సీతారామపురం కాలువ గట్టు వెంబడి పారిశుధ్యని మెరుగుపరుచాలి: వీఎంసీ కమిషనర్
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ: సీతారామపురం కొత్తవంతెన రైవస్ కాలువ గట్టు ప్రాంతాలను నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పర్యవేక్షించి కాలువ గట్టు ప్రాంతాలలో మంచినీరు సక్రమముగా ప్రజలకు అందే విధంగా ప్రణాళికాబద్దంగా తగు చర్యలు చేపట్టవలెనని అధికారులకు తెలియపరిచారు మరియు పరిసర గృహముల వారికి కాలువ గట్టు వెంబడి చెత్తవేయకుండా అవగాహన కల్పించవలేనని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంలో ఆయా పరిసర ప్రాంతాలలోని సైడ్ డ్రెయిన్ ద్వారా మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, పాడైన డ్రెయిన్లకు తగిన మరమ్మత్తులు నిర్వహించాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
తదుపరి సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందలి ట్రాన్స్ ఫర్ స్టేషన్, చెత్త వేయింగ్ మిషన్ యొక్క పనితీరు పరిశీలించి వివరాలు అడిగితెలుసుకొని, ప్లాంట్ చుట్టూ ప్రహరి నిర్మాణము పనులు వేగవంతము చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.