్తమ పనితీరుతో టర్బోచార్జ్ చేయబడింది. దాని mineral-essence technology కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన minerals తో నీటిని సుసంపన్నం చేస్తుంది  చేస్తుంది. మరియు, ఈ పరికరం అనేక సౌకర్యవంతమైన మరియు లగ్జరీ ఫీచర్లని కలిగి ఉంది. 

ఆవిష్కరణ సమయంలో వ్యాఖ్యానిస్తూ, హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ హోమ్ కేర్ Executive Director దీపక్ సుబ్రమణియన్ ఇలా అన్నారు, “నీతి కాలుష్యం మరియు కుటుంబ ఆరోగ్యం ఈ వర్గానికి ప్రధాన ట్రిగ్గర్లాగా వినియోగదారుల అధ్యాయనాలు తరచుగా నొక్కి వక్కాణిస్తున్నాయి. సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి మరియు విష పదార్థాలను తొలగించడానికి ఈ అంశాన్ని ప్రధానంగా ఉంచుతూ Pureit Vital Series  రూపొందించబడింది.” 

Global C.E.O, వాటర్ అండ్ ఎయిర్ వెల్నెస్, Mr. హెంక్ ఇన్ ’టి హాఫ్, వ్యాఖ్యానిస్తూ, "Pureit,  ప్రపంచ స్థాయి నీటి శుద్దీకరణలో మా నైపుణ్యం మరియు స్థానిక అంశాలను ఉపయోగించుకుని ప్రపంచ స్థాయి ఇంకా భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అందజేస్తుంది. సరసమైన ధర పరిధిలో అధిక-పనితీరు మరియు అధిక-నాణ్యత ఉత్పత్తిని అందించడమే మా ఉత్పత్తి రూపకల్పన  బృందం యొక్క ముఖ్య లక్ష్యం", అని అన్నారు. 

ఎలక్ట్రిక్ వాటర్ ప్యూరిఫైయర్ల మార్కెట్‌కు అంతరాయం కలిగించిన , పేటెంట్ పొందిన Pureit  Copper RO విజయవంతగా ప్రారంభించిన తరువాత Vital Series ని రూపొందించారు, ఇది కూడా కీలక వినియోగదారుల అంశం పై ఆధారపడి ఉంది. Pureit Vital Series కూడా ఉత్పాదన అందంగా ఉండేటట్లు చూసుకుంటుంది. మోడరన్ జామెట్రీ ద్వారా ప్రేరణ పొంది, భారతీయ వంటగదిలో ప్రీమియం మరియు ఆకర్షణీయంగా కనిపించే మినిమలిస్టిక్ డిజైన్‌ను రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. లైట్-హార్టెడ్ ప్రమోషనల్ యాడ్ ఫిల్మ్‌లో ఒక యువతి తన స్నేహితుల ముందు మేజిక్ ట్రిక్ చేస్తూ, కలుషితమైన నీటిని, తన తల్లి మరియు Pureit Vital సహాయంతో సురక్షితమైన తాగునీరుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. 

Pureit Vital Series, రూ. 13,999 తో ప్రారంభమవుతుంది, ఇది బ్రాండ్ వెబ్‌సైట్ (www.pureitwater.com), ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఫిజికల్ రిటైల్ స్టోర్‌లలో వివరాలతో కొనుగోలు చేయడానికి ఇప్పుడు అందుబాటులో ఉంది.

More Press Releases