రాష్ట్రంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం
*హైదరాబాద్ జూన్, 18.* జూన్ 3వ తేది నుండి 18వ తేది వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడిన పల్లె ప్రగతి ఐదవ విడత కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి మానస పుత్రికైన పల్లెప్రగతి ఐదవ విడత కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయితీలలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో అందరూ గ్రామాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పల్లె ప్రగతి ఐదవ విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతలో 63 వేల కి.మీ. పొడువైన రోడ్డును, 36 వేల కి.మీ.పొడువైన మురుగు కాలువలను, 80 వేల 405 పబ్లిక్ ఇనిస్టిట్యూషన్లు తుడిచి శుభ్రపరచడం జరిగింది. 19 వేల 349 లోతట్టు ప్రాంతాలను, 1098 పనికి రాని బోరుబావులను, 1902 నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చి వేయడం జరిగింది. దీనికి తోడుగా 20 వేల 296
వ్యక్తిగత మ్యాజిక్ సోక్ పిట్స్, 3905 సామాజిక సోక్ పిట్స్‌ను నిర్మించడం జరిగింది. అంతే కాకుండా 1306 వైకుంఠదామాలకు విద్యుత్ సౌకర్యాన్ని, 1002 వైకుంఠదామాలకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించడం జరిగింది.
10 వేల 946 కి.మీ రోడ్డును అవెన్యు ప్లాంటేషన్ కొరకు గుర్తించడం జరిగింది. 17వేల 710 విద్యుత్తు స్థంబాలకు మూడవ వైరును, 1206 విద్యుత్తు మీటర్లు సమకూర్చబడ్డాయి. ఐదవ విడుత పల్లెప్రగతి కార్యక్రమంల్లో భాగంగా 6 లక్షల 51 వేల మంది శ్రమదానం ద్వారా వివిధ అభివృద్ధి కార్యక్రమాలో భాగస్వాములయ్యారు. *రాష్ట్రంలో పల్లె ప్రగతి సాధించిన విజయాలు* రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో తెలంగాణ గ్రామాల్లో మౌళిక సదుపాయల కల్పన, స్వచ్ఛమైన హరితగ్రామాలుగా రూపుదిద్దలన్నదే పల్లె ప్రగతి లక్ష్యం. పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రక్రియ కింద దేశంలోనే మొదటిసారిగా 12 వేల 769 గ్రామాలలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామంలో వర్కు కమిటీ, శానిటేషన్ కమిటి, స్ట్రీట్ కమిటీ, గ్రీన్ కవర్ కమీటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1269 గ్రామ పంచాయితీలలో చెత్త సేకరణ, హరితహారం క్రింద నాటిన మొక్కలకు నీటిని సరఫరా కొరకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది.
గ్రామంలో ఉదయం సేకరించిన పొడిచెత్త సేకరణకు డంపింగ్ యార్డులకు తరలించడానికి హరితహారం పథకం క్రింద నాటిన మొక్కలకు నీటి సౌకర్యం కల్పించడానికి ట్రాక్టర్, ట్రాలీ, టాంకరులను వినియోగిస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలోని గ్రామాలలో 116 కోట్ల రూపాయల వ్యయంతో 19 వేల 472 పల్లె ప్రకృతి వనాలు, 1555 కోట్ల రూపాయల వ్యయంతో 12 వేల 669 వైకుంటధామాలు, 318 కోట్ల రూపాయల వ్యయంతో 12 వేల 753 డపింగ్ యార్డుల నిర్మాణాన్ని పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. పల్లెప్రగతి కార్యక్రమం క్రింద గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి 2019 సంవత్సరం సెప్టెంబర్ మాసం నుండి ఇప్పటి వరకు 9 వేల 800 కోట్ల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంటు మంజూరు చేయబడిరది. గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమం, క్రింద అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రతి నెల 256 కోట్లు 66 లక్షల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగ విడుదల చేస్తున్నది. మృతులకు గౌరవ ప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి 10 గ్రామ పంచాయితీలు మినహా అన్ని గ్రామ పంచాయితీలో వైకుంఠదామాలు ఏర్పాటు చేయబడ్డాయి. నిర్మాణ చివరి దశలో ఉన్న మిగతా 10 వైకుంఠదామాల నిర్మాణం త్వరలోనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని 545 గ్రామీణ మండలాల్లో మండలానికి చొప్పున ఐదు నుండి 10 ఎకరాలలో 2725 బృహత్ పల్లె ప్రగతి వనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటికే 594 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయబడ్డాయి. మిగిలిన బృహత్ పల్లె ప్రకృతి వనాలు పురోగతిలో ఉన్నాయి. నెల రోజులలో బృహత్ పల్లెపకృతి వనాల నిర్మాణానికి చర్యలను చేపట్టడం జరిగింది. గ్రామాలలో వీధి దీపాలకు ఆన్ అండ్ ఆఫ్ సౌకర్యం కల్పించడానికి ప్రాధన్యత ఇవ్వబడిరది. అందులో భాగంగా 50,230 కిలో మీటర్ల పొడువైన థర్డ్‌వైర్ ఏర్పాటు చేయబడిరది. 330 కోట్ల రూపాయల వ్యయంతో 2,33,135 విద్యుత్తు స్థంబాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి గ్రామపంచాయితీలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి 251 కోట్ల మొక్కలను నాటి సంరక్షించడం జరిగింది. రోడ్లకు ఇరువైపుల 8305 కిలో మీటర్ల మేక బహుళ వరుసలో అవెన్యు ప్లాంటేషన్ చేపట్టబడిరది.
దేశంలో మొత్తం 67,044 గ్రామాలు ఓ.డి.ఎఫ్ ప్లస్‌గా ప్రకటించగా, అందులో 17,764 గ్రామాలు తెలంగాణ గ్రామాలే ఉన్నాయి. తెలంగాణలోని 10 గ్రామాలు దేశంలో ఉన్న అన్ని గ్రామాలలో మొదటి 10 గ్రామాలు ఉత్తమ గ్రామాలుగా అభివృద్ధికి అనవాలుగా ప్రకటించబడ్డాయి. అదే విధంగా దేశంలోని మొదటి 20 ఉత్తమ గ్రామాలలో 19 గ్రామాలు 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన గ్రామాలే. ఇది పల్లె ప్రగతి సాధించిన ఘన విజయంగా చెప్పవచ్చు.