కేన్సర్ సోకిన 18 ఏళ్ల విద్యార్థి చేతిని కాపాడిన అమోర్ ఆస్పత్రి వైద్యులు

Related image

* మోచేతి వద్ద, ముంజేతిలో కేన్సర్ ఆనవాళ్లు
*  బాధితుడికి చేయి తొలగించాలన్న పలువురు వైద్యులు
 
హైదరాబాద్, అక్టోబర్ 20, 2022: కేన్సర్ సోకిన 18 ఏళ్ల విద్యార్థి కుడి చేతిని నగరంలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి అయిన అమోర్ ఆస్పత్రి వైద్యులు కాపాడారు. సరైన సమయానికి తగిన చికిత్స చేయకపోయి ఉంటే ఆస్టియో సర్కోమా సోకిన ఈ కేసులో చేతిని తొలగించాల్సి వచ్చేది.
 
గుంటూరు జిల్లాకు చెందిన ఈ విద్యార్థి మోచేతి దగ్గర వాపు, తీవ్రమైన నొప్పితో కొంతకాలంగా బాధపడుతున్నాడు. చాలా మంది వైద్యులు ఈ పరిస్థితికి చేతిని తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. కానీ, మెరుగైన చికిత్స కోసం ఆ విద్యార్థిని అమోర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడిని పరీక్షించగా, మోచేయి, ముంజేతి ప్రాంతాల్లో పెద్ద పరిమాణంలో కేన్సర్ కణాలు కనిపించాయి.
 
రోగి పరిస్థితి, అతడికి అందించిన చికిత్స గురించి అమోర్ ఆస్పత్రికి చెందిన ఆర్థో ఆంకాలజిస్ట్ డాక్టర్ బి కిశోర్ రెడ్డి మాట్లాడుతూ, "అతని చేతిని తొలగిస్తే.. అతడి ఉజ్వల భవిష్యత్తు దెబ్బతింటుంది. కానీ, అతని వయస్సు దృష్ట్యా మేము ముందుగా అతడికి కీమోథెరపీ అందించాము. కొన్ని సెషన్ల తర్వాత, మోచేతి ప్రాంతంలోని ఎముకతో పాటు క్యాన్సర్ భాగాన్ని (20 సెం.మీ x 10 సెం.మీ పరిమాణం కణితి) తొలగించడానికి ఒక శస్త్రచికిత్స చేశాం. అనంతరం, అతని పరిస్థితి మెరుగయ్యేందుకు ఆ ప్రాంతంలోని మోచేయి, సిరలను పునర్నిర్మించాము" అని తెలిపారు.
 
"ఆ యువకుడు ఇప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. క్యాన్సర్ పూర్తిగా పోయేందుకు మరికొన్ని కీమోథెరపీ సెషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. తిరిగి వచ్చే అవకాశం తక్కువే అయినా, భవిష్యత్తులో మళ్లీ వస్తే గుర్తించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అవసరమైన పరీక్షలు నిర్వహించాలి" అని డాక్టర్ కిశోర్ రెడ్డి వివరించారు.
 
మొదట్లో, కేన్సర్ సోకిన విషయం తెలిసి ఆ యువకుడి కుటుంబం ఒక్కసారిగా దిగాలు పడింది.  సరైన చికిత్స, సలహాల కోసం వాళ్లు తిరగని చోటు లేదు. శస్త్రచికిత్స తరువాత రెండు వారాల తర్వాత, ఆ యువకుడు తన పనులన్నింటినీ సాధారణంగా చేసుకోగలుగుతున్నాడు. ఇకపై పూర్తిస్థాయి సాధారణ జీవితం గడపగలడు.

More Press Releases