తెలంగాణ సాగునీటిరంగంలో సరికొత్త అధ్యాయం

Related image

  • తెలంగాణ కోటి ఎకరాల మాగాణా
  • సాగునీటి రంగానికి ప్రభుత్వం అగ్రస్థానం
  • రూ.1,.52,000 లక్షలకోట్లకు పైగా వ్యయం
  • నీటితీరువా పన్ను శాశ్వతంగా రద్దు
  • తిరుగులేని విధంగా స్థిరమైన నీటిపారుదల రంగం
  • ఒకప్పుడు తరుగుదల నేడు ఎదుగుదల
హైదరాబాద్: సాగునీటి రంగంలో తెలంగాణ ఒకపుడు తరుగుదలే తప్ప ఎదుగుదల లేని స్థితి. కానీ 2014 లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన అనేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వం సాగునీటి పారుదలకు అగ్రస్థానం ఇవ్వటంతో గత ఎనిమిదేళ్ళ వ్యవధిలో అత్యున్నత స్థితికి చేరింది. తెలంగాణ సస్యశ్యామలం కావాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిరకాల వాంఛ నెరవేరటంలో ఎన్నోమైలురాళ్ళున్నాయి. నీటి ప్రాజెక్టుల రూపకల్పనతో పాటు వాటిని నిర్ధేశించిన వ్యవధిలో పూర్తి చేసేందుకు పడిన తపన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఏన్నో సమావేశాలు, కార్యశాలలు ముఖ్యమంత్రి ముందుండి నిర్వహించారు. సుధీర్ఘ యజ్ఞం అయిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటంలో పలు మేధోమదన సదస్సులకు రూపరుప్ప కల్పన చేసి శరవేగంగా నిర్మాణం పూర్తయ్యేయే వ్యూహాత్మక చర్యలు తీసుకొన్నారు. ఫలితంగా ప్రాజెక్టులన్నీన్ని కూడా సరికొత్త రూపును సంతరించుకున్నాయి. అలాగే పాత ప్రాజెక్టులను విప్లవాత్మక రీతీలో ఆధునీకరించటం వలన సాగు నీటి విస్తీర్ణం పెరిగింది. రాష్ట్రంలోని సాగునీటి అత్యవసరాలను దృష్టి యందుంచుకొని ప్రాజెక్టుల రీడిజైనింగ్, రీ ఇంజనీరింగ్  వంటి వినూత్న ప్రణాళికతో కార్య క్షేత్రంలోకి దిగిన ప్రభుత్వం విజయవంతంగా ప్రాజెక్టులను చేపట్టింది.

కల్వకుర్తి, నెట్టంపాడు, కోయల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, తదితర ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసింది. ఫలితంగా సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. డిండి, గట్టు ఎత్తిపోతల, చనాకా- కొరాటాపోరాట తదితర ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. నాగార్జున సాగర్, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ వంటి పాత ప్రాజెక్టుల కాలువలను ఆధునీకరించింది.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం లోని ఎల్లూరు వద్ద శ్రీశైలం రిజర్వాయర్ ముందు తీరం నుండి ఐదు దశలలో నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం 35 వేల 200 కోట్ల రూ.లతో చేపట్టింది. 70 శాతం పనులు పూర్తియనాయి. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత రాకుండా ఉండేందుకు కాళేశ్వరం కార్పొరేషన్ తో అనుసంధానం చేసింది. ఈ ప్రాజెక్టు వలన నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వికారాబాద్, నారాయణపేట్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని ఎగువ ప్రాంతంలో కల 12.30 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు రూపకల్పన జరిగింది. ఈ జిల్లాల్లోని కరువు ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం ఈ ప్రాజెక్ట్.

సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్: గోదావరి నీటిని తరలించి భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తోందిస్తుంది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: ప్రపంచం లోనే అతిపెద్ద సాగునీటి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం . విభిన్న రీతిలో డిజైన్ చేసిన భారీ ప్రాజెక్టు ఇది. తెలంగాణలో సాగు నీటికి ఇంత వరకు నోచుకోని భూములకు నీటిని అందించేందుకు ప్రభుత్వం నిర్మించిన బహుళ దశల ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు లో భాగమైన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయింది.వాటితో ఆయా ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. సాధారణంగా రిజర్వాయర్ల నిర్మాణం నదీ మార్గంలో జరుగుతుంది. కానీ, దీనికి భిన్నంగా నదీ, వాగు ఏదీలేనిచోట అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ నిర్మాణం కావడం సాగునీటిరంగ చరిత్రలోనే ఒక అధ్బుతం.

అంతే కాకుండా గోదావరి నీటిని 90 మీటర్ల నుండి 618 మీటర్లకు ఎత్తి నీటిని తరలించే బృహత్తర కార్యాచరణ ఇందులో ప్రధానాంశం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటంలో తనకు తానే సాటి అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకున్నది. గోదావరి నదిపై మూడు బ్యారేజిలు, 20 మెగా నీటి లిఫ్ట్ లు, 21 పంపు హౌజ్ లు, 180 రిజర్వాయర్లతో పాటు 1832 కి.మీ పొడవునా సొరంగమార్గాలు, పైపులైన్లు, కెనాల్స్ నిర్మించారు. మూడు సంవత్సరాల వ్యవధి లో అతి భారీ ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు నెలకొల్పిందంటే అతిశయోక్తి కాదు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకానికి సైతం కాళేశ్వరం జలాలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రివర్స్ పండంపింగ్ అనే వినూత్న విధానాన్ని ఉపయోగిస్తున్నది. కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరం 100 టి.ఎం.సి ల నీరు నిల్వ ఉండేలా చేసింది.

నీటి పారుదల రంగం లో జరిగిన అభివృద్దితో ఆయకట్టు 119 శాతం పెరిగింది. సముద్రంలోకి వృధాగా వెళ్ళే గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవటంలో తెలంగాణ సఫలీకృతమైంది. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు మాటలలో చెప్పాలంటే “ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 45 లక్షల ఎకరాల భూమిలో రెండు పంటలు పండేందుకు సాగునీరు అందుతుంది. దీంతో తెలంగాణ లోని మిగిలిన ప్రాజెక్టులతో కలుపుకుంటే దాదాపు కోటి ఎకరాలకు మిగిలిన ప్రాజెక్టులతో కలుపుకొంటే నీరు అంది, సాగు భూములు సిరుల భూములు అవుతాయి”. “సాగు నీటి రంగంపై తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయం 1,52,000 కోట్ల రూ.లకు పెరిగింది. ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొనవచ్చు.

రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణo:

2014-15 లో తెలంగాణ  సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా, అధి 2020-2021 నాటికి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింధి. 2014-15 లో 68.17 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి ఉండగా 2020-21 నాటికి 218.51 లక్షల తన్నులకు ఉత్పత్తి పెరిగింధి. నేడు తెలంగాణ దేశానికే అన్నం పెట్టె అన్న పూర్ణగా అవతరించింది.

నీటితీరువా పన్నురద్దు: 
తెలంగాణరాష్ట్రం ఏర్పాటు కాకముందు రైతులు చెల్లించాల్సిఉన్న నీటితీరువా పన్ను బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రద్దు చేసింది. అంతే కాకుండా శాశ్వతంగా నీటిపన్నును రద్దుచేసి, రైతులకు ఉచితంగా సాగునీటిని అందిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణ సాగునీటి రంగంలో సరికొత్త అధ్యాయం గా నిలుస్తోంది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అవుతోంది.

More Press Releases