డ్రెయిన్ లలో మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలి: వీఎంసీ కమిషనర్

Related image

  • నగరంలో పారిశుధ్య పలనులు పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజ‌య‌వాడ‌: పటమట పంటకాలువ రోడ్డు, నిర్మలా కాన్వెంట్ రోడ్, పిన్నమనేని పాల్లి క్లినిక్ రోడ్ లలో పారిశుధ్య నిర్వహణ, డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల తీరు మరియు వెహికల్ డిపో నందు జరుగుతున్న డిపో ఆధునీకరణ పనులను  కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.

నిర్మలా కాన్వెంట్ రోడ్ ప్రారంభంలో వర్షపు నీరు డ్రెయిన్ ద్వారా ప్రవహించకుండా రోడ్డుపై నిలిచియుండుట గమనించి, సదరు డ్రెయిన్ లో సిల్ట్ యొక్క లోతు పరిమాణమును స్వయంగా పరిశీలిస్తూ, డ్రెయిన్ లెవల్స్ పరిశీలించి డ్రెయిన్ ద్వారా నీటి ప్రవాహం సక్రమముగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మలా కాన్వెంట్ రోడ్ల, పటమట పంటకాలువ రోడ్డు యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు డ్రెయిన్స్ ద్వారా మురుగునీటి పారుదల తీరును పరిశీలించి మురుగునీటి పారుదల సక్రమముగా జరగని డ్రెయిన్స్ నందు తక్షణమే సిల్ట్ తొలగింపు పనులను చేపట్టాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఓల్డ్ పి అండ్ టి కాలనీ బద్రయ్య నగర్, గాయిత్రి నగర్, పిన్నమనేని పాల్లి క్లినిక్ రోడ్ల యందలి ఫుట్ పాత్ లపై డ్రెయిన్లు శుభ్రపరచుట ఏర్పాటు చేసిన మ్యాన్ హోల్స్ మూతలను తొలగించి ఆయా డ్రెయిన్ యందలి సిల్ట్ మరియు నీటి ప్రవాహము యొక్క విధానము పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.

తదుపరి పూర్ణనందపేట వెహికల్ డిపో నందు చేపట్టిన ఆధునీకరణ పనులలో భాగంగా వాహనముల సర్విసింగ్ కొరకు నిర్మించిన షెడ్, ర్యాప్ మరియు డిపో ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఆఫీస్ బ్లాక్ మొదటి అంతస్తు యొక్క నిర్మాణపనుల యొక్క పురోగతిని పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా డిపో నకు వెళ్లు ప్రధాన మార్గం అభివృద్ధి పరచుటతో పాటుగా జంక్షన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు వి.చంద్ర శేఖర్, కె.కోటేశ్వరరావు, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి మరియు ఇతర అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

  • ప్రజా సమస్యలపై స్పందనలో వచ్చు అర్జీలు సత్వరమే పరిష్కరించాలి: మేయర్ 
  • స్పందనలలో 14 అర్జీలను స్వీకరించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నిర్వహించారు. ప్రజలు ఎదుర్కోను సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్య పునరావృతం కాకుండా వేగవంతముగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా పట్టణ ప్రణాళిక – 5,  ఇంజనీరింగ్ – 1, పబ్లిక్ హెల్త్ విభాగం – 3, ఎస్టేట్ విభాగం – 2, యు.సి.డి – 3 అర్జీలు వచ్చినవి. 

 
S.No
NAME OF THE PETITIONER, ADDRESS PHONE NUMBERSUBJECTDEPARTMENT
 
1
M.BALASUBRAHAMANYAM,  4-1-107. LAMBADI PET.9440158057REQUEST FOR REMOVE GATE IN COMMEN PLACE AT PLR TOWERS.CP
2P.SRINIVASA RAO, 4-33-5, BHIMANAVARIPET9440173314ISSUING OF PATTACP
3B.JAYAMANI, 19-1-2, RAJARAJESWARIPET7330249976NEIGHBOURS OCCUPIED THE PETITIONERS HOUSECP
4V.DHANA LAKSHMI, 61-8/3-9/2, KRISHNA LANKA.9440139736REQUEST FOR UGD CONNECTIONCE
5P.SRINIVASA RAO, 41-22-16, KRISHNA LANKA9573430766ROAD OCCUPATIONCP
6M.RATNA KUMARI,21-10/2-190, BUDAMERU MADYA KATTA.7337223528REQUEST FOR HOUSE INSTEAD OF TIDCO ALLOUTED PLLOTUCD
7J.PRAKASH, 36-8-8/1, GIRI PURAM.7674868337PERMISSION OF FOOD COURT VEHICLE.ESTATE
8K.NAGAMANI, 8-33-166, WYNCHPET.7330550934DWACRA GROUP PROBLEMUCD
9M.SATYANARAYANA LAL, 76-16-27/2, CHITTINAGAR9849352442BUFALLOW CATLE NEUSENCECMOH
10M.SRINIVASA RAO, 1-39, AMBAPURAM8886726111COMPLAINT AGAINST AP BT 2476 LORRY DRIVERCMOH
11A.RAMBABU, 24-9-130, RAMA NAGAR, SATYANARAYANA PURAM9573385383RATION CARD PROBLEMUCD
12P.NARAYANA, 41-18-11, KRISHNA LANKA9849058932RENT EXCEMPTION ASKED DURING LOCKDOWN PERIODESTATE
13P.VENKATA SWAMY, 43-106/1-174, INDIRA NAGAR6281204026ROAD ENCROACHMENT TO BE REMOVEDCP
14S.KOTESWARA RAO, 29-1-17, ACHARYA RANGA NAGAR7702800582RAIN WATER OVERFLOWING IN SIDE DRAINSCMOH

కార్యక్రమంలో అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్,  ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ మరియు ఇతర అధికారులు  పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 6 అర్జీలు.
     
జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 2 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక -1 అర్జీ, సర్కిల్ –3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 3 పట్టణ ప్రణాళిక విభాగం – 1, పబ్లిక్ హెల్త్ విభాగం – 1 అర్జీలు మరియు సర్కిల్ – 1 పరిధిలో ప్రజలు ఎటువంటి ఆర్జీలు అందించుట జరగలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.

More Press Releases