ఆత్మగౌరవంతో ఆర్థికంగా ఎదుగుతున్నబీసీలు
హైదరాబాద్ 21-జూన్- 2022: ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో సింహాభాగం కేటాయిస్తుంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తూ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక విశిష్ట పథకాలను అమలు చేస్తూ వివిధ కుల వృత్తులకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందిస్తూ అధిక మొత్తంలో నిధులు కేటాయించి ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ ఆర్ధిక సం.లో ప్రభుత్వం బిసి సంక్షేమం కోసం రూ.5697 కోట్లు కేటాయించడమే కాకుండా అవసరాన్ని బట్టి ప్రత్యేక నిధులు విడుదల చేస్తూ బిసి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది.
తెలంగాణ రాష్ట్రములో వందకుపైగా బీసీ కులాలకు చెందిన వారు జనాభాలో సగం గా దాదాపు - 2 కోట్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నది. -బీసీ, ఎ-7 శాతం, బి-10 శాతం, సి-1 శాతం, డి-7 శాతం, బీసీ ఇ -4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. బిసి-ఇ కేటగిరిలో 12 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ చట్టం చేసింది స్థానిక సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అలాగే అత్యంత వెనుకబడిన వర్గాల ఎంబీసీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1,000 కోట్లు కేటాయిస్తూ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నది.
రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న యాదవులు, గొల్ల కురుమలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ బడ్జెట్ లో గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కేటాయించింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం బహుళ ప్రయోజన ప్రాజెక్టు , ఇతర సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్దరణ తో నీటి వనరులు సమృద్దిగా ఉన్నాయి. రాష్ట్రం లోని వివిధ జలాశయాల్లో ప్రభుత్వమే రొయ్యలు,చేప పిల్లలను వదిలి మత్స్య సంపదను అభివృద్ధి చేస్తున్నది. గంగపుత్ర,ముదిరాజ్ కులాల వారికి ఉచితంగా చేపలు పట్టుకునే అవకాశం కల్పించింది. 2014 సంవత్సరంలో 2,637 కోట్ల రూపాయల మత్స్య సంపద ఉండేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రోత్సాహక చర్యల వల్ల నేడు 5,229 కోట్ల రూపాయల మత్స్య సంపద రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది.
తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం నేత కార్మికులతోపాటు,మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని కల్పించింది. బతుకమ్మ చీరల తయారీని అప్పగించింది. నిరంతరం ఉపాధి లభించే విధంగా చేసింది.నూలు రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ సదుపాయాన్నికల్పించింది. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు కూడా ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న BPL మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేయడానికి సిరిసిల్లలోని పవర్లూమ్ MACలు / SSI యూనిట్ల ద్వారా బతుకమ్మ చీరల ఉత్పత్తిని చేపట్టారు. 2022-23 సంవత్సరానికి, పథకం కింద రూ.400 కోట్లు కేటాయించబడింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌడన్నల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. తాటి చెట్ల రఖం వసూలు చేసే విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. అంతేకాకుండా రూ.7.98 కోట్ల బకాయిలను రద్దు చేసింది. గీత కార్మికులకు ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు గతంలో ఎక్స్ గ్రేషియా రూ.2 లక్షలు మాత్రమే లభించేది. తెలంగాణ ప్రభుత్వం ఆ పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచింది. గతంలో శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి 50 వేలు మాత్రమే పరిహారం లభించేది. తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలకు పెంచింది. గౌడ సోదరులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.ఈ రిజర్వేషన్ల ద్వారా 393 మద్యం దుకాణాలు రాష్ట్రంలోని గౌడ సోదరులకు లభించాయి. సమైక్య పాలనలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూసేసిన కల్లు దుకాణాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి తెరిపించింది. తద్వారా 2963 మంది లబ్దిపొందారు.
తాటి చెట్టునుంచి ఉత్పత్తి అయ్యే నీరాను సాఫ్ట్ డ్రింక్ గా ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలు చేస్తోంది. నీరా ఉత్పత్తి, సేకరణ కోసం రూ. 20 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. భువనగిరి దగ్గరలోని నందనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నెక్లెస్ రోడ్ లో నిర్మిస్తున్న నీరా కేఫ్ ను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది.
