గుండె పరీక్షలకు ఎస్ఎల్‌జీ ఆసుపత్రిలో ప్రత్యేక ప్యాకేజి
* రూ.1,999తోనే అనేక రకాల పరీక్షలు, కన్సల్టేషన్ కూడా
* ప్యాకేజిని ఆవిష్కరించిన ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి వి ఎస్ సోమరాజు
హైదరాబాద్, సెప్టెంబర్ 26, 2022: గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. అంతర్జాతీయ గుండె దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆసుపత్రి గోల్డెన్ హార్ట్ పేరుతో ప్రత్యేక గుండె సంరక్షణ ప్యాకేజిని ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ ప్యాకేజి అమలవుతుంది. సాధారణంగా రూ.3,250 ఉండే ఈ ప్యాకేజిని ఈ ప్రత్యేక సందర్భంలో కేవలం రూ. 1,999కి మాత్రమే అందిస్తున్నారు. ఇందులో ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ హెమోగ్రామ్ (సీబీపీ మరియు ఈఎస్ఆర్), ఈసీజీ, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (సీయూఈ), 2డి ఎకో విత్ కలర్ డాప్లర్, గుండెవైద్య నిపుణుల కన్సల్టేషన్ ఉంటాయి.
ఈ ప్యాకేజీని ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి వి ఎస్ సోమరాజు, సీఈవో గౌరవ్ ఖురానా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా గుండె వైద్య నిపుణులు డాక్టర్ హరిరామ్, డాక్టర్ భానుకిరణ్ రెడ్డి, డాక్టర్ వల్లభ్ వేణు, డాక్టర్ భాస్కర్ త్రిపాఠి, డాక్టర్ వికాస్ కుమార్ శుక్లా, మరియు డాక్టర్ సుధీర్ కార్డియోథొరాసిక్ సర్జన్ తదితరులు పాల్గొన్నారు. ప్యాకేజి కింద పరీక్షలు చేయించుకోడానికి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 91 40 2378 5678. టోల్‌ఫ్రీ నెంబర్ 1800 599 2020. జంటనగరాల వాసులు ఈ ప్యాకేజిని ఉపయోగించుకుని, తమ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి వి ఎస్ సోమరాజు సూచించారు.