పదో తరగతి ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల ప్రభంజనం

Related image

పదో తరగతి ఫలితాల్లో  బిసి గురుకుల విద్యార్థుల ప్రభంజనం

 వంద శాతం ఉత్తీర్ణత సాధించిన 77 గురుకులాలు
 467 మంది విద్యార్థులకు 10 జీపీఏ
 రాష్ట్ర సగటు కంటే ఎక్కువ శాతం ఉత్తీర్ణత
 97.53 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
 బాలురు 96.83, బాలికలు 98.04

రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో  మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల
విద్యార్థులు అత్యధిక మార్కులు కైవసం చేసుకున్నారు. బిసి గురుకుల విద్యార్థులు 97.53 శాతం ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు.


రాష్ట్ర సగటు కంటే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యా ద్వారానే తమ జీవితాల్లో మార్పు వస్తుందని గట్టిగా నమ్మిన బిసి విద్యార్థులు కరోనా కలిగించిన ఆటంకాలను లెక్కచేయకుండా చదువుపై ధ్యాస పెట్టి పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 142 మహాత్మా జ్యోతిబాఫూలే బిసి గురుకుల పాఠశాల్లో 77 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. పదో తరగతి పరీక్ష మొత్తం 10645 మంది  విద్యార్థులు  రాయగా అందులో 10381 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు ముందంజలో ఉన్నారు.  బాలురు 96.83 శాతం, బాలికలు 98.04 శాతం పాస్ అయ్యారు.  అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య గతం కంటే ఎక్కువ ఉందని అధికారులు తెలిపారు. 

 కరోనా సమయంలో విద్యార్థులందరికీ ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించి, విద్యార్థులకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సూచనలు అందించడంతోనే తమ పిల్లలు మంచి మార్కులతో పాస్ అయ్యారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను,  విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు,  ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారు, కార్యదర్శి మల్లయ్య బట్టు గారు ఒక ప్రకటనలో అభినందించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఉపయోగించుకుని విద్యార్థులంతా ఉన్నత విద్యను  అభ్యసించాలని వారు ఆకాంక్షించారు. 
Photo write up :- 

10 GPA సాధించిన మహాత్మా జ్యోతిబాఫూలే బిసి గురుకుల పాఠశాల
విద్యార్థులు

More Press Releases