రెండోరోజు ఎంతో ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు

Related image

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రెండోరోజు సోమవారం కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. అనంతరం అంబారీపై అమ్మవారి ఊరేగింపును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. పోతురాజుల నృత్యాలు, మహిళల కోలాటం ప్రదర్శన, డప్పు చప్పుళ్ళతో అంబారీ ఊరేగింపుకు ముందు సాగారు. ఆలయ పరిసరాలు ఎంతో కోలాహలంగా భక్తులతో నిండిపోయాయి.

Talasani
Hyderabad
Telangana

More Press Releases