గుండెకు రక్తప్రసారం లేని స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఎస్ఎల్‌జి ఆస్పత్రి వైద్యులు
* అన్ని రక్త నాళాలు పూర్తిగా మూసుకుపోవడంతో రోగి గుండెకు ఆగిన రక్త సరఫరా
* చికిత్స పొందుతున్నప్పుడే రెండుసార్లు కార్డియాక్ అరెస్టు, వెంటనే రీససిటేషన్
* ఆరోగ్యశ్రీ పథకంలో రోగికి సంక్లిష్టమైన చికిత్స
హైదరాబాద్, అక్టోబర్ 13, 2022: నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో వైద్యులు గుండెకు రక్తసరఫరా ఏమాత్రం లేని 46 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను కాపాడినట్లు గురువారం ప్రకటించారు. ట్రిపుల్ వెసెల్స్ డిసీజ్ వచ్చిన ఆ వ్యక్తికి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలన్నీ పూర్తిగా పూడుకుపోయాయి. దాంతో గుండె రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యం గణనీయంగా పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం పట్టణానికి చెందిన జి.శ్రీనివాస్ అనే వ్యక్తి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో అతడిని ఎస్ఎల్‌జీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతడి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు, కోలుకునే అవకాశాలు దాదాపు లేవు. అతడికి వాల్వు లీకేజి కూడా ఉంది. దురదృష్టవశాత్తు తొలుత చూపించిన ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు లేకపోవడం, అతడి సమస్యను సరిగా అంచనా వేయకపోవడంతో అత్యవసర పరిస్థితిలో హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది.
రోగి పరిస్థితి గురించి, అతడికి అందించిన చికిత్స గురించి ఎస్ఎల్‌జీ ఆస్పత్రి కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ జి.సుధీర్ మాట్లాడుతూ, “మా ఆస్పత్రికి తీసుకురాగానే రోగికి యాంజియోగ్రామ్, ఇతర ముఖ్యమైన పరీక్షలు చేయించాం. అతడి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేసేలోపే రెండుసార్లు కార్డియాక్ అరెస్టు కావడంతో రెండుసార్లూ రీససిటేట్ చేశాం. అతడి గుండెలో 8 సెంటీమీటర్ల పొడవైన బ్లాక్ ఉన్నట్లు గుర్తించాం. ఇది బహుశా మన దేశంలోనే అత్యంత పెద్ద బ్లాక్. దీనివల్లే గుండెకు రక్తసరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆ పూడికను ముందుగా ఎండర్‌టెరెక్టమీ అనే ప్రక్రియ ద్వారా తొలగించి, ఆ తర్వాత అతడికి బైపాస్ సర్జరీ చేసి, మూడు రక్తనాళాల పూడికలకు బైపాస్ చేశాం. దాంతో గుండెకు రక్తసరఫరా పునరుద్ధరణ జరిగింది” అని వివరించారు.
“సాధారణంగా గుండె రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యం ఎవరికైనా 60-65% ఉంటుంది. కానీ ఈ కేసులో అది 20%కు పడిపోయింది. బైపాస్ సర్జరీ చేసిన తర్వాత రోగి గుండెకు రక్తసరఫరా మళ్లీ మొదలైంది, అతడి గుండె రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యం 40%కు పెరిగింది. దాంతో అతడు సాధారణ పరిస్థితికి చేరుకున్నాడు. రోగి గుండె ఆరోగ్య పరిస్థితిని ఈ రోజు పూర్తిగా మళ్లీ పరీక్షిస్తే, అతడు బాగున్నాడని తేలింది” అని ఎస్ఎల్‌జీ ఆస్పత్రి కార్డియాలజిస్టు డాక్టర్ ఎం. భానుకిరణ్ రెడ్డి తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ జె.శ్రీనివాస్, కార్డియాక్ ఎనస్థీషియాలజిస్టు డాక్టర్ మానస, సుశిక్షితులైన నర్సింగ్ సిబ్బంది ఈ చికిత్సలో పాలుపంచుకున్నారు.
పూర్తిగా పూడుకుపోయిన రక్తనాళం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. అతడికి తీవ్రమైన గుండెనొప్పి, చెయ్యి, భుజం ప్రాంతంలో తీవ్రమైన ఒత్తిడి, ఊపిరి అందకపోవడం, చెమట పట్టడం, వికారం, కళ్లుతిరగడం లాంటి లక్షణాలు ఉన్నాయి. నిరంతర ధూమపానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అనియంత్రిత మధుమేహం, ఊబకాయంతో పాటు గుండె జబ్బులు కుటుంబంలో ఎవరికైనా ఉంటే వాటన్నింటినీ హెచ్చరిక సంకేతాలుగా చూడాలి. ఇలాంటివారికి ఆకస్మిక సమస్యలు రాకుండా ఉండాలంటే చురుకైన, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. శ్రీనివాస్ కేసులో అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద
...