ఏపీ ప్రాజెక్టులపై శ్రద్ధ చూపండి: కేంద్ర మంత్రిని కోరిన గవర్నర్ బిశ్వ భూషణ్

Related image

కేంద్ర ఇంధన వనరులు, సహజ వాయివులు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ను  మర్యాద పూర్వకంగా కలిశారు. ఉదయం రాజ్ భవన్ చేరుకున్న ఆయన గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తో భేటీ అయ్యారు. రాజ్ భవన్ లోనే అల్పాహార విందును స్వీకరించిన కేంద్ర మంత్రి అనంతరం గవర్నర్ తో పలు అంశాలను చర్చించారు. ఈ నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ విభజన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పలు విధాలుగా నష్టపోయిందని, రాష్ట్రం అభివృద్దికి అవసరమైన సహకారాన్ని అందించాలని మంత్రిని కోరారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బిశ్వ భూషణ్ కేంద్ర మంత్రిని కోరారు.

ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఓఎన్ జిసి కెజి బేసిన్ ను సందర్శించాలని గవర్నర్ ను ఆహ్వానించారు. ఉక్కు శాఖను కూడా నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు కర్మాగారానికి కూడా రావాలని హరిచందన్ ను కోరారు. ఇటీవల గవర్నర్ విశాఖపట్నంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ సంస్ధను సందర్శించగా, అక్కడ చేపట్ట వలసిన అభివృద్ది పనులపై కూడా వీరిరువురి మధ్య లోతైన చర్చ నడిచింది. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Press Releases