ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదు: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Related image

  • ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలి

  • అధికారులు అలసత్వం వీడాలి

  • దేవాదాయ శాఖ అధికారుల‌తో మంత్రి స‌మీక్ష‌

ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ భూముల లీజ్ రెంట్లు,  భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న‌, ఆల‌య భూముల వేలం ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త‌, త‌దిత‌ర అంశాల‌పై మంత్రి అధికారుల‌తో చర్చించారు. ఆలయ భూముల వ్వహారంలో దేవాదాయ శాఖ అధికారులు కూడా అలసత్వం విడనాడాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ స‌మావేశానికి దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస రావు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

indrakaran reddy
Hyderabad
Telangana

More Press Releases