ప్రామాణికత , నాణ్యత మరియు ఆవిష్కరణతో ఆహార ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న హైదరాబాద్‌కు ఇష్టమైన దమ్‌ బిర్యానీ

Related image

హైదరాబాద్‌,26 అక్టోబర్‌ 2022 : ప్రామాణికమైన  భారతీయ క్యుఎస్‌ఆర్‌ బ్రాండ్‌గా నిలవాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్‌కు గర్వకారణమైన కచ్చి దమ్‌ బిర్యానీని  అందించడంలో  సరికొత్త మంత్రాన్ని  లెజండరీ ప్యారడైజ్‌ బిర్యానీ అనుసరిస్తోంది. ప్రామాణికతను కొనసాగించడం మరియు ఆహార ప్రేమికులకు ఈ రుచులను అందించడానికి ముందు నాణ్యత మరియు ఆవిష్కరణలను నిర్వహించడమే ఈ మంత్రం. ఈ మంత్రాన్ని స్మరిస్తూనే  ప్యారడైజ్‌ ఇప్పుడు బిర్యానీ ప్రేమికులను రెండు పసందైన నూతన డిష్‌లు  – దక్షిణ్‌ ఈ–ఖాస్‌ బిర్యానీ మరియు దక్షిణ్‌–ఈ–ఖాస్‌ కెబాబ్‌– రుచులను ఆస్వాదించడానికి ఆహ్వానిస్తోంది. ఈ రెండు నూతన రుచులను తమ మెనూకు  ప్యారడైజ్‌ జోడించింది. అసలైన దక్షిణ భారత బిర్యానీగా, ప్యారడైజ్‌ యొక్క మెనూలోని ఈ నూతన డిష్‌లు అసలైన దక్షిణాది ఫ్లేవర్స్‌ను జోడించుకున్న మసాలాల సమ్మేళనం.  దక్షిణ్‌–ఈ–ఖాస్‌ బిర్యానీ మరియు కెబాబ్‌లు  అన్ని ప్యారడైజ్‌ ఔట్‌లెట్లు మరియు ఛానెల్స్‌ అయిన  – డైన్‌ ఇన్‌, డెలివరీ లేదంటే టేక్‌ఎవేలపై కూడా  లభ్యమవుతుంది. ఈ నూతన డిషెస్‌  ప్యారడైజ్‌ బిర్యానీ యాప్‌పై కూడా లభ్యమవుతుంది.


ఈ సర్వింగ్స్‌ రాయల్‌ (సింగిల్‌) మరియు నిజామీ (2 సర్వ్‌) పరిమాణాలలో లభ్యమవుతుంది. ఈ ప్రత్యేకమైన దక్షిణ్‌–ఈ–ఖాస్‌ కెబాబ్స్‌ సైతం దక్షిణ భారత రుచులను కలిగి ఉంటాయి. ఈ  సీజన్‌లో  సందర్శకులందరికీ కూడా  ఇప్పుడు ప్యారడైజ్‌ ఫుడ్‌ను ఆస్వాదించడానికి మరిన్ని కారణాలున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా తమ ప్రమాణాలను కొనసాగిస్తోన్న ప్యారడైజ్‌కు మిగిలినది వదిలేయండి.  మహమ్మారి కాలంలో కూడా, భద్రతా ప్రమాణాలు మరియు  నాణ్యత నియంత్రణ ప్రమాణాలను అనుసరిస్తున్నామన్న భరోసాను ప్యారడైజ్‌ అందించింది. మీ టేబుల్‌ మీదకు ఆహారం సర్వ్‌ చేసే వరకూ కూడా ఆహారాన్ని అతి పరిశుభ్రమైన రీతిలో అందించడం జరుగుతుంది.

