ప్రత్యేక రాష్ట్ర సాధనకు జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయం: బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను తెలంగాణ సంక్షేమ భవన్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించి, తెలంగాణ భావజాల వ్యాప్తికి ప్రొఫెసర్ జయ శంకర్ తన జీవితాన్ని ధారపోశారని బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం. చంద్రశేఖర్ కొనియాడారు.
జయశంకర్ సార్ తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని బీసీ కార్పొరేషన్ జిఎం బాల చారి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు చేసిన సేవలు చిరస్మరణీయమని జయశంకర్ సార్ సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించడమే జయ శంకర్ సార్కు మనమిచ్చే గొప్ప నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత ఫెడరేషన్ చైర్మన్ ఉదయ్, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ విమల, ఇతర అధికారులు పాల్గొన్నారు.