పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్లలో మురుగునీటి పారుదల విధానం పరిశీలన: వీఎంసీ కమిషనర్
- అధికారులకు ఆదేశాలు: కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ముందుగా డివిజన్ పరిధిలో విధులు నిర్వహించు పారిశుధ్య కార్మికుల FRS మస్తరు విధానము పరిశీలించి, డివిజన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణకు సంబందించి డోర్ టు డోర్ చెత్త సేకరణ తీరును అడిగితెలుసుకొన్నారు. ప్రధాన వీధులలో రోడ్ స్విప్పింగ్ పూర్తి అయిన వెంటనే అంతర్గత రోడ్లు శుభ్ర పరచి 100 శాతం నివాసాల నుండి చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య సిబ్బంది ఆదేశించారు.
అదే విధంగా సైడ్ డ్రెయిన్లలో మురుగునీటి పారుదలకు అవరోధకరంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించి డ్రెయిన్ల ద్వారా మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలని అన్నారు. డివిజన్ పరిధిలో మంచినీటి సరఫరా విధానమునకు సంబందించి వాటర్ పైప్ లైన్ లీకేజిలు లేకుండా చూడాలని మరియు యు.జీ.డి నందలి మురుగునీటి పారుదలలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఎల్.పార్ధసారధి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.