హాకా భవన్‌లో ఉచిత వైద్యశిబిరం నిర్వహించిన సెంచురీ ఆస్పత్రి
హైదరాబాద్, జూలై 5,
2022: నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన సెంచురీ ఆస్పత్రి పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా గల హాకా భవన్‌లోఉచిత ఆరోగ్య, వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించింది. సుమారు 150 మందికి ఇందులో పాల్గొని, ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దాంతోపాటు శిబిరంలో పాల్గొన్న వైద్యుల నుంచి సలహాలు పొందారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంట వరకు నిర్వహించిన ఈ శిబిరంలో రక్తపోటు, ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ వంటి పరీక్షలతో పాటు ఈఎన్‌టీ సమస్యలకు సంబంధించిన పరీక్షలు కూడా చేశారు. సెంచురీ ఆస్పత్రికి చెందిన ఈఎన్‌టీ వైద్య నిపుణులు డాక్టర్ అవినాస్ నల్లూరి, డీఎంవో డాక్టర్ జువైరియా అంజాద్ శిబిరానికి వచ్చి, ఈ పరీక్షల ఫలితాలను విశ్లేషించి, భవిష్యత్తులో ఏం చేయాలో వారికి తెలిపారు. ఇప్పటికే ఉన్న, లేదా ఉన్నాయని భావిస్తున్న సమస్యల కోసం మరిన్ని పరీక్షలు చేయించుకోవాలనుకునేవారికి కొంత రాయితీని కూడా సెంచురీ ఆస్పత్రి ప్రకటించింది.
ఈ సందర్భంగా సెంచురీ ఆస్పత్రి సీఈవో డాక్టర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ, “ఆరోగ్యం కోసం నడవడం అనేది మనిషి చేయగలిగిన అత్యంత మంచిపనుల్లో ఒకటి. మరింత మంది ప్రజలు రోజూ కనీసం కొంతదూరం నడవడం, ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహించాం. సెంచురీ ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది అంతా ఈ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నారు, ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడే వారికి మద్దతుగా నిలుస్తున్నారు” అని చెప్పారు. ఈ శిబిరంలో ఇంకా సెంచురీ ఆస్పత్రికి చెందిన వైద్యసిబ్బంది, నర్సులు పాల్గొని ప్రజలకు పరీక్షలు చేశారు.
సెంచురీ ఆస్పత్రి గురించి:
హైదరాబాద్ నడిబొడ్డున 220 పడకలతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా సెంచురీ ఆస్పత్రి ఏర్పాటైంది. అగ్నిమాపక మార్గదర్శకాలు, ఎన్ఏబీహెచ్ ప్రమాణాల ప్రకారం నిర్మితమైన ఏకైక ఆస్పత్రి ఇదే. సెంచురీ ఆస్పత్రి బృందంలో వైద్యనిపుణులు, నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియోథెరపిస్టులు, సోషల్ వర్కర్లు, వలంటీర్ సేవలు, సహాయ సిబ్బంది, వృద్ధుల చికిత్స నిపుణులు ఇలా ఎందరో ఉన్నారు.