జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు అడ్డంకులు తొలిగాయి - అల్లం నారాయణ
పత్రిక ప్రకటన 30-08-2022
సుప్రీం కోర్టు తీర్పుతో జర్నలిస్టులకు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపుకు అడ్డంకులు తొలగాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన అందరికీ న్యాయం చేస్తారని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.
ఇప్పటివరకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరగని పాత జూబ్లీహిల్స్జ ర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఈరోజు చైర్మన్ ను కలిసి ఒక అర్జీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిని కలిసి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా ప్రయత్నిస్తానని అల్లం నారాయణ వారికి హామీ ఇచ్చారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు గోపరాజు, మహేశ్వర్ గౌడ్, భూపాల్ రెడ్డి రవీంద్రబాబు మరో 20 మంది సభ్యులు మీడియా అకాడమీ చైర్మన్ ని కలిశారు.