తన మొదటి స్మాల్ ఫార్మాట్ మాల్ – స్టోర్ ను హైదరాబాద్ లో ప్రారంభించిన పీఎంజే జ్యుయల్స్
2024 ఆర్థిక సంవత్సరం నాటికి 100 స్టోర్లకు విస్తరణను వేగవంతం చేసే యోచన
26 సెప్టెంబర్ 2022, హైదరాబాద్: దక్షిణ భారతదేశం అమితంగా అభిమానించే ఫైన్ జ్యుయలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యుయలర్స్ నేడిక్కడ తన మొదటి స్మాల్ ఫార్మాట్ మాల్ – స్టోర్‌ను కొండాపూర్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ప్రారంభించింది. ఇది నూతన ఫార్మాట్లో పీఎంజే యొక్క మొదటి స్టోర్. దక్షిణ భారతదేశంలో పీఎంజే యొక్క 27వ మాల్, హైదరాబాద్‌లో 6వ స్టోర్. ఈ నూతన ఫార్మాట్ లోని స్టోర్, బ్రాం డ్ యొక్క భారీ స్థాయి విస్తరణ ప్రణాళికల ఉద్దేశాన్ని చాటిచెబుతుంది. ప్రముఖ కూచిపూడి నర్తకి, పద్మశ్రీ అవార్డు గ్రహీత, 1400 ఏళ్ల క్రితం కాకతీయుల కాలం నాటి ‘కాకతీయం’ను పునరుజ్జీవింపజేసిన జి పద్మజ రెడ్డి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు.
నూతన స్టోర్ విలక్షణ సౌందర్యాన్ని కలిగిఉంటుంది. కాలాతీత సంప్రదాయాన్ని, తాజా సమకాలీన డిజైన్లను మేళవించేదిగా ఉంటుంది. హస్తకళానైపుణ్యానికి అద్దం పట్టే వజ్రాభరణాలు, కెంపులు, పచ్చలు, నీలం ఇతర విలువైన రాళ్లతో కూడిన నగలు 18 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారంతో లభిస్తాయి. బ్రేస్లెట్స్, పెండెంట్స్, నెక్లెస్‌లు, ఇయర్ రింగ్స్, ఇంకా మరెన్నో డిస్ప్లేలో ఉన్నాయి. లైట్ వెయిట్ ఎవ్రీ డే వేర్, బహుమతిగా ఇచ్చే ఆభరణాలు, మీ అందాన్ని పెంచే నగలు లాంటివెన్నో వీటిలో ఉన్నాయి.
ఈ స్టోర్ గురించి పీఎంజే జ్యుయల్స్ ఎండీ దినేశ్ జైన్ మాట్లాడుతూ, ‘‘మా కొనుగోలుదారులు, శ్రేయోభిలా షుల పటిష్ఠ మద్దతు, మార్గదర్శకంతో మాత్రమే మేం ఈ మైలురాయి చేరుకోగలిగాం. మా మొదటి మాల్ – స్టోర్‌ను ప్రారంభించడం మాకెంతో గర్వనీయ సందర్భం. కొనుగోలుదారుల మారుతున్న ప్రాథమ్యాలకు, అం చనాలకు అనుగుణంగా పీఎంజే నడుచుకుంటోంది’’ అని అన్నారు.
‘‘పీఎంజే జ్యుయలర్స్ రిటైల్ విస్తరణ పథంలో ఉంది. ఈ స్మాల్ ఫార్మాట్ స్టోర్స్ అనేవి మా లార్జర్ ఫార్మాట్ స్టాండ్ – అలోన్ స్టోర్స్‌తో పాటుగా మా భారీ వృద్ధికి చోదక శక్తిగా నిలువనున్నాయి. కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ అందించే అపార అవకాశాలను పొందడంలో, నూతన తరం ఆశలు, ఆకాంక్షలు తెలుసుకోవడంలో కూడా ఇది మాకు తోడ్పడనుంది. కొనుగోలుదారులకు చేరువ అయ్యేందుకు, వారి అవసరాలను తీర్చేలా ఉత్పాదన శ్రేణిని అధికం చేసుకునేందుకు గాను ఈ స్టోర్స్‌తో మేం మా రిటైల్ విస్తరణను కొనసాగించను న్నాం’’ అని అన్నారు.
పీఎంజే జ్యుయల్స్ అనేది కాలాతీత డిజైన్లకు, అద్భుత హస్తకళానైపుణ్యానికి పేరొందింది. కుటుంబంలో భాగంగా ఉండే ఆభరణాలు అనేవి ఒక సెంటిమెంట్ అని, అవి తరతరాలకూ అలా చేతులు మారుతూ ఉండాలని విశ్వసిస్తుంది. వ్యాపారంలో నూతన ప్రమాణాలను నెలకొల్పడానికి సంబంధించి పీఎంజే యావత్ పరిశ్రమలోనే పేరొందింది. హస్తకళానైపుణ్యంతో కూడిన ఆభరణాలను పొందేలా ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
నూతన స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా పీఎంజే జ్యుయల్స్ సీఎఫ్ఒ కిరణ్ షిండే, సిఒఒ విన్సెంట్ బ్రగం జా మాట్లాడుతూ, ‘‘ఇది మాకు నూతన ప్రారంభం. మా విస్తరణను వేగవంతం చేసేందుకు ఈ నమూనా లోకి ప్రవేశించాలని మేం నిర్ణయించుకున్నాం. గత 3-4 త్రైమాసికాలుగా పెరుగుతున్న వ్యాపారం, పుంజుకున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ, 2024 చివరి నాటికి 100 స్మాల్ ఫార్మాట్ మాల్ – స్టోర్స్ కు విస్త రించాలని నిర్ణయించాం’’ అని అన్నారు.
‘‘మీ ఇంటికి దగ్గరగా ఉండే ప్రాంతంలో రిటైల్ షాపింగ్ సౌలభ్యాన్ని ఆనందిస్తూ, పీఎంజే వ్యక్తిగతీకృత ఆతిథ్యాన్ని అనుభూతి చెందాల్సిందిగా ప్రతీ ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు. పీఎంజే జ్యుయలరీ లో విక్రయమయ్యే ఆభరణాలు వివిధ స్వచ్ఛత, నాణ్యత పరీక్షలు పూర్తి చేసుకుని వస్తాయి. సహజ వజ్రాలు మాత్రమే వినియోగించబడుతాయి. హాల్ మార్క్ ధ్రువీకృతంతో ఉంటాయి. ఈ గ్రూప్ తన ఏ షోరూమ్‌లోనైనా కూడా ఆభరణాలపై జీవితపర్యంతం ఉచిత నిర్వహణను అందిస్తోంది.
పీఎంజే జ్యుయల్స్ గురించి:
పీఎంజే జ్యుయల్స్ విలాసవంతమైన ఫైన్ జ్యుయలరీకి ప్రతీక. విశిష్టమైన ప్రేమ కానుకలను కోరుకునే కస్ట మర్లకు నాణ్యమైన, వ్యక్తిగతీకరించిన సేవలను, నైపుణ్యవంతమైన మార్గదర్శకత్వాన్ని అందించడంలో ఇది ప్రఖ్యాతి చెందింది. యాభై ఏళ్లకు పైబడిన వారసత్వంతో పీఎంజే హైదరాబాద్ సంపన్న కుటుంబాలకు తరతరాలుగా ఫ్యామిలీ జ్యుయ లర్ గా ఉంటోంది.
డైమండ్ బ్రైడల్ జ్యుయలరీలో తిరుగులేని శ్రేణికి పేరొందిన పీఎంజే తన క్లయింట్లకు వారి కుటుంబంలో భాగం గా మారే అత్యంత విశిష్ట ఆభరణాలను అందిస్తోంది. పీఎంజే దక్షిణ భారతదేశంలో 27కి పైగా స్టోర్స్ కలిగి ఉంది. రోడ్ నెం. 10, జూబ్లీహిల్స్ లో ఉన్నమా ఫ్లాగ్ షిప్ స్టోర్ – ది హౌస్ ఆఫ్ పీఎంజే హైదరాబాద్ ల్యాండ్ స్కేప్ కు ఒక మైలు రాయిగా మారింది.