ప్రతి ఆడపిల్ల చదువుల్లో సరస్వతిగా, శక్తిలో దుర్గాగా ఎదగాలి - ప్రముఖ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ

Related image


ఆడపిల్లలు శక్తి స్వరూపిణిగా మారినప్పుడే సమాజంలో వారికి సముచితస్థానం లభిస్తుందని ప్రముఖ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. ప్రతి ఆడపిల్ల చదువుల్లో సరస్వతిగా, శక్తిలో దుర్గాగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆడపిల్లలు శక్తివంతంగా మారినప్పుడే సమాజం అన్ని
రంగాల్లో ప్రగతి సాధిస్తుందన్నారు. ఆదివారం వర్గల్ లోని  మహాత్మా జ్యోతిభా ఫూలే బిసి గురుకుల బాలికల కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన  రాష్ట్రస్థాయి బాలికల స్సోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ప్రతి విద్యార్థి  చదువుతో పాటు తనకు ఇష్టమైన కళా రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు.

 శ్రద్ధతో చదివి  ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు గా ఎదిగి సమాజానికి సేవ చేయాలన్నారు.  ఎంతో మంది మహనీయులు మన దేశంలో  జన్మించారు,  అతి గొప్ప స్థానాన్ని సాధించిన వాళ్లు సైతం ఎన్నో సార్లు ఓటమిని చవిచూశారు. అవమానాలు ఎదురైనా,  అవరోధాలు ఎన్ని వచ్చినా  గమ్యాన్ని చేరాలని ఆయన విద్యార్థులకు సూచించారు.  ప్రతి బాలిక నేను శక్తిమంతురాలిని అన్న భావనతో ముందుకు సాగినప్పుడే  తాము ఆశించిన గమ్మస్థానాన్ని చేరి విజేతలుగా నిల్గుస్తారని ఆయన పిలుపునిచ్చారు.   ఈనెల 20వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఖోఖో, కబడ్డీ, చెస్ తదితర క్రీడా పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిభా ఫూలే బిసి గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు, ఉప కార్యదర్శి జి. తిరుపతి,  ఎజిఓలు కరుణాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఆర్ సి ఓలు కళాశాల  ప్రిన్సిపల్, టీచర్స్ పాల్గొన్నారు. ఈ స్పోర్ట్ మీట్ లో రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి 125 మంది చొప్పున 1250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ 14, 17,19 విభాగాల్లో విజేతలకు ట్రోఫీలు అందించారు.

More Press Releases