హైదరాబాద్‌లోని సన్‌సిటీ వద్ద తమ స్టోర్‌ ప్రారంభించిన రాయల్‌ ఓక్‌

Related image

·       భారతీయ నటి ఆదాశర్మ ఈ స్టోర్‌ను ప్రారంభించారు
·       అద్భుతమైన ఫర్నిచర్‌, అత్యంత అందమైన డెకార్‌ ఒకే చోట లభ్యమవుతుంది

హైదరాబాద్‌, 18 సెప్టెంబర్‌ 2022 : భారతదేశపు సుప్రసిద్ధ ఫర్నిచర్‌ బ్రాండ్‌ రాయల్‌ ఓక్‌  నేడు  హైదరాబాద్‌లో తమ 13వ స్టోర్‌ను సన్‌సిటీ (లంజర్‌హౌజ్‌  సమీపంలో)వద్ద ప్రారంభించింది. దేశంలో రాయల్‌ఓక్‌కు ఇది 135వ స్టోర్‌ కాగా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో సంస్థకు అతి పెద్ద స్టోర్‌గా కూడా నిలిచింది.  ఈ స్టోర్‌ను భారతీయ నటి అదా శర్మ ప్రారంభించగా, విజయ్‌ సుబ్రమణియన్‌ (ఛైర్మన్‌, రాయల్‌ ఓక్‌ ఇంటర్నేషన్‌ లిమిటెడ్‌), కిరణ్‌ చాబ్రియా (హెడ్‌ ఫ్రాంచైజ్‌ , రాయల్‌ ఓక్‌), మదన్‌ సుబ్రమణియం (మేనేజింగ్‌ డైరెక్టర్‌, రాయల్‌ ఓక్‌), ప్రద్యుమ్న కరణం (క్లస్టర్‌ హెడ్‌, హైదరాబాద్‌–రాయల్‌ ఓక్‌) సైతం పాల్గొన్నారు.
ఈ స్టోర్‌ ప్రారంభోత్సవంలో  ఆదా శర్మ మాట్లాడుతూ ‘‘ ఆసక్తికరమైన ఫర్నిచర్‌ ఇక్కడ ఉంది.  ఫర్నిచర్‌, డెకార్‌ గురించి పలు నూతన అంశాలను తెలుసుకునే అవకాశం కూడా నాకు కలిగింది. విభిన్నమైన డిజైన్లుతో అత్యంత ఆకర్షణీయంగా ఈ స్టోర్‌ ఉంది’’ అని అన్నారు
    
రాయల్‌ ఓక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మదన్‌ సుబ్రమణియం మాట్లాడుతూ ‘‘రాయల్‌ ఓక్‌ వద్ద మీరు అత్యద్భుతమైన  అంతర్జాతీయ డిజైన్లతో కూడిన ఫర్నిచర్‌  పొందవచ్చు. ఇల్లు, ఆఫీస్‌, ఔట్‌డోర్‌, ఇంపోర్టెడ్‌ ఫర్నిచర్‌ ఇక్కడ లభిస్తుంది. దాదాపు 200కు పైగా సోఫాసెట్లు, 100కు పైగా డైనింగ్‌ సెట్లు, 100కు పైగా బెడ్‌రూమ్‌ సెట్స్‌తో పాటుగా విస్తృత స్ధాయిలో ఆఫీస్‌, ఔట్‌డోర్‌ ఫర్నిచర్‌ లభించనుంది’’ అని అన్నారు.

    రాయల్‌ ఓక్‌ ఫ్రాంచైజీ హెడ్‌  కిరణ్‌ చాబ్రియా మాట్లాడుతూ‘‘ అనుభవపూర్వక అనుభవాలను పొందేలా షాపింగ్‌ను తీర్చిదిద్దాలనేది మా ప్రయత్నం. మా బ్రాండ్‌ అనుభవాలను మరింతగా పెంపొందించే రీతిలో   ఈ స్టోర్‌ తీర్చిదిద్దాము’’ అని అన్నారు

More Press Releases