బెంగళూరు, చెన్నై నుంచి ఆఫ్రికా, అమెరికా, యూరప్, మరెన్నో ప్రాంతాలకు విమానాలతో విజయవంతంగా సాగుతున్న ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్
తన ప్రయాణ భాగస్వాముల కోసం హైదరాబాద్‌లో సెమినార్
• తన నెట్‌వర్క్, కనెక్షన్ల గురించి హైదరాబాద్‌లోని అగ్రస్థాయి ప్రయాణ భాగస్వాముల కోసం సెమినార్
• తొలుత ఫాక్ సెషన్, తర్వాత క్విజ్‌తో పాల్గొనేవారికి కాలక్షేపం
• బెంగళూరు నుంచి ఆడిస్ అబాబాకు విమానాలు విజయవంతం అయిన సందర్భంగా తన వాణిజ్య, ప్రయాణ భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్
• ప్రయాణ భాగస్వాములకు కాక్‌టైల్ మరియు డిన్నర్
హైదరాబాద్, అక్టోబర్ 7, 2022: ఆఫ్రియాలో అత్యుత్తమమైనది, మొత్తం ఖండంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ వారానికి మూడు రోజులు బెంగళూరు నుంచి ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాకు విమానాలు నడిపిస్తోంది. 2019 అక్టోబరులో తన మొట్టమొదటి విమానాన్ని ఈ మార్గంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ నడిపింది.
భారతదేశంలోని కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పేరుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతలకు పుట్టినిల్లు.
బెంగళూరు నుంచి ఆడిస్ అబాబాకు ఉన్న నాన్‌స్టాప్ సర్వీసు బి738/బి787 డ్రీమ్‌లైనర్ విమానాలతో ఈ దిగువ షెడ్యూలు మేరకు వెళ్తుంది.