తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం కేసీఆర్

Related image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.. తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాధను, పాపన్న జయంతి (ఆగస్ట్ 18) సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  

KCR
Telangana

More Press Releases