జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్ లో తెలంగాణకు అగ్రస్థానం: విజేతలను అభినందించిన హోంమంత్రి
గుజరాత్ రాష్ట్రంలో ని అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన 6 వ జాతీయ ప్రిజన్డ్యూ టి మీట్ లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు.విజేతలను హోం మంత్రి తన కార్యాలయంలో బుధవారం నాడు జరిగిన సమావేశంలో అభినందించారు. జైళ్ళ శాఖ డి జి జితేందర్ , ఐ జి రాజేష్ తదితర జైలు అధికారులు పాల్గొన్న సమావేశం లో అధికారులు జాతీయ డ్యూటీ మీట్ లో తెలంగాణ అగ్రస్థానం సాధించిన వివరాలను వెల్లడించారు. ఈ డ్యూటి మీట్ లో మొత్తం 19 రాష్ట్రాలు , 960 మంది క్రీడాకారులు పాల్గొన్నారనీ, మొత్తం మూడు రోజుల పాటు జరిగిన ఈ డ్యూటి మీట్ లో 68 మంది తెలంగాణా జైళ్ల శాఖ ఉద్యోగులు వివిధ క్రీడాంశాలల్లో పాల్గొని అద్భుతమైన ప్రతిభను కనబరచారని కొనియాడారు. ఆరు బంగారు, ఒక వెండి, రెండు రజత పతకాలతో పాటు నాలుగు ట్రోపీలు సాధించడమే కాక , అత్యధిక పతకాలు సాధించి తెలంగాణా రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. డ్యూటి మీట్ లో బృందానికి వరంగల్కేం ద్రకారాగార పర్యవేక్షాణాధికారి సంపత్ సారథ్యం వహించారు. అభినందన కార్యక్రమంలో దేశంలో మొదటి స్దానం సాధించినందుకు కృషి చేసిన జైళ్ల శాఖ డి.జి జితేంధర్ , ఐ.జి రాజేష్ లను హోం మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.