గురుకుల విద్య కు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Related image

“ప్రచురణార్థం”

 గురుకుల విద్య కు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.
 దేశంలో అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక
రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
 బీసీ ల కోసం 310 గురుకులాలు, స్టడీ సెంటర్లు, హాస్టళ్లు .
 నూతనంగా బీసీ 33 గురుకులాలు , 15 డిగ్రీ కళాశాలల మంజూరు.
 బీసీ గురుకుల విద్యకై 2014 నుండి రూ. 2979 కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ
ప్రభుత్వం.

హైదరాబాద్, 13 –సెప్టెంబర్ ,2022.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి నామమాత్రంగా కేవలం కొన్ని గురుకుల పాఠశాలలు ఉండేవి. తెలంగాణాలో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యాబోధన జరగాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె . చంద్ర శేఖర్ రావు గారు గురుకుల విద్యకు పెద్దపీట వేశారు. విద్యా పరమైన అభివృద్ది ద్వారానే బిసీ లలో నిజమైన అభివృద్ది సాధ్యమవుతుంది అని ఆకాంక్షించారు.
వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ఎ డ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీని జూలై 2014 లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

    
తెలంగాణ ఏర్పడకముందు కేవలం 19 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే నేడు 310 కి చేరాయి వీటిలో 142 జూనియర్ కళాశాలలు , 152 హైస్కూల్స్ , 16 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 2023-24 నుండి 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కళాశాలలు గా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటైన గురుకులాల్లో అందిస్తున్న నాణ్యమైన విద్యతో ఉన్నత చదువుల్లో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. 1,65,410 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. బీసీ గురుకుల విద్యని 2014-15 నుండి ఇప్పటివరకు రూ. 2979 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వం ఇటీవల నూతనంగా జిల్లాకు ఒకటి 33 బీసీ గురుకులాలు 15 డిగ్రీ కాలేజీలు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో తిన్నంత భోజనం పెడుతోంది. ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు తదితర సౌకర్యాలను అందిస్తోంది. అంతర్జాతీయ విద్యాసంస్థలకు దీటుగా నేడు తెలంగాణాలోని గురుకులాలు విద్యను అందిస్తున్నాయి.

    ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోదన తో పాటు కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్రూ మ్స్ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తుంది. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థి పైన సంవత్సరానికి 1 లక్ష 25 వేల రూపాయలను ప్రభుత్వం హెచ్చిస్తుంది . బీసీ గురుకులాలకు సంబంధించిన 2022 ఎస్.ఎస్.సి లో 97.53% ఉత్తీర్ణత , ఇంటర్ లో 93.84 శాతం ఉత్తీర్ణత సాధించారు.
తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులు దేశ, విదేశాల్లో ప్రామాణిక విద్యా సంస్థలలో సీట్లు సాధించి రాష్ట్రానికి గుర్తింపు తెస్తున్నారు. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ప్రవేశాలు సాధిస్తున్నారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 420 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 280 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. 46,457 మంది విద్యార్థులకు వసతి, బొర్డింగ్, సదుపాయాలను కల్పిస్తుంది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలతో రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ను దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల
వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని,  అందించే కేరియర్ గైడెన్స్ కేంద్రాలుగా రూపొందుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 16 బీసీ స్టడీ సర్కిల్ ,100 స్టడీ సెంటర్ల ద్వారా 1,25,000 మంది బీసీ యువతకు ఉద్యోగ ఉపాదిని శిక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

     _______________________________________________________________________
శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.

More Press Releases