నూతన బిర్యానీ మరియు కెబాబ్స్‌ను విడుదల చేయడం గురించి ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ శ్రీ గౌతమ్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘దేశవ్యాప్తంగా బిర్యానీ ప్రేమికులందరికీ  ప్రామాణికమైన హైదరాబాదీ బిర్యానీని 1953 నుంచి సర్వ్‌ చేస్తుండటం పట్ల ప్యారడైజ్‌ బిర్యానీ వద్ద మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము. మేము ప్రయాణంలో మరింత ముందుకు వెళ్తున్న వేళ,  అత్యున్నత ప్రమాణాలతో కూడిన హైదరాబాదీ బిర్యానీ, అంటే దమ్‌ కుక్డ్‌ మరియు తాజాగా తయారుచేసిన బిర్యానీని మా ప్రతి ఔట్‌లెట్‌లోనూ అందిస్తున్నాము.  దాదాపు 70 సంవత్సరాల  వారసత్వం మరియు ప్రపంచశ్రేణి ఆహారాన్ని ప్రతి ఒక్కరికీ అందించిన చరిత్రతో భారతదేశపు మొట్టమొదటి, ప్రామాణికమైన క్యుఎస్‌ఆర్‌బ్రాండ్‌గా నిలువాలనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు మేము నూతన పదార్ధాల రుచులను ఆస్వాదించాలనుకునే ఆహార ప్రేమికుల కోసం ఆవిష్కరణల పరంగా నూతన అంశాలను జోడిస్తూ దక్షిణ్‌ డిషెస్‌ను  ఈ వినియోగదారులకు అందించనున్నాము’’ అని అన్నారు.  తాము విస్తరిస్తోన్న వేళ, అన్ని ఔట్‌లెట్లూ కంపెనీ ఓన్డ్‌ మరియు ఆపరేటెడ్‌ (కోకో)గా కొనసాగడంతో పాటుగా దశాబ్దాలుగా  ప్యారడైజ్‌ ప్రతిరూపంగా నిలిచిన అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నిర్వహిస్తాయి. 

ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఓఓ శ్రీ  సిద్ధార్‌ ్ధ అరోరా మాట్లాడుతూ ‘‘మా వినియోగదారులకు ఎల్లప్పుడూ అత్యుత్తమమైనది అందించడానికి మేము కృషి చేస్తుంటాము. హైదరాబాద్‌లో వృద్ధి చెందుతున్న కాస్మోపాలిటన్‌  సంస్కృతి  అవసరాలను తీర్చే క్రమంలో  దక్షిణ్‌ బిర్యానీ వచ్చింది.  ఈ నూతన డిషెస్‌,  అత్యంత రుచికరమైన దక్షిణ భారత వంటకాలైన ఇడ్లీ,  దోశల్లాగానే ప్రాచుర్యం పొందడంతో పాటుగా దక్షిణ భారత వంటకాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆశిస్తున్నాము’’ అని అన్నారు. 

ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ హెడ్‌– శ్రీ  కుషాగ్ర గుప్తా మాట్లాడుతూ ‘‘ మా మెనూలోకి   నూతన రుచులు చేరడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాము. జూలై నెలలో మేము విడుదల చేసిన ఫైరీ డిషెస్‌ తో ఏ విధంగా అయితే నూతన మైలురాయిని సృష్టించామో అదే రీతిలో మైలురాళ్లను సృష్టించ గలమనుకుంటున్నాము. భిన్న సంస్కృతులు నివసించే మహోన్నత నగరం హైదరాబాద్‌, ప్రపంచవ్యాప్తంగా ఇది సందర్శకులకు ఆతిథ్యం అందిస్తోంది. ఇప్పుడు సందర్శకులు కేవలం ప్రస్తుతం అందుబాటులోని రుచుల ఆస్వాదన మాత్రమే కాదు, మా నూతన వెరైటీలను  సైతం అంతే ప్రేమగా ఆస్వాదించగలరు. మా యాప్‌పై సైతం ఈ డిషెస్‌ అందుబాటులో ఉంటాయనే భరోసా అందిస్తున్నాము’’ అని అన్నారు.

ఈ ఫుడ్‌ చైన్‌ సంస్థ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో  ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్‌ చేసిన రెస్టారెంట్‌ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్‌ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ లో  అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా మరియు గోల్డెన్‌ స్పూన్‌ అవార్డు ను ఇండియా ఫుడ్‌ ఫోరమ్‌ వద్ద 2018లో అందుకుంది.   తెలంగాణా స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్స్‌, జీహెచ్‌ఎంసీ, టైమ్స్‌ ఫుడ్‌ అవార్డ్‌, ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణా, లైఫ్‌టైమ్‌ అావ్‌మెంట్‌ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది.

More Press Releases