బీసీ కుటుంబాలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం స్టేట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎకనమిక్ సపోర్టు స్కీం ప్రవేశ పెట్టి స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం ఆర్ధిక చేయూతనిస్తోంది. రూ. 1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు అందించే ఆర్ధిక సాయం పై ప్రభుత్వం 60 నుంచి 80 శాతం సబ్సిడీలు అందిస్తున్నది. బీసీల్లో అనేక కులాలు కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాయి. వారికి చేయూత అందించడానికి ఫెడరేషన్లు పనిచేస్తున్నాయి. వాటన్నింటికీ ప్రభుత్వం సరైన రీతిలో నిధులు కేటాయించింది. వివిధ కుల వృత్తుల వారందరికీ అవసరమైన ఆర్ధిక సహకారం, పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.సంచార జాతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్తగా సంచార జాతుల ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.5 కోట్లు కేటాయించింది.
వెనుకబడిన కులాల సాధికారత, సంక్షేమానికి తెలంగాణలో బీసీ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ నెం. 25 ను జారీ చేసింది. 10 అక్టోబర్, 2016న కమిషన్ ను ఏర్పాటు చేసింది.
వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగుతల కుటుంబాల్లోని ఆడ పిల్లలకు, ఆర్ధిక ఇబ్బందుల నుంచి నిష్కృతి కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మిపథకాన్ని చేపటడ్డం జరిగింది. 1 ఏప్రిల్, 2018 నుండి ఈ ఆర్థిక సహాయాన్ని రూ.1,00116 ఆయా ఆడపిల్లలకు పెళ్ళి రోజున అందించడం జరుగుతున్నది.
సాంఘిక ఏకీకృత సాధనకు, కులరహిత, వర్గరహిత సమాజ నిర్మాణానికి దోహదపడుతూ కులాంతర వివాహాలు చేసుకొన్న జంటలకు ప్రోత్సహకాలను అందించటం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద రూ. 10,000 పారితోషికంతో పాటు ఒక అభినందన పత్రం, జంటలో ఒక్కరికి లేదా ఇద్దరూ వెనుకబడిన తరగతులకు చెందిన వారైతే అందజేయటం జరుగుతుంది.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అన్ని జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పై జాబ్ మేళాలు నిర్వహించబడ్డాయి. ఇందులో ఫైనాన్షియల్ & నాన్ ఫైనాన్షియల్ కూడా ఉన్నాయి. 217 మంది అభ్యర్ధులు ఫోర్ వీలర్లో మోటార్ డ్రైవింగ్ లో శిక్షణ పొందారు. వివిధ ట్రేడ్ లలో BC అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాన్ని అందించడం కోసం SETWIN & SERPS MOU అమలు చేయబడింది.UPSC -సివిల్స్)/RRB/SSC మరియు బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ యొక్క ఫౌండేషన్ కోర్సు కోసం ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ 27.11.2020 నుండి ఆరు నెలల పాటు BC అభ్యర్ధులకు ప్రారంభించబడింది మరియు పూర్తయింది. SBI POల కోసం ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ డిసెంబర్, 2020 నుండి జనవరి, 2021వరకు పూర్తయింది.
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అంటే. 02.06.2014 నుండి 2020-22 వరకు, -30284) అభ్యర్ధులు రాష్ట్రంలోని అన్ని BC స్టడీ సర్కిల్లలో శిక్షణ పొందారు, వీరిలో - 2188 (14.02%) మంది విజయం రేటు సాధించడం ద్వారా వివిధ విభాగాల్లో రాష్ట్ర/కేంద్ర మరియు బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్లో ఉపాధి పొందారు. 2020-21 సంవత్సరంలో కౌకూరులో ప్రింటింగ్ ట్రైనింగ్-కమ్-ప్రొడక్షన్ సెంటర్ స్థాపించబడింది. 2021-22 సంవత్సరంలో, 1404) S.I. ఆఫ్ పోలీస్ & పోలీస్ కానిస్టేబుల్లో శిక్షణ పొందారు. ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రాం ను 10524 మంది అభ్యర్ధులు వీక్షించారు. 2022-23 సంవత్సరంలో, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లతో సహా వివిధ కేటగిరీ స్టేట్ & సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు రిక్రూట్మెంట్ల కోసం కోచింగ్ ప్రోగ్రామును అందించడానికి 1,15,000 భౌతిక లక్ష్యాన్ని ప్రతిపాదించారు. ఆర్థిక లక్ష్యం రూ.26.53 కోట్లు.
