శీతాకాలం సమీపిస్తోన్న వేళ నూతన శ్రేణి హీటింగ్‌ అప్లయెన్సస్‌ పరిచయం చేసిన హింద్‌వేర్‌ స్మార్ట్‌ అప్లయెన్సస్‌

Related image

ఈ ఆవిష్కరణతో ,  బ్రాండ్‌కు  ఇప్పుడు  హీటింగ్‌ అప్లయెన్సస్‌ విభాగంలో 90 ఎస్‌కెయులు ఉన్నాయి

ఇండియా, అక్టోబర్‌ 2022 : భారతదేశంలో సుప్రసిద్ధ కన్స్యూమర్‌ అప్లయెన్సస్‌ బ్రాండ్‌ హింద్‌వేర్‌ స్మార్ట్‌ అప్లయెన్సస్‌  ఇటీవలనే తమ శ్రేణి ఉత్పత్తులను తమ వాటర్‌ హీటర్‌, రూమ్‌ హీటర్స్‌ విభాగంలో విడుదల చేసింది. తద్వారా తమ ప్రస్తుత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసేకోవడంతో పాటుగా ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌ లైన మార్కెటలలో తమ  మార్కెట్‌  స్థానాన్ని పునరుద్ఘాటించనుంది.

నూతన ఆవిష్కరణలలో, హింద్‌వేర్‌ క్వీక్‌ పోర్టబల్‌  వాటర్‌ హీటర్‌ ఉంది. ఇది వినియోగదారులకు అత్యున్నత స్థాయి ఫీచర్లను అందిస్తుంది. ఈ వాటర్‌ హీటర్‌లో అత్యున్నత స్ధాయి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. వీటిలో  పేటెంటెడ్‌ సూపర్‌ సేఫ్‌ ఇన్నోవేటివ్‌ షీల్డ్‌ డిజైన్‌ ; బర్న్‌/ఫైర్‌ ప్రొటెక్షన్‌ ; ఐపీఎక్స్‌ 7 సర్టిఫైడ్‌ షాకింగ్‌ ఫ్రూఫ్‌, ఆటో –కట్‌ ఆఫ్‌ ఫీచర్‌ మరియు ఓవర్‌ హీటింగ్‌ ప్రొటెక్షన్‌ ఉన్నాయి. సౌకర్యవంతంగా వినియోగించుకునేందుకు ఇది కార్డ్‌హోల్డ్‌ర్‌తో వస్తుంది మరియు  యూనిఫార్మ్‌ స్టాండలోన్‌ హీటింగ్‌ అందిస్తుంది.

ఈ కంపెనీ మొట్టమొదటిసారిగా ట్యాంక్‌లెస్‌ వాటర్‌ హీటర్‌ శ్రేణిని  రెండు  నూతన మోడల్స్‌ –హింద్‌వేర్‌ స్ట్రామ్‌ మరియు హింద్‌వేర్‌ విజ్‌ విడుదల చేసింది. ఇన్‌స్టెంట్‌ హీటింగ్‌తో కేవలం 5 సెకన్లలో వేడి నీరు అందిస్తుంది. ఈ మోడల్స్‌ విద్యుత్‌ ఆదా చేయడంతో పాటుగా  యాంటీ స్కేలింగ్‌ ఫీచర్స్‌తో వస్తాయి. హింద్‌వేర్‌ స్ట్రామ్‌ వాటర్‌ హీటర్‌  భారతదేశం వ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ స్టోర్ల వ్యాప్తంగా లభ్యమవుతుంటే ; హింద్‌వేర్‌ విజ్‌ను ప్రత్యేకంగా ఈ–రిటైల్‌  ప్లాట్‌ఫామ్స్‌ కోసం విడుదల చేశారు.  ఈ ట్యాంక్‌  లెస్‌ వాటర్‌ హీటర్లు జకుజ్జీతో కూడిన బాత్‌రూమ్‌లకు అత్యుత్తమంగా సరిపోతాయి. అలాగే బాత్‌రూమ్‌లలో స్పేస్‌ తక్కువగా ఉన్నచోట కూడా చక్కగా సరిపోతాయి.

ఈ నూతన  ఆవిష్కరణలను గురించి  హింద్‌వేర్‌ హోమ్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌ సీఈఓ మరియు హోల్‌టైమ్‌ డైరెక్టర్‌  శ్రీ రాకేష్‌ కౌల్‌  మాట్లాడుతూ ‘‘ మా వినియోగదారులకు అత్యుత్తమమైనది అందించాలనే లక్ష్యంతో మేము వినూత్నమైన ఉత్పత్తులను వారి డిమాండ్‌లకు అనుగుణంగా అందిస్తుంటాము. ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్‌ అట్లాంటిక్‌ తో మా భాగస్వామ్యం కారణంగా మా అప్లయెన్సస్‌ అన్నీ కూడా  అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండటంతో పాటుగా అంతర్జాతీయ  నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉంటాయి’’ అని అన్నారు.

 ఆయనే మాట్లాడుతూ ‘‘ గత సంవత్సర కాలంలో మా హీటింగ్‌ అప్లయెన్సస్‌ పోర్ట్‌ఫోలియోకు లభించిన స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ స్పందన అందించిన ప్రోత్సాహం కారణంగానే మేము మరింతగా మాఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నాము. ఈ విభాగంలో  మేము ప్రవేశించిన నాటి నుంచి మాకు చక్కటి తోడ్పాటును అందిస్తుంది.  మా వ్యాపారంలో  దాదాపు 15%కు ఇది తోడ్పాటునందిస్తుంది. పండుగ సీజన్‌తో పాటుగా  శీతాకాలం వస్తుండటం చేత  భారతదేశంలో వీటికి మరింత డిమాండ్‌ కలుగుతుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

ఈ పోర్ట్‌ఫోలియోకు మొత్తంమీద 20 నూతన ఎస్‌కెయులను జోడించారు. స్క్వేర్‌ మోల్డ్‌ స్టోరేజీలో రెండు  నూతన స్టోరేజీ వాటర్‌ హీటర్లలో హింద్‌వేర్‌ అమోలియో, అవిలియో ఉన్నాయి. ఇవి అత్యంత ఆకర్షణీయంగా రెడ్‌, బ్లూ, గ్రే రంగుల్లో లభిస్తాయి.  రెక్టాంగ్యులర్‌ క్యూబాయిడ్‌  విభాగంలో  హింద్‌వేర్‌ నైట్రో ఉంది.  ఇది అత్యున్నత భద్రతా ఫీచర్లు అయిన గ్లాస్‌లైన్‌ ట్యాంక్‌, కాపర్‌ హీటింగ్‌  ఎలిమెంట్‌ను సుదీర్ఘ మన్నిక కోసం కలిగి ఉంది.

ఈ బ్రాండ్‌ ఈ వాటర్‌ హీటర్లతో  పాటుగా ప్రీమియం  రూమ్‌ హీటర్లను సైతం పరిచయం చేసింది. ఈ విభాగంలో ఇతర ఆవిష్కరణలలో సంప్రదాయ హీట్‌ కన్వెక్టర్‌, ఫ్యాన్‌  రూమ్‌ హీటర్‌,  క్వార్ట్జ్‌ హీటర్‌, హాలోజెన్‌ రూమ్‌ హీటర్స్‌ ఉన్నాయి.

ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 1300 మంది డిస్ట్రిబ్యూటర్లు మరియు 13వేలకు పైగా రిటైలర్లు ఉన్నారు. అలాగే సుప్రసిద్ధ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
 

More Press Releases