ఎస్బీఐ నూతన శాఖను ప్రారంభించిన తెలంగాణ స్పీకర్ పోచారం!

Related image

  • శాసనసభ ప్రాంగణంలో నూతన శాఖ

  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు

  • నూతన ఖాతా సైదిరెడ్డికి అందజేత 

శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నవీకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, శాసనసభ్యులు, శాసనసభ కార్యదర్శి నరసింహా చార్యులు, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ... 'శాసనసభ్యులు తమ నగదు లావాదేవీలు నిర్వహించుకోవడానికి అసెంబ్లీ ప్రాంగణంలోని ఈ బ్రాంచీ వీలుగా ఉంటుంది. శాఖను నవీకరించడంతో పాటు విస్తరించడంతో మరింతగా మెరుగైన సేవలను అందించవచ్చు. నా బ్యాంక్ అకౌంట్ కూడా ఈ శాఖలోనే ఉన్నది. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఇక్కడి సిబ్బంది తమ కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందిస్తున్నారు. వారికి నా అభినందనలు.'అని అన్నారు. ఈసందర్భంగా హుజూర్ నగర్ శాసనసభ స్థానం నుండి నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డికి నూతన ఖాతా పుస్తకాన్ని స్పీకర్ పోచారం, ముఖ్య అతిథులు అందించారు.

Pocharam Srinivas
SBI branch
Assembly
Hyderabad
Telangana

More Press Releases