నగరంలో పారిశుధ్య నిర్వహణ విధానం మెరుగుపర్చాలి: వీఎంసీ కమిషనర్

Related image

  • క్షేత్ర స్థాయిలో స్వీపింగ్ మిషన్ల పనితీరు పరిశీలన: కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజ‌య‌వాడ‌ నగరంలో పారిశుధ్య నిర్వహణకు సంబంధించి స్వీపింగ్ మిషన్ల ద్వారా రోడ్లను శుభ్రపరచు విధానమును కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేసారు. నగర పరిధిలోని యం.జీ రోడ్, జాతీయ రహదారి, రమేష్ హాస్పిటల్ రోడ్, మహానాడు రోడ్, పంటకాలువ రోడ్, ఎన్.టి.ఆర్ సర్కిల్. కృష్ణలంక, రాజీవ్ గాంధీ పార్క్, కనకదుర్గ ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలోని  ప్రధాన రహదారులలో జరుగుతున్న రోడ్లు శుభ్రం పరుస్తున్న స్వీపింగ్ మిషన్ల యొక్క పనితీరును స్వయంగా పరిశీలించారు. నగరంలోని ముఖ్యమైన అన్ని ప్రధాన రహదారులలో ఏవిధమైన చెత్త లేకుండా చూడాలని మరియు రోడ్ మార్జిన్ ఫుట్ పాత్ మరియు డివైడర్ అంచుల వెంబడి ఎటువంటి డస్ట్ కనపడకుండా పూర్తి స్థాయిలో శుభ్రం చేయునట్లుగా చూడాలని ఆదేశించారు. వాహనముల యొక్క బ్రష్ క్రింద వరకు ఉండాలని, మిషన్ లో ఉన్న డస్ట్ గాలి ద్వారా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబందిత అధికారులు మరియు సిబ్బందికి సూచించారు.

అదే విధంగా యం.జి రోడ్ నందలి సబ్ కలెక్టర్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ నందు చెత్తను తరలించు వాహనములకు ప్రతి రోజు ఏవిధముగా ఆయిల్ నింపుతున్న విధానమును పరిశీలించి పలు సూచనలు చేసారు. మనోరమ హోటల్ వద్ద మరియు బస్ డిపో వద్ద బందరు కాలువ వంతెనపై రోడ్లను శుభ్ర పరస్తున్న వాహనముల పనితీరును పరిశీలించారు. తదుపరి కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై రెండు స్వీపింగ్ మిషన్ల ద్వారా జరుగుతున్న రోడ్లను శుభ్రం చేయు తీరును పరిశీలించారు.

అనంతరం రాజీవ్ గాంధీపార్క్ ఆధునీకరణ పనులలో భాగంగా చేపట్టిన ఎంట్రన్స్ గేటు రేనోవేషణ్ పనులను పరిశీలించి పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయునట్లుగా చూడాలని అధికారులకు సూచించారు. పార్క్ గోడ వెంబడి గల డ్రెయిన్ నందు పూడిక పనులు చేపట్టాలని మరియు ఫుట్ పాత్ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పద్మావతి ఘాట్ ఎదురుగా బస్ స్టాండ్ వద్ద పబ్లిక్ టాయిలెట్స్ యొక్క నిర్వహణ విధానమును పరిశీలించి సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరచాలని, టాయిలెట్స్ నందు తగిన మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఎల్లవేళలా పరిశుభ్రంగా అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు.

పర్యటనలో అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

More Press Releases