ప్రజలకు ఆహ్లాదం మరియు ఆరోగ్యం అందించేలా ఆధునికీకరణ పనులు: వెల్లంపల్లి

Related image

  • డా.కె.ఎల్ రావు పార్క్ మరియు భవానిపురం రివర్ ఫ్రంట్ ఆధునీకరణ పనులకు శ్రీకారం
  • పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించాలనే లక్ష్యంగా రూ. 326 లక్షల విజయవాడ నగరపాలక సంస్థ సాదారణ నిధులతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చేపట్టిన అభివృద్ధి పనులకు పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి  కార్పోరేటర్లతో కలసి శంకుస్థాపన నిర్వహించారు. 46వ డివిజన్ నందలి డా.కె.ఎల్ రావు పార్క్ నందు రూ 2 కోట్ల నిధులతో ఆధునీకరణ పనులకు, రూ. 107.50 లక్షలతో  సితార జంక్షన్ నందు ల్యాండ్ స్కాపే, హార్డ్ స్కాపే పనులతో పాటుగా సితార జంక్షన్ నుండి గొల్లపూడి బైపాస్ రోడ్  గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి మరియు రూ. 18.50 లక్షల వ్యయంతో 40 వ డివిజన్ కృష్ణానది కట్ట పైన భవానిఘాట్ నందు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులకు  ప్రారంభించారు.

ఈ సందర్బంలో శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ.2 కోట్ల నిధులతో నేడు డా.కె.ఎల్ రావు పార్క్ నందలి ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయటం జరిగిందని, రాబోవు కొద్ది కాలంలో నగర ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవటం జరిగిందని అన్నారు. గత కొన్ని ఏళ్లగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోనని ఈ పార్క్ మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మేయర్ గారు పార్క్ ఆధునికరించాలనే ఉద్దేశ్యంతో నిధులు కేటాయించుట జరిగిందని పార్క్ నందు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బొట్టింగ్, ఇండోర్ షటిల్ కోర్ట్, స్క్రాట్టింగ్, వాకింగ్ ట్రాక్, పాత్ వే, యోగ ప్లాట్ పామ్, ఓపెన్ జిమ్ మొదలగు వాటిని  ఏర్పాటు చేయుటతో పాటుగా మరుగుదొడ్లు మర్మమ్మత్తులు నిర్వహించుట చర్యలు తీసుకోవటం జరిగిందని రాభోవు రోజులలో పశ్చిమ నియోజకవరానికే మనిహరంగా తీర్చిదిద్దుటకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని అన్నారు. 

ప్రజలకు ఆహ్లాదం అందించుటయే కాకుండా  ఆరోగ్యం అందించేలా పార్క్ ప్రక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ నందు కూడా ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలియజేసారు. అదే విధంగా భవానిపురం నందు 18 లక్షల రూపాయల వ్యయంతో  భవానిఘాట్ నందు రివర్ ఫ్రంట్ కృష్ణానది కట్ట పైన అభివృద్ధి పనులు చేపట్టుట జరిగిందని, విడతల వారిగా ఈట్ స్ట్రీట్, వాకింగ్ ట్రాక్ మొదలగు వాటితో పూర్తి స్థాయిలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, విజయవాడ నగరం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండునట్లు చర్యలు చేపట్టుతున్నట్లు ప్రజలు నగరపాలక సంస్థ వారితో సహకరించాలని అన్నారు.

అదే విధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 46వ డివిజన్ పరిధిలోని పురాతనమైన డా.కె.ఎల్ రావు పార్క్ నందు గతంలో ప్రజలకు ఆహ్లాదం మరియు వినోదం అందించేలా అందుబాటులో ఉన్న సౌకర్యాలు పూర్తిగా పాడై పూర్తిగా నిరుపయోగం ఉందని మేము అధికారం చేపట్టినప్పటి నుండి పార్క్ అభివృద్ధి మరియు కొండ ప్రాంత వాసులకు రోడ్లు, డ్రెయిన్, మెట్లు, త్రాగునీటి సరఫరా మొదలగునవి అభివృద్ధి పరచి డివిజన్ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా తగిన ప్రణాళికలను సిద్దం చేసుకొని అవసరమైన నిధులు కేటాయించుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వాటిని నిర్దేశిత గడుపులోపుగా ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు వెళుతున్నామని అన్నారు. 

అదే విధంగా రివర్ ఫ్రంట్ నందు పచ్చదనంతో అభివృద్ధి పరచుట జరుగుతుందని, ఇంకను మరిన్ని నిధులు సమకూర్చుకొని ఇక్కడు వచ్చు ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించుట ద్వారా వాకింగ్ చేసుకొనుటకు వచ్చు ప్రజలకు ఆరోగ్యకరమైన పరిసరాలుగా తీర్చిదిద్దుట జరుగుతుందని వివరించారు. స్వచ్చ్ సుర్వేక్షణ్ మరియు క్లైమేట్ స్మార్ట్ సిటీ లో మన నగరం ముందుకు వెళుతుందని, ఇంకను మెరుగైన ర్యాంకు కేవాసం చేసుకొనే దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలియజేసారు.

కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్లు  యరడ్ల అంజనేయ రెడ్డి, మైలవరపు మాధురీ లావణ్యలతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ ఉద్యాన వనశాఖా అధికారి శ్రీనివాసు, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, ఇతర అధికారులు స్థానికులు పాల్గొన్నారు.

VMC

More Press Releases