పచ్చదనంతో శోభిల్లుతున్న తెలంగాణ పట్టణాలు
హైదరాబాద్: 5 ఆగస్టు,2022: తెలంగాణకు హరితహారంలో భాగంగా 142 పట్టణ స్థానిక సంస్థ (ULB)లలో అటవీశాఖ భాగస్వామ్యంతో పట్టణహరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక శాఖ పటిష్టంగా అమలు చేస్తున్నది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకి చెట్లు, ప్రకృతి, పర్యావరణ పట్ల ఉన్న మక్కువకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలలోని ప్రాంతాలను హరితక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. పట్టణ హరితహారం అమలును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు, పురపాలక, పట్టణభివృద్ధి శాఖ ఉన్నతాదికారులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. అందువల్లనే లక్ష్యాలను అధిగమించి మొక్కలు నాటారు. అదేవిధంగా మొక్కల మనుగడ కూడా 91% ఉన్నది.
పట్టణ స్థానిక సంస్థ (ULB )లలో హరితహారం వివరాలు:
* 142 ULBలలో నర్సరీలు
*142 ULBలలోని మొత్తం వార్డుల సంఖ్య: 3618
*142 ULBలలో ప్రస్తుతం ఉన్న నర్సరీలు: 1602 (సంఖ్యలు)
*142 ULBలలో గ్రీన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం 2021-22లో 141 ULBలకు ప్లాంటేషన్ లక్ష్యంగా 262.73 లక్షలను నిర్దేశించగా, లక్ష్యాలను మించి 264.81 లక్షలు మొక్కలు నాటడం జరిగింది. అంటే లక్ష్యాలను మించి 100.80% సాధించటం జరిగింది. వాటిలో 91% మొక్కలు బతికాయి.
*2022-23 లో జిహెచ్ఎంసి మినహా 141 ULBలకు ప్లాంటేషన్ లక్ష్యంగా 251.60 లక్షలుగా నిర్దేశించారు.
*2022-23 కోసం నర్సరీల లక్ష్యం 280.06 లక్షలు కాగా 235.20 లక్షలు మొక్కలు పెంచబడ్డాయి.
*HMDA, అటవీ శాఖ, ఇతర సరఫరాదారుల నుండి సేకరణ ద్వారా మరియు నర్సరీలలో సేకరిస్తున్న మిగిలిన మొక్కలు : 72.52 లక్షలు
*జూలై,2022 వరకు 72.88 లక్షల ప్లాంటేషన్ పూర్తయింది.
*142 ULB లలో ఇప్పటివరకు 2,290 పట్టణ ప్రకృతి వనాలు (ట్రీ పార్కులు)అభివృద్ధి చేయబడ్డాయి.
*2022–23లో అభివృద్ధి కోసం 1578 PPVలు/ట్రీ పార్కులు గుర్తించబడ్డాయి. మరో 234 PPVలు/ట్రీ పార్కుల స్థలాలను ఇంకా గుర్తించాల్సి ఉంది.
*142 ULBలలో బృహత్ పట్టణ ప్రకృతి వనాలు (BPPVలు) కోసం 141 స్థలాలను గుర్తించారు.
*2021-22 లో 77 ప్రాంతాలను అభివృద్ధి చేసి 7.76 లక్షల మొక్కలను నాటారు.
*వాటిలో 2022 లో జూలై వరకు మరో 2.11 లక్షల మొక్కలను నాటారు.
*142 ULBలలో మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ (MLAP): 745 స్ట్రెచ్‌లలో 1125.54 Kms రహదారి పొడవు గుర్తించబడింది
*అందులో 807.78 కి.మీ.ల రహదారి పొడవు ప్లాంటేషన్ 512 స్ట్రెచ్‌లలో 22.92 లక్షల మొక్కలు నాటడం పూర్తయింది.
గ్రీన్ బడ్జెట్ ప్రొవిజన్:
*2020-21లో, 141 ULBలలో రూ.251.32 కోట్లు (10% గ్రీన్ బడ్జెట్) కేటాయించబడింది, వీటిలో రూ.185.98 కోట్లు (74%) వివిధ భాగాల కింద ఉపయోగించడం జరిగింది.
*2021-22లో, గ్రీన్ బడ్జెట్‌కు రూ.283.72 కోట్లు (10% గ్రీన్ బడ్జెట్) కేటాయించబడింది. దానిలో రూ.188.55 కోట్లు వినియోగించబడింది.
*2022-23లో, గ్రీన్ బడ్జెట్ కోసం రూ.263.91 కోట్లు (10% గ్రీన్ బడ్జెట్) కేటాయించబడింది. దానిలో 02.08.2022 నాటికి రూ.37.46 కోట్లు వినియోగించారు.
తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్)
*హరితనిధి ట్రేడ్ లైసెన్స్‌ల నుండి సేకరించిన మొత్తం: రూ.128.87 లక్షలు
*ఉద్యోగులు & ప్రజాప్రతినిధుల మినహాయింపు: రూ. 14.28 లక్షలు
*హరితనిధికి జమచేసిన మొత్తం: రూ.143.15 లక్షలు
*హరిత శుక్రవారం కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా నీరు త్రాగుట, కలుపు తీయుట, బేసిన్ తయారీ, ట్రీ గార్డ్ ఏర్పాటు మొదలైన వాటితో అమలు చేయబడుతోంది, తద్వారా పట్టణ హరితవనాలు 100% మనుగడ సాగిస్తున్నాయి.