6,7,8 తరగతుల్లో ఖాళీల భర్తీ ప్రవేశపరీక్షకు 87.4శాతం హాజరు

Related image

  • ప్రశాంతంగా ముగిసిన పరీక్ష: మల్లయ్య బట్టు, కార్యదర్శి
హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులలో 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశపరీక్షకు 87.4మంది విద్యార్థులు హాజరయ్యారని కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన వారిలో 86.7 శాతం మంది, ఏడో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన వారిలో 89.8శాతం విద్యార్థులు, ఎనిమిదో తరగతి కోసం దరఖాస్తు చేసిన వారిలో 84.8  శాతం మంది విద్యార్థులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారని ఆయన పేర్కోన్నారు. ఆరో తరగతిలో 1223 సీట్లు, ఏడో తరగతిలో 893 సీట్లు, ఎనిమిదో తరగతిలో 636 సీట్లను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తామన్నారు.

Hyderabad
Telangana

More Press Releases