700 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 109 అర్బన్ ఫారెస్ట్ ల అభివృద్ధి
- హారితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 258 కోట్ల మొక్కలు నాటారు
- ఎనిమిదవ విడతలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వ లక్ష్యం
హరిత హారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ, హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అధారిటీ (HMDA) లు సంయుక్తంగా అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. అడవులను రక్షించాలి.. పచ్చదనం పెంచాలి.. అనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా “హరితహారం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హారితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 258 కోట్ల మొక్కలు నాటారు. ఎనిమిదవ విడతలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అటవీ సంరక్షణ, పునర్జీవ చర్యలతో రాష్ట్రంలో పచ్చదనం, పర్యావరణం పరిడవిల్లుతుంది. ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమం సత్పలితాలు ఇస్తుండంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శరాష్ట్రంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల అధికారులు ఈ హరిత హార కార్యక్రమం వివరాలను అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లో అటవీ సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శి గా ఉన్నది.
ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కలిగించేలా హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాదు నగరం, శివారు ప్రాంతాలలో రూ. 22 కోట్లతో HMDA ఆరు పార్కులను అభివృద్ధి చేసింది. హైదరాబాద్ మహానగర వాసులకు సరికొత్త ఉల్లాస వాతావరణం కల్పించడంతో పాటు ఆ పార్కులలో ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటుచేశారు.ఆ దిశగా మరో 6 అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) నగరవాసులకు ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజవర్గంలోని నాగారం, పల్లెగడ్డ, సిరిగిరిపురం, శ్రీ నగర్, తుమ్మలూర్, మన్యంకంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను ఇటీవల ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో భాగంగా HMDA, అటవీశాఖ అధికారులు రాష్ట్రంలో పచ్చధనం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్ గా మారిన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో అర్బన్ లంగ్ స్పేస్ క్రియేట్ చేసేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు ప్రజలు హర్షిస్తున్నారు.
నగర శివారు ప్రాంతం, రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజవర్గంలో రూ. 30 కోట్లతో అభివృద్ధి చేసిన ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను నాగారం, పల్లెగడ్డ, సిరిగిరిపురం, శ్రీ నగర్, తుమ్మలూర్, మన్యంకంచలో ఇటీవల ప్రారంభించారు. సందర్శకుల కోసం ఎంట్రీ ప్లాజా, విజిటర్స్ పాత్వే, ఇంటర్ప్రెటేషన్ షేడ్ సఫారి ట్రాక్, గజేబో, వాచ్ టవర్, గ్యాప్ ప్లాంటేషన్, అటవీ ప్రాంతం అంతా రక్షణ గోడ (చైన్ లింక్ ఫెన్సింగ్, సీ త్రూ వాల్), బోర్ వెల్, పైప్ లైన్, ఇతర సౌకర్యాలను కల్పించారు.
నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్క్: అవుటర్ రింగ్ రోడ్ కు 7 కిలోమీటర్ల దూరంలో మహేశ్వరం మండలం పెద్దపులి నాగారంలో 556. 69 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.8.17 కోట్ల వ్యయంతో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను H.M.D.A అభివృద్ధి చేసింది.
పల్లెగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్: మహేశ్వరం మండలం హర్షగూడ గ్రామంలో 87.41హెక్టార్ల విస్తీర్ణంలో రూ.2.98 కోట్ల వ్యయంతో పల్లెగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను H.M.D.A అభివృద్ధి చేసింది.
సిరిగిరిపురం అర్బన్ ఫారెస్ట్ పార్క్: మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామంలో 102.39 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.3.8 కోట్ల వ్యయంతో సిరిగిరిపురం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను H.M.D.A అభివృద్ధి చేసింది.
శ్రీనగర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శ్రీనగర్ గ్రామంలో 526. 91హెక్టార్ల విస్తీర్ణంలో రూ.8.34 కోట్ల వ్యయంతో శ్రీనగర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను H.M.D.A అభివృద్ధి చేసింది.
తుమ్మలూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్: కందుకూర్ మండలం తూమలూర్ గ్రామంలో 161.87 హెక్టార్ల విస్తీర్ణంలో తూమలూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను TSIIC అభివృద్ధి చేసింది.
మన్యంకంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్: కందుకూర్ మండలం లేమూర్ గ్రామంలో 58.78 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.3.49 కోట్ల వ్యయంతో మన్యంకంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను H.M.D.A అభివృద్ధి చేసింది.