అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలో జాతీయతా భావనతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
అందుబాటు ధరలో పలు టెస్టులతో కూడిన ఫ్రీడం హెల్త్ ప్యాకేజిని ఆవిష్కరించిన ఆస్పత్రి
హైదరాబాద్, ఆగస్టు 15, 2022: నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలో సోమవారం భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా చేసుకున్నారు. భారతదేశం 75 ఏళ్ల పురోగతిని, ఈ దేశ ప్రజల చరిత్ర, సంస్కృతి, సాధించిన విజయాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను గొప్ప జాతీయ భావనలతో ఆస్పత్రి ప్రాంగణంలో ఘనంగా చేసుకున్నారు.
ఈ సందర్భంగా అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి సీఓఓ డాక్టర్ సత్వీందర్ సింగ్ సభర్వాల్ మాట్లాడుతూ, “ఈ మహోత్సవం భారతదేశ ప్రజలకు అంకితమైంది. వారు భారతదేశాన్ని దాని పరిణామ ప్రయాణంలో ఇంత దూరం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. రాబోయే సంవత్సరాల్లో మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయి. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు, ఇక్కడి సిబ్బందిలో ప్రతి సభ్యుడు, బలంగా.. ఆరోగ్యంగా ఎదగాలని ఆకాంక్షించే స్వతంత్ర భారతదేశ స్ఫూర్తికి వందనం చేస్తున్నాము” అని చెప్పారు.
ప్రతి సమాజ ఆరోగ్యం, ఆర్థిక పురోగతి మధ్య సంబంధాన్ని అనేక సంవత్సరాలుగా చేసిన అనేక అధ్యయనాలు నిరూపించాయి. మన భారతదేశం లాంటి సమాజం విద్యతో పాటు ఆరోగ్యంపైనా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. తద్వారా దేశం మొత్తం అభివృద్ధిని సాధించేలా చూడాలి. బలంగా ఎదగడానికి పోషకాహారం, ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టిని కొవిడ్ -19 మహమ్మారి మరింతగా పెంచింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆస్పత్రి ఫ్రీడం హెల్త్ ప్యాకేజిని ప్రకటించింది. ఇందులో భాగంగా కీలకమైన అన్ని పరీక్షలూ కలిపి అందుబాటు ధరలో కేవలం రూ.1947/- కే చేస్తారు. ఇందులో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఈఎస్ఆర్, సీయూఈ, ఫాస్టింగ్ మరియు పోస్ట్ పాండ్రియల్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, ఎక్స్-రే, 2డి ఎకో, పీఎస్ఏ, హెచ్‌బీఏ1సీ, అల్ట్రా సౌండ్ స్కానింగ్, సీరం యూరిక్ యాసిడ్, సీరం క్రియాటినైన్, టీఎస్‌హెచ్‌లతో పాటు ఫిజిషియన్, డైటీషియన్ కన్సల్టేషన్ కూడా ఉంటాయి.