మోకాలి శస్త్రచికిత్సలకు కిమ్స్‌లో అత్యాధునిక రోబో
* మిల్లీమీటర్ల స్థాయి వరకూ కచ్చితత్వం
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆపరేషన్లు
* వైద్యులూ సరిచేసేందుకు వీలు
* తొలిసారిగా ఈ తరహా రోబో సేవలు
* కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 16, 2022: మోకాలి మార్పిడి, తుంటి మార్పిడి శస్త్రచికిత్సల్లో సరికొత్త శకం ఆవిష్కృతమైంది. ఇలాంటి శస్త్రచికిత్సల్లో సాంకేతిక పరిజ్ఞానానిదే ప్రముఖ పాత్ర. అత్యాధునిక పరిజ్ఞానంతో, అత్యంత కచ్చితత్వంతో శస్త్రచికిత్సలను చేయగలిగే సరికొత్త రోబోను నోవోటెల్‌లోని హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ సినీనటులు సుధీర్‌బాబు, చాందినీ చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని రోబోను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన ఈ రోబో విశేషాలు, దీని ప్రత్యేకతలను కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ సాయిలక్ష్మణ్ అన్నే ఈ కార్యక్రమంలో వివరించారు.
"రోబోడాక్ అనే వైద్యపరమైన రోబో 1992లోనే రంగప్రవేశం చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వీటిలో పలురకాల మార్పులు వచ్చాయి. కానీ, మెరిల్ కంపెనీకి చెందిన క్యువిస్ అనే ఈ పూర్తిస్థాయి ఆటోమేటెడ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ పూర్తిగా విభిన్నమైనది, అత్యాధునికమైనది. ఇప్పటివరకు ఉన్న రోబోలు కటింగ్ టూల్స్‌లా, రోబోటిక్ ఆర్మ్‌లా మాత్రమే పనిచేసేవి. ఇది పేషెంటు సీటీ తీసి బోన్ 3డి మోడల్‌ను రూపొందిస్తుంది. దానిపై ప్లాన్ తయారుచేస్తుంది. కావాలనుకుంటే దాన్ని మనం మార్చుకోవచ్చు, లేదా దాన్నే తీసుకోవచ్చు. ఈ మొత్తం ప్రణాళికను ప్లానింగ్ స్టేషన్ నుంచి రోబోకు ఇదే చూపిస్తుంది. దాన్ని మనం నిర్ధారించగానే రోబోయే సొంతంగా కటింగ్ చేస్తుంది. ఇందులో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం ఉండటంతో.. అత్యంత సూక్ష్మస్థాయిలో తేడా ఉన్నా వెంటనే ఆగిపోతుంది. బోన్ మూమెంట్ మానిటరింగ్ కూడా ఉంటుంది. సాధారణంగా సర్జన్లు అయితే 3 మిల్లీమీటర్ల స్థాయిలో ఉండే సమస్యలను గుర్తించలేరు. కానీ ఇది ఒక మిల్లీమీటరు కంటే కూడా తక్కువ స్థాయిలోనూ గుర్తిస్తుంది. చేత్తో సర్జరీ చేస్తే ఎంతోకొంత వైబ్రేషన్లు ఉంటాయి. దానివల్ల స్వల్ప తేడాలు రావచ్చు. దీంట్లో అది ఏమాత్రం ఉండదు. లేజర్ తరహాలో కోత ఉండటంతో సమస్యలు రావు. ఆపరేషన్ ముందు, జరిగేటప్పుడు ప్రతిదాన్నీ మనం చూసుకోవచ్చు. ఇంతకుముందున్న రోబోలు పైన, కింద మాత్రమే ఎముకలను కట్ చేసేవి. ఇది మాత్రం దానికి కావల్సిన 8 కట్‌లూ ఇదే చేస్తుంది.ఇంప్లాంట్లు పెట్టడానికి అవసరమైన సూక్ష్మ రంధ్రాలనూ ఇదే చేస్తుంది. ప్రతి ఒక్క రోగికి వాళ్ల అవసరాలకు తగినట్లుగా చేయడంతోపాటు, హ్యూమన్ ఎర్రర్ లేకుండా చేయడంతో సర్జరీలు నూటికి నూరుశాతం విజయవంతం అవుతాయి.
ఏఐ వినియోగంతో కచ్చితత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ క్యువిస్ రోబో.. మిల్లీమీటరు కంటే తక్కువ స్థాయిలోనూ అత్యంత కచ్చితంగా కట్ చేయడంతో పాటు, ప్రతి స్థాయిలోనూ జరుగుతున్న ప్రక్రియను తెరపై వైద్యులకు చూపిస్తూ, ఎక్కడ కావాలంటే అక్కడ ఆపి, మార్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది. సాధారణంగా అయితే శస్త్రచికిత్సల్లో వైద్యులు రంపం లాంటి పరికరంతో ఎముకలను కోస్తారు. కానీ, ఈ రోబో విద్యుత్ రంపంలా పనిచేసి మిల్లింగ్ చేయడంతో ఎముకల