558 మంది అభ్యర్ధుల్లో 244 మంది ఎంపికయ్యారు. సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శిక్షణ పొందిన 324 మంది అభ్యర్ధులలో 18 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. పోలీస్ కానిస్టేబుళ్లు: శిక్షణ పొందిన 578 మంది అభ్యర్థుల్లో 107 మంది అభ్యర్థులు. పంచాయిట్ సెక్రటరీ: 473 మంది అభ్యర్ధులలో శిక్షణ పొందిన 129 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. జూనియర్ లైన్మెన్ & Jr.Asst.cum-కంప్యూటర్ ఆపరేటర్: శిక్షణ పొందిన 644 మంది అభ్యర్ధులలో 418 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గ్రూప్.I, II & ॥ సేవల కోసం ఫౌండేషన్ కోర్సుకు కోచింగ్ ప్రోగ్రామ్ -896 అభ్యర్ధులకు అందించబడింది. -543 అభ్యర్ధులకు RRB, SSC & బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ కోసం ఫౌండేషన్ కోచింగ్ ప్రోగ్రామ్ అందించబడింది.
బి.సి. కార్పొరేషన్: వృతి శిక్షణతో పునాది, ఉన్న వూరిలోనే ఉపాధి - ఆధునిక నైపుణ్యాలను నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ BC కమ్యూనిటీకి చెందిన చాలా మంది యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. "హోమ్ అప్లయన్స్, మొబైల్ రిపేర్, MS ఆఫీస్ & టాలీ ప్యాకేజీలు, మోడరన్ టైలరింగ్ మొదలైన మార్కెట్ డిమాండ్ కోర్సులలో శిక్షణను అందించినట్లయితే వారు స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంది. 2019-20 సంవత్సరానికి -330 బీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కింద నైపుణ్యాభివృద్ధి శిక్షణ నల్గొండ, సూర్యాపేట మరియు రంగారెడ్డి జిల్లాలలో నిర్వహిస్తున్నారు. అధిక అర్హత కలిగిన సమర్ధవంతమైన శిక్షకులు, మంచి శిక్షణా పద్ధతి పాఠ్యాంశాలు, మంచి మౌలిక సదుపాయాల ద్వారా నాణ్యమైన శిక్షణను అందించడం. శిక్షణా కోర్సులు మహిళలకు ఆధునిక టైలరింగ్, వెల్డింగ్ & లాత్ మెషిన్ ఆపరేటింగ్, టూ వీలర్స్ గృహోపకరణాల మరమ్మతు, మొబైల్ రిపేరింగ్, ఆటో & కార్ ఎలక్ట్రిషియన్ నుండి బి.సి. నిరుద్యోగ యువత శిక్షణ పూర్తయిన తర్వాత, వారు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, స్థానిక గ్రామం, మండలం లేదా జిల్లా కేంద్రంలో స్వయం ఉపాధిని పొందుతారు. శిక్షణ తర్వాత, శిక్షణ పొందినవారు స్వయం ఉపాధిని పొందుతారు. మరియు భారీ కాలుష్యం, జంట నగర ప్రాంతాల ట్రాఫిక్ ను నివారించడం ద్వారా వారి కుటుంబం, బంధువులతో ఏకకాలంలో ప్రశాంతమైన స్థానిక వాతావరణంలో జీవిస్తారు. జంట నగరాల్లోని ప్రైవేట్ కంపెనీల ద్వారా ప్లేస్మెంట్ ఒప్పందంపై వారు అందించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తారు. సామాజిక వర్గాలకు కమ్యూనిటీ భవనాలు రాష్ట్ర రాజధానిలో 41 బీసీ కులాలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం మొత్తం 82.30 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. వీటి నిర్మాణాల కోసం 95.25 కోట్ల నిధులను విడుదల చేసింది. నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.