అండర్ గ్రౌండ్ డ్రెయినేజి, మ్యాన్ హోల్ నుండి సిల్ట్ తొలగించు యంత్రంల పనితీరు పరిశీలించిన వీఎంసీ కమిషనర్
- అధికారులకు పలు సూచనలు
తదుపరి బెంజి సర్కిల్ నుండి రామవరప్పాడు వరకు గల జాతీయ రహదారి నందలి గ్రీన్ బెల్ట్ మరియు సెంట్రల్ డివైడర్ లలో మొక్కలను పరిశీలించి సెంట్రల్ డివైడర్ నందలి ఖాళిగా ఉన్న చోట్ల మొక్కలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పచ్చదనం పెంపొందించాలని మరియు ఇంపుగా పెరిగిన మొక్కలను ట్రిమ్మింగ్ చేయుటతో పాటుగా పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ ఉండునట్లుగా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజీవ్ గాంధీ పార్క్ నందు తుది దశలో ఉన్న ప్రవేశ ద్వారం మరియు పార్క్ నందలి చేపట్టిన వివిధ ఆధునీకరణ పనులను పరిశీలిస్తూ, చేపట్టిన ఆధునీకరణ పనులు అన్నియు సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పర్యటనలో సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, డిప్యూటీ ఇంజనీర్ యేసుపాదం మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.