424 మంది బ్యాంకింగ్ సఖీలకి డివైస్ లను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

Related image

హైదరాబాద్: డ్వాక్రా సంఘాల ద్వారా, ఆయా సంఘాల మహిళలకు, ప్రజలకు బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తూ, అందించే కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న బ్యాంకింగ్ సఖిలకు డివైస్ పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి, వాటిని సంబంధిత మ‌హిళ‌ల‌కు అంద‌చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సంద‌ర్భంగా 424 మంది బ్యాంకింగ్ సఖీలకి డివైస్ లను మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు. అలాగే డివైస్ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:

  • తెలంగాణ వచ్చాక సీఎం కెసిఆర్ నాయకత్వంలో మహిళల స్వయం సమృద్ధి కి ఎప్పుడూ లేనంత గా కృషి జరుగుతున్నది
  • గతంలో 2 లేదా 3 కోట్లు రుణాలు దొరికేవి కావు
  • ఇవ్వాళ 18 వేల కోట్లు రుణాలు అందుతున్నాయి
  • మహిళలు నమ్మకానికి నిదర్శనం
  • మహిళల సమస్యల మీద నాకు అవగాహన ఉంది
  • సీఎం గారు నాకు మంచి మంత్రి పదవి అప్పగించారు
  • మహిళల్లో చైతన్యం, పట్టుదల పెరిగింది, ఆర్థికంగా బాగా బలపడ్డారు.
  • గ్రామాలకు మంచినీటి సదుపాయాలు కలిగాయి. మహిళలు రోడ్ల మీదకు నీటికోసం రావడం తగ్గిపోయింది.
  • గతంలో గ్రామాలకు వెళ్ళాలంటే భయం కలిగేది. ఇప్పుడు గ్రామాల్లో కరెంటు, మంచినీరు, సాగు నీరు, పరిశుభ్రమైన పల్లెలు దర్శన మిస్తున్నాయి
  • పట్టణాలు, నగరాల నుండి గ్రామాలకు ప్రజలు వలస వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి
  • అలాగే కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మి...వంటి ఇంకా పథకాలు అమలు అవుతున్నాయి
  • భవిష్యత్తు లో బ్యాంకు సఖిల ప్రాధాన్యం పెరుగుతుంది
  • ఓపికగా పని చేయండి. అభివృద్ధిని సాధించండి
  • బ్యాంకు లింకేజీ – బ్యాంకు సఖీ ద్వారా మహిళా సంఘాలకు సేవలు అనేక బ్యాంకు సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.
  • ప్రత్యేకంగా గిరిజన మరియు కొండ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవల కోసం చాలా దూరం వెళ్ళ వలసి ఉంటుంది. 
  • ప్రస్తుతం మన తెలంగాణా రాష్ట్రంలో4 లక్షల 30 వేల 376 స్వయం సహాయక సంఘాలు, 46 లక్షల 23 వేల 135సభ్యులను కలిగి ఉన్నారు. 
  • సభ్యులు జమ చేసే పొదుపులు మరియు అప్పు తిరిగి చెల్లింపులన్నీ స‌ఖీ కేంద్రాల ద్వారానే చేయ‌వ‌చ్చు.
  • ఆర్ధిక లావాదేవీల నిర్వ‌హ‌ణ‌పై స్వయం సహాయక సంఘ సభ్యుల నుండి 424 మంది సభ్యులను ఎంపిక చేసి వారికి వారం రోజులు శిక్షణ ఇప్పించారు.
  • వీరికి IIBF (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్) సర్టిఫికేషన్ పరీక్ష నిర్వహించడం జరిగింది. 
  • CSC (కామన్ సర్విస్ సెంటర్) వారితో అనుసంధానం చేస్తూ ప్రతి బ్యాంక్ సఖికి మొబైల్ పరికరం ఇప్పించడం జరుగుతుంది. 
  • ఈ కార్యక్రమం వలన బ్యాంక్ సదుపాయాలు ప్రజల/స్వయం సహాయక సభ్యుల గడప వద్దకే తీసుకుపోవడానికి అవకాశం ఉంది. 
  • ప్రతి గ్రామస్థుడు తమ తమ ఆర్ధిక లావాదేవీలను బ్యాంక్ సఖి ద్వారా నిర్వహించుకోవచ్చు. 
  • ఒక్కొక్క బ్యాంక్ సఖికి 4 నుండి 5 గ్రామాలను అనుసంధానించడం జరుగుతుంది. 
  • ముందుగా 2000 గ్రామాలలో 424 శిక్షణ పొందిన బ్యాంక్ సఖీలు సేవలు అందించడం జరుగుతుంది.
  • మొబైల్ పరికరం ద్వారా ఆర్ధిక లావాదేవీలు నిర్వహించిన బ్యాంక్ సఖికి సేవా రుసుము లభిస్తుంది.
  • పేద నిరుపేద నిరుద్యోగ మహిళలకు వారికి వారి కుటుంబానికి ఇదొక చక్కటి జీవనోపాది లభిస్తుంది.
