రాష్ట్ర ప్రజల్లో స్వతంత్ర పోరాట స్ఫూర్తిని కలిగించిన వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు - సి.ఎస్ సోమేశ్ కుమార్
*రాష్ట్ర ప్రజల్లో స్వతంత్ర పోరాట స్ఫూర్తిని కలిగించిన వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు - సి.ఎస్ సోమేశ్కు మార్
హైదరాబాద్, ఆగస్టు 22 :: రాష్ట్ర ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నింపేందుకై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రూపొందించి అమలు చేసిన
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ ఉత్సవ వేడుకల్లో తెలంగాణా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం, ప్రతీ విద్యార్థి, ఉద్యోగి, యువకులతోపాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ ఇంటి పండగలా భావించి మమేకమయ్యారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు . స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో సి.ఎస్ సోమేశ్కు మార్ ద్వి సప్తాహ వేడుకల నివేదికను తెలిపారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 546 సినిమా హాళ్లలో లో గాంధీ సినిమా ను చూపించడం ఒక చారిత్రకమని, ఈ సినిమాను దాదాపు 22.30 లక్షల స్టూడెంట్స్చూ సారని తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో గాంధీ సినిమాను విద్యార్థులకు చూపించడంపట్ల దేశంలోని అనేక రాష్ట్రాల
అధికారులు తమకు ఫోన్ చేసి అడిగారని వెల్లడించారు. అన్ని మండల కేంద్రాలతోపాటు అన్ని నగరాలలో నిర్వహించిన 1462 ఫ్రీడమ్ రన్ల లో దాదాపు 5 లక్షల మంది పాల్గొన్నారని అన్నారు. ఎంప్లాయిస్ తో 13,605 ఫ్రీడమ్ ర్యాలీలు నిర్వహించగా వీటిలో18 లక్షల మంది పాల్గొన్నారని చెప్పారు.. మన రాష్ట్రంలోని అన్ని ఇళ్లలకు దాదాపు 1.20 కోట్ల జాతీయ పతాకాలను ఉచితంగా అందచేశాం. ప్రతీ ఇంటిపై ఎగురవేసిన ఈ జెండాలన్నీ మన స్టేట్ లోనే తయారు కావడం సంతోషకరం అని అన్నారు..ఈ సందర్భంగా చేపట్టిన హరిత హారంలో 18,963 లొకేషన్ల లో 37,66,963 మొక్కలు నాటడం జరిగిందని పేర్కొన్నారు..
అబిడ్స్ లోని నెహ్రూ చౌరస్తాలో ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొని..ఈనెల 16 న,నిర్దేశిత సమయం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేసి జాతికి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చారని, ఇదే సమయానికి మొత్తం రాష్ట్రంలో 95 .23 లక్షలమంది సామూహిక గీతాలాపన చేశారని తెలిపారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో గాంధీ ఇజాన్ని తెలిపే ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశామని, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ లు సంయుక్తంగా ఆగస్టు 21 వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ లోని 75 పార్కుల్లో వజ్రోత్సవ సంగీత విభావరి నిర్వహించినట్టు సి.ఎస్ వివరించారు. సాంస్కృతిక శాఖ ద్వారా రవీంద్ర భారతిలో సాంసృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాల వల్లరాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా యువత, విద్యార్థుల్లో భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తి కల్గిందని వివరించారు.
---------------------------------------------------------------------------------
కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది..