భూగర్భ జలాలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది: విజయవాడ మేయర్

Related image

విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ నీరు వృధా కాకుండా పడిన నీరు అంతయు భూమిలోకి ఇంకేవిధంగా రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్ ను నిర్వహించాలని అన్నారు.

మనిషి నాగరికత నదీ తీరాలలోనే ప్రారంభమైనదని, పంచభూతాలలో నీటికి విశిష్ట స్థానం కలదని జలమే జీవనాధారం ప్రతి నీటి చుక్క విలువైనదని దానిని కాపాడు కోవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై గలదని, భవన నిర్మాణదారులు తప్పక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొనే విధంగా వారికీ అవగాహన కల్పించే కార్యక్రమము చేపట్టబడినదని, భూగర్భ జలాలు పెంపొందించు విధంగా నీటి వృధాను అరికట్టి సమర్దవంతముగా నీటిని వినియోగించుకొనే విధంగా మార్పు తీసుకురావటానికి నగరపాలక సంస్థ కార్యాచరణతో ముందుకు వెళుతోందని పేర్కొన్నారు.

కార్యక్రమములో  చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్ మరియు ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

More Press Releases