  • దీనివలన ఈ నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ ఉపాధితో పాటు వారు చేసిన లావాదేవీలపై 5 నుండి 8 శాతం సేవా రుసుము లభిస్తుంది. 
  • నెలకు మొదట్లో 5 నుండి 10 వేలు సంపాదించడంతో పాటు 2, 3 సంవత్సరాలలో 20 నుండి 25 వేలు సంపాదించుకునే వెసులుబాటు కలుగుతుంది. 
  • ఆర్ధిక సేవలతో పాటు ఇతర సేవలు ప్రభుత్వ పథకాలలో నమోదు చేసుకోవడం, బిల్లులు, ప్రయాణ/రవాణా టికెట్లు రిజర్వు చేసుకోవడం, ఆధార్ నమోదు మరియు నవవీకరించుట, ఆదాయ పన్ను శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కొరకు దరఖాస్తులు, కొత్త LPG కనెక్షన్ కోసం ధరఖాస్తు, రీఫిల్లింగ్ కొరకు బుకింగ్, ఇతర సేవలను కూడా గ్రామస్థులు వినియోగించుకోవచ్చు.  
  • భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలను మహిళల ద్వారా అమలు జరిగే పరిస్థితులు రావాలి
  • ప్రభుత్వాలు కూడా భవిష్యత్తులో మహిళల పై ఆధార పడే పరిస్థితులను మీరు తేవాలి
  • డిజిటల్ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
  • అప్డేట్ అవుతేనే, మనం ప్రస్తుత పరిస్థితులకు సరిపోయే విధంగా పని చేయగలం
  • సాంకేతిక పరిజ్ఞానం పై మహిళలకు మరింత శిక్షణ ఇస్తాం
  • మన ఐటీ మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో అనేక ఐటీ కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నాయి
  • అంటే మన రాష్ట్రం సాంకేతికతకు అడ్డాగా మారింది
  • ఇలాంటి అవకాశాలు మనకు కల్పిస్తున్న సీఎం కెసిఆర్, కేటీఆర్ లకు మనమంతా రుణపడి ఉంటాం
  • మన ఊరు మన బడి పథకం ద్వారా 7 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాల లను అభివృద్ధి పరుస్తున్నం
  • మీ పిల్లలు మాత్రమే కాదు, మీ గ్రామాల్లో పిల్లలను సర్కారు స్కూల్స్ లోనే చదివించాలి. అలా మీరు ప్రోత్సహించాలి
  • ఉత్పాదక రంగాల్లో మహిళలు రాణించాలి 
పి.ఆర్‌. ఆర్‌.డి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కామెంట్స్: 
  • గ్రామీణ స్వయం సహాయక సంఘాల ఆర్థిక ప్రగతికి తెలంగాణలో అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి
  • మహిళల ఆదాయ మార్గాలను పెంచాలంటే, వారి నైపుణ్యాలను పెంచాలి
  • ప్రతి మహిళ, పౌరుడు ఇవ్వాళ ఏదో ఒక బ్యాంక్ తో అనుసంధానం కలిగి ఉన్నారు
  • కానీ, బ్యాంకుల సేవలు అంతగా విస్తరించి లేవు. అందుకు వాటిని విస్తరించాల్సిన అవసరం ఉంది
  • ఈ నేపథ్యంలోనే, రాష్ట్రం నలుమూలల విస్తరించి ఉన్న మహిళా సంఘాల బ్యాంకింగ్ సేవలకు, ప్రజల సేవల కోసమే, మహిళా స్వయం సంఘాలకు శిక్షణ ఇచ్చి, బ్యాంకు సఖీ లను ఏర్పాటు చేస్తున్నాం
  • మహిళా సంఘాల సభ్యులతో మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తున్నాము
  • భవిష్యత్తులో మరిన్ని ప్రజా సేవలను బ్యాంక్ సఖీ ల ద్వారా అందించే వీలు కలుగుతుంది
  • గోపాల మిత్ర తరహాలో పశు మిత్ర వంటి అనేక కార్యక్రమాలు అమలు అవుతున్నాయి
  • ఏడాదిలోనే 70 వేల కొత్త ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు ముందుకు వచ్చారు 540 కోట్ల నిధులు వాళ్లు పొందారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ల‌క్షా 30వేల మందిని సిద్ధం చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాబార్డు జి.ఎం. సెల్వ‌మ్‌, ఎస్‌.బి.ఐ డి.జి.ఎం. న‌ట‌రాజ‌న్‌, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజ కిషోర్‌, సెర్ప్ బ్యాంకు లింకేజీ డైరెక్ట‌ర్ వై.ఎన్.రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, రాష్ట్రం నలు మూలల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల బ్యాంకింగ్ సఖీలు పాల్గొన్నారు.

More Press Releases