చికిత్స- విలాసమా, అవసరమా?
* గుడ్‌మైండ్.కో సంస్థ ఆధ్వర్యంలో ప్యానల్ డిస్కషన్
* చర్చలో పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు
హైదరాబాద్, అక్టోబర్ 10, 2022: వేగంగా కదులుతున్న ప్రపంచంతోనే కొనసాగడానికి, వ్యక్తులు తరచు వారి దైనందిన జీవితంలో కొంత ఆందోళన, ఒత్తిడిని అనుభవిస్తారు. చికిత్స ఒక విలాసమా.. లేదా అవసరమా అనేది నేటి తరం సమాధానం ఇవ్వాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి. ఈ విషయమై సమగ్ర అవగాహన కోసం ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా గుడ్‌మైండ్.కో ఆధ్వర్యంలో ఒక ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు.
గుడ్‌మైండ్.కో అనేది ఒక మానసిక స్వస్థత వేదిక. ఇది మానసిక ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటు ధరలో ఉండేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. గుడ్‌మైండ్ సంస్థ ఎప్పుడూ ఆశావహ దృక్పథంతో ఉంటుంది. మానసిక చికిత్సలు పొందడానికి ప్రజలను ప్రోత్సహించేలా, అవి అందరికీ అందుబాటులో ఉన్నాయని ధ్రువీకరించేలా ఉత్తమ విధానాలను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఈ విషయంలో ఉన్న అపోహలతో పోరాడుతుంది. దీన్ని సానియా, ఫవాజ్ అనే ఇద్దరు కళాశాల విద్యార్థులు స్థాపించారు. దేశంలో మొట్టమొదటి స్టూడెంట్ ఫోకస్డ్ స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన ఎడ్వెంచర్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ గుడ్‌మైండ్.కోను ఇంక్యుబేట్ చేస్తోంది.
ఈ ప్యానెల్ చాలా వైవిధ్యమైనది. ఇందులో కౌన్సెలర్లు, వ్యవస్థాపకులు వక్తులగా ఉన్నారు. వారు తమ తమ రంగాలలో గొప్పగా పని చేస్తున్నారు. ఎడ్వెంచర్ పార్క్ సీఈఓ మేరాజ్ ఫహీమ్, కౌన్సెలర్ ప్రతిభా సోము, కౌన్సెలర్ సరోష్ సందానీ, డాక్టరైట్ సహ వ్యవస్థాపకురాలు జయంతి సుబ్రమణియన్ ప్యానెలిస్టులుగా ఉన్నారు.
ప్యానెలిస్టులు చికిత్స విషయంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక వ్యక్తి ఎంత తరచుగా చికిత్సను పొందాలనే దానిపై తమ ఆలోచనలను వివరించారు. ప్యానలిస్టులు సరోష్ సందానీ, జయంతి సుబ్రమణియన్ మాట్లాడుతూ “మానసిక ఆరోగ్యాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి, మనమంతా దాన్ని ఆరోగ్యం అనాలి తప్ప.. మానసిక ఆరోగ్యం అనకూడదు. దీని చికిత్స ఒక విలాసంలా కనిపించినా.. అది ఒక అవసరం అని అర్థం చేసుకోవాలి” అని చెప్పారరు. ఈ ప్యానెల్ డిస్కషన్‌కు నిజాం, షాదన్, సెయింట్ ఆన్స్, ఇతర కళాశాలల విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.