BC యువత విదేశీ ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ

పత్రికా ప్రకటన హైదరాబాద్ , 2-సెప్టెంబర్-2022.
 BC యువత విదేశీ ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ

 జ్యోతిబాపూలే ఓవర్సీస్ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం

 ప్రతి ఏటా 300 మందికి అవకాశం- వీటిలో 30 సీట్లు EBC లకు

 పేద మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం బరోసా

 విదేశీ ఉన్నత విద్యావకాశాలను కల్పిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ K. చంద్ర శేఖర్ రావు గారి నాయకత్వం లో ప్రభుత్వం వెనుకబడిన తరగతులలో విద్యాపరంగా ,సామాజికంగా ఉన్న అసమానతలను రూపుమాపడానికి ఫీజు రియింబర్స్మెంట్, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, హాస్టళ్ళు , గురుకులాలను ఏర్పాటు చేసే ప్రోత్సాహం అందిస్తున్నది. వీటితో పాటు విదేశాలలో ఉన్నత విద్య కలలను సాకారం చేసే దిశగా జ్యోతిభా ఫూలే విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నది. పేద మధ్యతరగతి బి.సి. కుటుంబాల పిల్లల విదేశీ విద్య కలలను ప్రభుత్వం సుసాధ్యం చేస్తున్నది. 2016 లో ఈ పథకాన్ని ప్రారంభించి వెనుకబడిన , ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విదేశాలలో మాస్టర్స్, పి.జి,పి.హెచ్.డి కోర్సులకు సహయం అందిస్తున్నది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ,కెనడా, సింగపూర్, జర్మనీ, న్యుజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాలలోవిద్య అభ్యసించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నది. ప్రతి సంవత్సరం 300 మంది విద్యార్థులను ఇందులో జనవరిలో 150 మందిని, ఆగష్టులో 150 మందిని ఎంపిక చేస్తారు. వీటిలో 15సీట్లు ఆర్థికం గా వెనుకబడిన విద్యార్థులకు రిజర్వు చేయబడతాయి. ఈ పథకం ప్రారంభమయిన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 330 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించబడింది. విద్యార్థులు

రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడే ఉన్నత విద్యను పూర్తిచేసి కొలువులు చేస్తూ బంగారు భవితవ్యానికి బాటలు వేసుకుంటున్నారు. 2016-17 నుండి 2022-23 వరకు ఆస్ట్రేలియాకు 1598 మంది ,కెనడాకు 927 ,ఫ్రాన్స్ కు 45, జర్మనీ 306 , న్యూజిలాండ్ 9 ,సింగపూర్ 17, సౌత్ కొరియా 3, బ్రిటన్ కు 842 అమెరికాకు 2874 మంది వెళ్ళిన విద్యార్థులు జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందారు. అమెరికా లోని ఫ్లోరిడా యూనివర్సిటీ , టెక్సాస్ యూనివర్సిటీ , మిచిగాన్ టెక్నాలజీ యూనివర్సిటీ మిన్నీసోటా యూనివర్సిటీ,కెనడా లోని కాంకోర్టీయ , లేక్ హెడ్ , వాటర్లు యూనివర్సిటీలు , యు.కే లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ హంచెరియా , వెస్ అల్ ఇంగ్లాండ్బ్రి స్టల్ ఫ్రెంచ్ క్యాంపస్ , ఆస్ట్రేలియా లోని బెల్బో ర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , స్విన్ బర్న్యూ నివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, జర్మనీ లోని ప్లేన్స్ బర్గ్ , బట్టోవాన్ గురికీ లాంటి యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొందారు. ఈ పథకానికి సంబంధించి విదేశీ విద్య ఉపకార వేతనాలకు ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం 5 లక్షలు దాటరాదు. డిగ్రీ లో కనీసం 60 శాతం మార్కులు కలిగి ఉండాలి.
-----------------------------------------------------------------------------------------------------------
శ్రీయుత కమిషనర్ , సమాచార పౌర సంబంధాల శాఖ , హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది

More Press Releases